కృష్ణ

జాతీయ రహదారుల వెంబడి రెస్టారెంట్లు, రెస్ట్‌హౌస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: జాతీయ రహదారుల వెంబడి విశ్రాంతి గదులు, రెస్టారెంట్స్, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల అమ్మకాల కొరకు షాపులు నిర్మించడానికి అనువైన ప్రదేశాలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ జిల్లా కలెక్టర్లను కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ శనివారం ఉదయం విజయవాడ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి 13 జిల్లాల కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి గొలుసుకట్టు చెరువులు, పంట సంజీవని (పంటకుంట) బోర్‌వెల్స్, ప్రజాసాధికార సర్వే అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ ఎస్‌పి టక్కర్ మాట్లాడుతూ గొలుసుకట్టు చెరువులపై అధికారులు దృష్టి సారించాలన్నారు. వర్షాలు పడుతున్నాయని నదులు, వాగులు, పాయల నీరు గొలుసుకట్టు చెరువులకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంట సంజీవని కింద చేపట్టిన పంటకుంటల తవ్వకం లక్ష్యాలను సాధించాలన్నారు. జాతీయ రహదారి వెంబడి డ్వాక్రా బజారు తరహాలో షాపులు ఏర్పాటుచేసి మార్కెటింగ్‌ను ప్రోత్సహించాలన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు ఈ షాపుల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారన్నారు. రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం ప్రాంతంలో జాతీయ రహదారి వెంబడి 30, 40 షాపుల ఏర్పాటుకు కలెక్టర్లు కృషి చేయాలన్నారు.
ప్రజా సాధికార సర్వేపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు.ఎ ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి పద్యుమ్న ఈ సర్వే నిర్వహణకు చాలా బాగా కృషి చేశారన్నారు.
ప్రజాసాధికార సర్వేకు ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా జాయింట్ కలెక్టర్లను, మున్సిపల్ స్థాయిలో మున్సిపల్ కమిషన్లను నోడల్ అధికారిగా నియమించాలన్నారు. ప్రతి జిల్లాలో 5, 6 మంది సూపర్ ట్రైనర్స్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సర్వేపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. దీనికొరకు అవసరమైతే జిల్లాల్లో మరొకసారి శిక్షణ ఇవ్వాలని సిఎస్ టక్కర్ చెప్పారు. ప్రతి జిల్లాలో ప్రజాసాధికార సర్వేకు సంబంధించిన ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్‌డివోలు, మండల స్థాయిలో ఎంఆర్‌ఓ, ఎండివో నోడల్ అధికారులుగా ఉండాలని సిఎస్ చెప్పారు. చార్జ్ అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం కలిగి ఉండాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు అందుబాటులో ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్లకు ఈ సర్వేపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అవసరం అనుకుంటే జిల్లా స్థాయిలో ఎన్యూమరేటర్లకు మరొకసారి శిక్షణ నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లేదా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సిబ్బందిని సర్వే చేయడానికి సన్నద్ధం కావాలని సిఎస్ చెప్పారు. జిల్లాలో వ్యవసాయం, రెవెన్యూ, ఉపాధి హామీ పథకం, విద్యుత్ శాఖలకు సంబంధించిన పనులు ఎప్పుడూ నడుస్తూ ఉంటాయి కాబట్టి ఈ సర్వేలో వారిని పెట్టకూడదన్నారు. ప్రతి జిల్లాలో ఒక బ్లాకును గుర్తించి పైలెట్ ప్రాజెక్టు నిర్వహించి సర్వేను సరిచూసుకోవాలని సిఎస్ కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వం వ్యూహాన్ని అధికారులు పూర్తిగా అవగాహన చేసుకొని పనులు చేయాలన్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయ సంయుక్త సంచాలకులు పద్యుమ్న మాట్లాడుతూ ప్రజాసాధికార సర్వే సాఫ్ట్‌వేర్ సిద్ధంగా ఉందని, వెంటనే జిల్లాలకు పంపటం జరుగుతుందన్నారు. ఈ సర్వే నిర్వహణకు ప్రతి జిల్లాకు 10 లక్షల రూపాయల నిధులు కేటాయించటం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన భూపరిపాలనా అధికారి ఈ సర్వేకు రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారన్నారు. ప్రజాసాధికార సర్వే రాష్ట్ర కో ఆర్డినేటింగ్ ఆఫీస్‌ను విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఈ సర్వే చేసే ఎన్యూమరేటర్లకు ఈనెల 23న విజయవాడలో రాష్టస్థ్రాయిలో శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు. జిల్లాల్లో అవసరాన్ని బట్టి ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చుకోవచ్చన్నారు. ఈ సర్వేలో చంద్రన్న బీమా కొరకు పేరు నమోదు చేసుకున్న వారికి అక్కడికక్కడే పాలసీ నెంబర్ జనరేట్ అవుతుందన్నారు. అలాగే బ్యాంకు ఖాతా లేనివారికి అక్కడికక్కడే బ్యాంకు ఖాతా తెరవవచ్చన్నారు.
కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ మండల చార్జి ఆఫీసర్లుగా ఎండివో, ఎంఆర్‌ఓలు వుండాలన్నారు. ఇదొక డైనమిక్ సర్వే అని కలెక్టర్ చెప్పారు. సర్వేకు సంబంధించిన యూజర్ మాన్యువల్ సిద్ధంగా ఉందని, శనివారం సాయంత్రానికి వెబ్‌సైట్లో పోస్ట్ చేయటం జరుగుతుందని చెప్పారు. ఆధార్ లేని పిల్లలకు ఆధార్ కార్డు జనరేట్ అవుతుందని కలెక్టర్ చెప్పారు. ప్రజా సాధికార సర్వేలో బ్యాంకు ఖాతాలు తెరవటానికి ఆంధ్రాబ్యాంకు, ఐడిఎఫ్‌సి బ్యాంకులు ముందుకు వచ్చాయన్నారు. ఇతర బ్యాంకులు కెవైసి సమాచారాన్ని ఇంటిగ్రేట్ చేస్తే బ్యాంకు ఖాతాలు తెరవవచ్చన్నారు. ఈ సర్వే ద్వారా 1.5 కోట్ల మందికి చంద్రన్న బీమా పాలసీ తీసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు.