బిజినెస్

ఐడియా చేతికి వీడియోకాన్ స్పెక్ట్రమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ. 3,310 కోట్లతో గుజరాత్, పశ్చిమ యుపి సర్కిళ్ళ కొనుగోలు

న్యూఢిల్లీ, నవంబర్ 24: సంస్థాగతంగా దేశంలోనే తొలిసారిగా స్పెక్ట్రమ్ అమ్మకానికి తెరలేపుతూ ప్రైవేట్‌రంగ టెలికాం సంస్థలైన ఐడియా సెల్యులార్, వీడియోకాన్ టెలీకమ్యూనికేషన్స్ మధ్య ఓ డీల్ జరిగింది. ఇందులోభాగంగా గుజరాత్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ సర్కిళ్ళలోని స్పెక్ట్రమ్‌ను ఐడియా సెల్యులార్‌కు వీడియోకాన్ టెలీకమ్యూనికేషన్స్ అమ్మేస్తోంది. 3,310 కోట్ల రూపాయల విలువైన ఈ ఒప్పందంపై మంగళవారం ఇరు సంస్థలు సంతకాలు చేశాయి. ఈ స్పెక్ట్రమ్‌ను వచ్చే ఏడాది ఈ సర్కిళ్ళలో ప్రారంభించే 4జి సేవలకు వినియోగించాలనుకుంటోంది ఐడియా సెల్యులార్. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో దేశవ్యాప్తంగా ఉన్న 10 సర్కిళ్ళలోని 750 పట్టణాల్లో 4 జి సేవలను అందుబాటులోకి తేవాలనుకుంటోంది. కాగా, టెలికాం శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ లావాదేవీలు జరిగినట్లు ఓ ప్రకటనలో ఐడియా సెల్యులార్ స్పష్టం చేసింది. మరోవైపు తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్ సర్కిళ్ల స్పెక్ట్రమ్‌ను కూడా అమ్మాలని యోచిస్తున్నట్లు వీడియోకాన్ తెలిపింది. 3,500 కోట్ల రూపాయలకు వీటిని అమ్మాలని చూస్తోంది. 2012లో నిర్వహించిన వేలంలో పశ్చిమ, తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా సర్కిళ్లలో స్పెక్ట్రమ్‌ను వీడియోకాన్ టెలీకమ్యూనికేషన్స్ గెలుచుకుంది. అయితే ఆశించిన స్థాయిలో ఆదాయం లేని సర్కిళ్ళను ఇప్పుడు వదిలించుకోవాలని వీడియోకాన్ భావిస్తోంది.