Others

భలే.. బిజినెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటీష్ ఇండియా కాలంలో దోపిడి ముఠాలుగా పేరొందిన థగ్గుల కథను రూ.200 కోట్ల వెచ్చించి యాష్ రాజ్ ఫిలింస్ తెరకెక్కించిన చిత్రం ‘్థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’. చైనా వినా నవంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం -బాలీవుడ్‌లో విడుదలకు ముందే మంచి మార్కెట్ చేసేసింది. అమీర్, అమితాబ్, కత్రినా, ఫాతిమా సనాలాంటి స్టార్లతో రూపొందిన చిత్రానికి దర్శకుడు విజయ్‌కృష్ణ ఆచార్య. ధూమ్ 3తో సంచలనం సృష్టించిన దర్శకుడి ప్రతిభ -్థగ్స్‌పై అంచనాలు పెంచడానకి ఒక కారణమైతే, అమితాబ్‌తో అమీర్ తొలిసారి తెరను పంచుకున్న చిత్రం కావడం మరో కారణం. ఈ చిత్రం హక్కుల కోసం షూటింగ్ సమయం నుంచే తీవ్ర పోటీ నెలకొనడం తెలిసిందే. అమీర్ గత చిత్రాలు దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్ కనకవర్షం కురిపించడమే అందుకు కారణం. సినిమా శాటిలైట్ హక్కులు కోరుతూ సోనీ రూ.70 కోట్లతో ముందుకొస్తే, డిజిటల్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ మరో రూ.70 కోట్లతో ముందుకొచ్చింది. అంటే రూ.140 కోట్ల వ్యాపారం ఈ రెంటితోనే జరిగిపోయింది. ఇక థియేట్రికల్ హక్కుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోపక్క ఒక్క చైనాలోనే థియేట్రికల్ హక్కులను ఈ స్టార్స్ ఫిలింస్ రూ.147 కోట్లతో సొంతం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. చైనాలో అమీర్ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో ఈ స్టార్స్ ఫిలింస్ భారీ రేటుతోనే హక్కులు సొంతం చేసుకుందని చెబుతున్నారు. మరోవైపు -చిత్రం వసూళ్లు కనుక 100 మిలియన్ డాలర్లు దాటేస్తే -ఆపైన వచ్చే కలెక్షన్లలో షేర్ కూడా యాష్ రాజ్ మాట్లాడుకుందని అంటున్నారు. అమీర్ సినిమాలకు యూఎస్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో గిరాకీ పెరుగుతుండటంతో, ఆయా ప్రాంతాల్లో హక్కుల బదిలీ ద్వారా ఎంత వస్తుందనేది ఇంకా అంచనాలు లేవు. సో -‘్థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ వ్యాపారం ఎంత హాట్‌హాట్‌గా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.