తూర్పుగోదావరి

విధి నిర్వహణలో పోటీపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలీసు సిబ్బందికి డిఐజి హరికుమార్ పిలుపు
కాకినాడ సిటీ, డిసెంబర్ 22: విధినిర్వహణలో పోలీసు సిబ్బంది పోటీపడి పనిచేసినపుడే ప్రజలకు మనపై నమ్మకం కలుగుతుందని ఏలూరు రేంజి డిఐజి పి హరికుమార్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ముందుగా జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది నిర్వహించిన పెరేడ్‌ను తిలకించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్‌తో కలిసి ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది తమకు అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. విధినిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని డిఐజి హెచ్చరించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఉన్న పోలీసు క్యాంటిన్, వాహనాలు నిలుపుచేసే భవనం, పోలీసు కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయం, టైలరింగ్ సెంటర్, డేటా డిజిటలైజేషన్ సెంటర్, నూతనంగా నిర్మిస్తున్న పోలీసు కల్యాణ మండపం, పోలీసు క్వార్టర్స్, జిల్లా ఎస్పీ కార్యాలయం నూతన భవనం కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించి వాటి వివరాలను అధికారులను అడిగి తెలసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలోని వివిధ సెక్షన్‌లను సందర్శించి రికార్డులను తనిఖీ చేయడమే కాకుండా వాటి నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డిఐజి హరికుమార్ పోలీస్ ఉన్నతాధికారులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎఎస్పీ ఎఆర్ దామోదర్, ఒఎస్‌డి వై రవిశంకర్‌రెడ్డి, ఎస్‌బి డిఎస్పీ ఎస్ అప్పలనాయుడు, ఎఆర్ డిఎస్పీ విఎస్ వాసన్, కాకినాడ డిఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ ఎఆర్ వెంకటేశ్వరరావు, ఎస్‌బి సిఐ శ్రీనివాస్, ఆర్‌ఐ ఎఎన్‌ఎస్ హరి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.