Others

ఎచటనుండి వీచెనో రుూ చల్లని గాలి’ (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తీవెలపై ఊగుతూ/ పూవులపై తూగుతూ..
ప్రకృతినెల్ల హాయగా...
తీయగా.. హాయగా.. పరవశింపజేయుచు

జాబిలితో ఆడుతూ/ వెనె్నలతో పాడుతూ
మనసు మీద హాయగా..
తీయగ/ మాయగ/ మత్తుమందుజల్లుచు..

ఈ పాటికి ఏ పాటో అర్థమైపోయ ఉంటుంది కదూ! తెలుగు సినిమా చరిత్రలో స్వర్ణయుగమని అందరూ అనుకునే కాలంలో ‘పని’ తెలిసిన దర్శకులూ, ‘మితి’ తెలిసిన నటులూ ఉండేవారు. సుమధుర స్వరాలు సమకూర్చే సంగీత దర్శకులూ, మరింత మధురంగా వాటిని పాడే గాయనీ గాయకులూ ఎంతోమంది. అలాంటి కాలంలో తయారైన చిత్రమే విజయావారి ‘అప్పుచేసి పప్పుకూడు’. 1959లో విడుదలైన ఈ చిత్రాన్ని నాగిరెడ్డి, చక్రపాణిలు నిర్మిస్తే, దిగ్గజ దర్శకుడు ఎల్‌వి ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని పాటలన్నీ మధురమైనవీ, అందరికీ నచ్చేవే అయినా తలమానికంగా నిలిచే పాట మాత్రం -ఎచటనుండి వీచెనో రుూ చల్లని గాలి’ అన్న ఘంటసాల, లీల యుగళ గీతం. నాయికా నాయకులిద్దరూ మేడపైన చల్లని వెనె్నలలో (విజయావారి చంద్రుడు) ఆ ప్రక్కన ఒకరు, రుూ చివర ఒకరూ నిల్చుని ఆలపించిన ఈ మధుర గీత స్వరకర్త సాలూరి రాజేశ్వరరావు. ప్రేమను తెలుపుకోవడానికి ఇంతకన్నా మహత్తరమైన సన్నివేశమూ, పాటా కూడా ఆనాటి చిత్రాల్లో యింకొకటి కనబడదు. (ఈనాటి చిత్రాల సంగతి ప్రస్తావించనేల). సుమారు మూడున్నర నిముషాల పాట అప్పుడే అయిపోయిందా? అనిపిస్తుంది. పింగళి పాళీ, రాజేశ్వరరావు బాణీ, ఘంటసాల, లీల గాత్రాలు వీటన్నింటికీ సమానంగా రామారావు, సావిత్రిల అభినయమూ ఈ గీతాన్ని చిరస్మరణీయం చేశాయి. ఈ పాట వినకండి.. అనుభూతించండి. మెత్తని ఆ ఆనందమే వేరు.

-డిఎస్‌ఎస్, వక్కలంక