వినదగు!

దుఃఖాశ్రువుల ఆనందబాష్పాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మనం పుడుతూ ఏడుస్తాం.. మరణిస్తూ ఏడిపిస్తాం.. ఈ జనన మరణాల మధ్యకాలంలో జీవితమంతా భావోద్రేకాల భారమే’ అన్నాను చైతన్యతో.
నేను నోరు విప్పింది చైతన్య కోసమే అయినా ఆతృతగా ప్రశ్నించటం ధర్మారావు నైజం. అది పుట్టుకతో వచ్చింది కాబట్టి మధ్యలో పొమ్మన్నా అంత సులభంగా పోదు. అందుకే ‘మనం ఎంత యోగం చేసుకుంటున్నా మానవ జీవితాన్ని విషాదయోగం క్రిందే పరిగణించాలా?’ అన్నాడు.
‘జీవితానికైనా, జీవనయోగానికైనా విషాదం నేపథ్యమే తప్ప అదే సర్వం కాదు’ నా జవాబు.
‘అంటే విషాదాన్ని అనుభూతిస్తే తప్ప ఆత్మజ్ఞానం సాధ్యం కాదంటారా?’ చైతన్య ప్రశ్న.
‘చైతన్యా! సెల్ఫ్ డిప్రెషన్ నుంచే సెల్ఫ్ రియలైజేషన్ సాధ్యవౌతుంది’ నా స్టేట్‌మెంట్.
‘ఎలా?’ బ్రహ్మయ్య... చాలాకాలం తర్వాత మాట కలిపాడు.
‘బ్రహ్మయ్యగారూ... మీ మాటల్లో సెల్ఫ్ డిప్రెషన్ అంటే ఆత్మగ్లాని.. సెల్ఫ్ రివల్యూషన్ అంటే ఆత్మక్రాంతి.. సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మఎరుక పోనీ ఆత్మదర్శనం’’
‘అర్థం కావటం లేదు’ కోరస్‌గా ముగ్గురూ.
‘సింపుల్‌గా చెప్పుకోవాలంటే డిప్రెషన్‌లో కూరుకుపోతే ఆత్మహత్య వైపు మనసు పరుగులు తీస్తుంది.. అయితే ఆ సెల్ఫ్ డిప్రెషన్ నుండి బయటపడి విచక్షణతో జీవన ప్రయాణం ప్రారంభిస్తే సెల్ఫ్ రివల్యూషన్ సాధ్యవౌతుంది. ఇదే ఆత్మ క్రాంతత్వం. అంతరంగ ప్రయాణం అంటే ఇదే... మనలోకి మనం ప్రయాణించటం. ఇదే యోగ పరిభాషలో చెప్పుకునే అంతరంగ యాత్ర. ఫలితం అంతరంగ దర్శనం.. ఆత్మదర్శనం.. సెల్ఫ్ రియలైజేషన్.’
‘నేనింత వరకు ధర్మగ్లాని అన్న పదాన్ని విన్నానే కానీ ఆత్మగ్లాని అన్న పదాన్ని ఇప్పుడే మొదటిసారి వింటున్నాను’ అన్నాడు ధర్మారావు.
‘మొత్తానికి నోయింగ్ ఒన్స్ ట్రూసెల్ఫ్ సాధ్యం కావాలంటే ఎన్నో కొన్ని విషాదాశ్రువులు రాలాలన్నమాట’ బ్రహ్మయ్య.
‘అందుకేనా భగవద్గీత అర్జున విషాద యోగంతో ప్రారంభమైంది’ చైతన్య.
‘ఏ రంగంలోనైనా కాస్తంతైనా తడబడితేనే సరిదిద్దుకోగల అవకాశం దక్కేది.. నిలబడగలిగేది’ నా సమాధానం.
‘అందుకే అర్జునుడు సైతం ధర్మక్షేత్రంలో వొణికాడు.. విషాద కావ్యమైనాడు’ బ్రహ్మయ్య.
‘అంటే ఎంతటి వారలైనా ఎమోషనల్ కాక తప్పదా? అంటే విషాద ప్రాంగణంలో కొంత సమయమైనా దారి తప్పక తప్పదా? అలా భావోద్రేకంతో దారి తప్పందే మార్గనిర్దేశనం జరగదా?’ ధర్మారావు.
‘ఇంతకీ -
సీదం మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి/ వేపథుశ్చ శరీరేమే రోమహర్షశ్చ జాయతే
గాండీవం స్రంసతే హస్తాత్త్వక్చైవ పరిదహ్యతే/ న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చమే మనః/ నిమిత్తాని చ పశ్యామి విపరీతాని.../ న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజన మాహవే’
అన్న అర్జునుడి మాటలనుబట్టి స్పష్టమయ్యేది లైఫ్ ఈజ్ ఎమోషనల్ అని. దీనికి ప్రత్యుత్తరంగా కృష్ణుడు అయినా గెలవాల్సిందే అంటాడు. ఇదేగా అర్జున విషాద యోగం ద్వారా అంటే గీతా సారాంశం..’ చైతన్య.
‘ఇంకెందుకు ఆలస్యం మాస్టారూ... మీ కోణంలో గీతా రహస్యాలను విప్పండి’ చైతన్య.
‘అసలు అర్జునుడు అనే కాదు మహామహులు సైతం అప్పుడప్పుడు డెప్రెస్ కావటం ఎందుకు జరుగుతోంది?’ ధర్మారావు ప్రశ్న.
‘మంచి ప్రశ్న ధర్మారావుగారూ... మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినప్పుడు ఆనందం... అనుకున్నది అనుకున్న రీతిన జరగనప్పుడు విషాదం... అసలు అనుకున్న రీతిన జరగలేదంటే మనం ఎక్కడో జారినట్లే... మన ప్రణాళిక, మన అంచనాలు సరిగ్గా లేనట్లే, లేదా ఒకేవైపున ఆలోచించటం జరిగిందే తప్ప రెండోవైపున అనుశీలించడం జరగలేదన్నమాట.’
‘అంటే అర్జునుడి డెప్రెషన్‌కి కారణం సరిగ్గా ఆలోచించలేక పోయాడనేగా... ఒకవైపు చూడగలిగాడే తప్ప రెండో వైపును అశ్రద్ధ చేశాడనేగా... అంతటి మహాయోధుడు విజయాన్ని గురించి పలు తెరగుల ఆలోచించాడే తప్ప జరగబోయే నష్టాన్ని అంచనా వేయలేక పోయాడంటారా?’ గీతలోకి దారితీస్తూ చైతన్య.
‘అలాగే అనుకోవాలి.. జరిగే నష్టాన్ని ప్రతిపక్షం వైపు నుండి చూసాడే తప్ప తన వైపు నుండి చూడలేకపోయాడు. ఆ జరగబోయే భవిష్య నష్టం కళ్ల ముందు దృశ్యమయ్యేప్పటికి తట్టుకోలేక పోయాడు’
‘మనిషి బ్రతికుండగా పోనీ ఎదురుగా ఉండగా వారి విలువ తెలీదని అంటుంటాం.. వారు ప్రత్యక్షంగా లేనప్పుడే వారి విలువ తెలుస్తుందని నిత్య వ్యవహారంలో అంటూ ఉంటాం. కురుక్షేత్రంలో కృష్ణుడు రథాన్ని పాండవ, కౌరవ సేనల మధ్య నిలిపినప్పుడు అర్జునుడి కళ్లెదుట తాతలు, తండ్రులు, మేనమామలు, సోదరులు, పుత్రులు, పౌత్రులు, స్నేహితులు, సన్నిహితులు, ఆచార్యులు కనిపించారు. తాను యుద్ధం చేస్తే వైరి పక్షంలోని వీరందరూ నేలకొరిగేవారే.. అలాగే కౌరవులు అస్త్రాలు సంధిస్తే తన వర్గంలోని వారు చాలామందే మట్టికరుస్తారు. ఎలాగైనా ఈ యుద్ధం వల్ల ఆత్మబంధువుల్ని, రక్త సంబంధీకుల్ని, అయిన వారిని, అక్కున చేర్చుకున్న వారిని కోల్పోక తప్పదు. ఇంత ప్రాణహాని జరిగిన తర్వాత తాము బావుకునేది ఏముంది అన్న ఆలోచన కలిగింది.. కుప్పకూలాడు.’
‘మాస్టారూ! మీరు గమనించారో లేదో ‘భ్రమ తీవ చ మే మనః’ అని అర్జునుడు కృష్ణుడితో అంటాడు. అంటే అర్జునుడిది మానసిక భ్రమ అనే కదా అర్థం. గీతాచార్యుడు ఈ విషయాన్ని ప్రారంభంలోనే స్పష్టం చేసేశాడు కదా. అంటే జీవన విషాదానికి మానసిక భ్రమనే కారణమని చెప్పక చెప్పినట్లయింది’ బ్రహ్మయ్య.
*

-డా.వాసిలి వసంతకుమార్ 93939 33946