వినదగు!

సాత్విక సంపన్నత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన బుద్ధికి మూడు మార్గాలు. మన ధృతికి మూడు బాటలు.
మన జ్ఞానానికి మూడు రంగులు. మన కర్మకు మూడు వర్ణాలు.
మన సుఖానికీ మూడు పాయలు. ఇలా మానవ అవతారంతో మనం సాత్విక, రాజస, తామస సమ్మేళనా చతురులం.. మనది చాతుర్వర్ణ వ్యవస్థ. అందుకే మనం పుట్టుకతోకాక కర్మాచరణతోనే బ్రాహ్మణులం... క్షత్రియులం.. వైశ్యులం.. సేవకులం. కాబట్టి, మనం ప్రకృతిరీత్యా, ప్రవృత్తిరీత్యా, వృత్తిరీత్యా గుణ సంపన్నులమే కానీ పుట్టిన కులం రీత్యా గుణ సంపన్నులం కాదు. ఇదీ కృష్ణగీత నిర్వచించే మా‘నవ’ జీవన గీత.
* * *
మనకు భూలోకం తెలుసు. భువర్లోకం తెలుసు. సువర్లోకం తెలుసు. మన భూలోకం ఇహలోకం - పదార్థ లోకం. స్వర్లోక, దేవలోకాలు పరలోకాలు - పరార్థ లోకాలు. వీటిని గురించిన జ్ఞానం, విజ్ఞానం ఎంతో కొంత మన స్వంతం. భూలోకంలోని మనం - ప్రయత్నించి - స్వర్గాన్ని చేరగలం, దేవలోకాన్ని చేరగలం. ఇంకా చెప్పుకోవాలంటే భూలోక వాసులమైన మనకు స్వర్లోక వాసమూ, దేవలోక వాసమూ సాధ్యమే! అంటే ఇహం ఒక్కటే కాదు. పరమూ మన స్వంతమే.
భూలోకంలోని మనం అన్ని విధాల ‘మంచి’గా ఉండగలిగితే స్వర్లోకాన్ని చేరగలం... ఇంకాస్త ఎదగగలిగితే దేవతా లోకాన్నీ చేరుకోగలం. అయితే ఈ మూడు లోకాలలో ఉండగల సామర్థ్యం ఉన్న మనకే కాదు అటు స్వర్లోక వాసులకు కానీ, దేవతలకు కానీ గుణత్రయానికి అతీతం కావటం సాధ్యపడటం లేదు. అంటే సాత్విక గుణానికీ, రాజస గుణానికీ, తామస గుణానికీ ఏదో ఒక సమయంలో బానిసలం అయిపోతున్నాం... స్వతంత్రించి ప్రామాణిక జీవనం గడపలేక పోతున్నాం. ఇటువంటి అప్రామాణికత మూర్త్భీవించిన రూపం అర్జునుడు. ఈ గుణత్రయం నుండి బంధముక్తమైన నిర్గుణుడు కృష్ణుడు. అందుకే కృష్ణ తత్వాన్ని పరమ పురుష తత్వం అంటున్నాం.
* * *
అర్జున వేదనతో కృష్ణవేదం వెలికి వచ్చింది భగవద్గీత రూపంలో. అర్జున జీవన గతిలో విషాదం వొలకటంతో మానవ యాతనకు పరిష్కార మార్గం సూచించవలసి వచ్చింది విశ్వ పురుషునికి. అవును, భగవద్గీతలోని తొలి అధ్యాయం మానవ అవతారంలోని విషాదానికి తెర తీయటమే. కురుక్షేత్రం నుండి పారిపో ప్రయత్నించిన అర్జునుడు మానవ అవతారంలోని పలాయన తత్వానికి ప్రతిబింబమే. అర్జునుడు పుటుకతో క్షత్రియుడే కానీ కురుక్షేత్రంలో క్షాత్ర కర్మాచరణ నుండి పలాయన మనస్కువడటం ధర్మవిరుద్ధమే కదా! అందుకే కృష్ణుడు‘యుద్ధే చాప్య పలాయనమ్’ - పోరు క్షేత్రం నుండి పారిపోకుండటమే ‘క్షాత్రకర్మ’ అని సమాధానం చెప్తాడు కృష్ణుడు. ఇక్కడ క్షాత్రకర్మ అంటే వృత్తి కర్మ... స్వభావ కర్మ. స్వభావ జనిత కర్మాచరణే కానీ కుల జనిత కర్మాచరణ అని మాత్రమే కాదు.
అసలు, ఒక్క అర్జునుడు అనే కాదు. మనందరిని స్కాన్ చేసినట్లు మన జ్ఞానాన్ని సైతం సాత్విక జ్ఞానం, రాజస జ్ఞానం, తామస జ్ఞానం అంటూ మూడు పాయలుగా విభజించాడు ప్రజ్ఞాన ఖని కృష్ణుడు. ఇలా మన జ్ఞానానే్న కాదు మనల్ని సైతం త్రివిధ కర్తలుగా విభజించటమే కాదు మన కర్మల్ని మూడు కర్మలుగాను, మన బుద్ధిని మూడు పాయలుగాను, మన ధృతిని త్రిపుటిగాను, మన సుఖాన్ని సైతం ముప్పేటగాను వింగడించాడు శాస్తజ్ఞ్రుడైన కృష్ణుడు.
* * *
మనం పుటుకతోనే అంటే మన గుణాల్ని బట్టి, మన కర్మాచరణనుబట్టి మనం బ్రాహ్మణులం, క్షత్రియులం, వైశ్యులం, సేవకులం. ఇటువంటి కర్మాచరణ సైతం ప్రకృతి ప్రసాదితం, అంటే, ప్రకృతి ప్రభావంతోనే మనలో బ్రాహ్మణత్వం, క్షత్రియత్వం, వైశ్యత్వం, సేవకత్వం నెలకొంటుంది. అంతే తప్ప ‘కులం’ ప్రాతిపదికన ఏ తత్వమూ మన వొంటబట్టకపోవటం మా‘నవ’ గీత.
సింపుల్‌గా చెప్పుకోవాలంటే - మనోనిగ్రహం, ఇంద్రియ నిష్ఠ, తాపసికత, శుచిత్వం, సహనం, ఋజుత్వం, ప్రామాణిక చింతన, శాస్త్ర పరిజ్ఞానం, అనుభవ సారం -ఇవన్నీ మనలో నెలకొని ఉంటే మనం బ్రాహ్మణత్వానికి ప్రతీకలమే. నిజానికి ఇవన్నీ బ్రాహ్మణ లక్షణాలుగా చెప్పుకుంటున్నప్పటికీ ప్రకృతి నుండి ప్రవృత్తిగా మనల్ని చేరుకున్న వృత్తిపర కర్మ విశేషాలే.
ఇక, ‘శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం’ క్షత్రియ కర్మ లక్షణాలంటాడు కృష్ణుడు. అంటే చిత్తస్థైర్యం, నేర్పరితనం, శూరత్వం, తేజస్సులు క్షత్రియత్వ లక్షణాలు. వీటితోపాటు ‘యుద్ధే చాప్య పలాయనమ్’ ‘దాన మీశ్వర భావశ్చ’ - పోరు క్షేత్రం నుండి పారిపోకుండటం, నిగ్రహించగలిగిన శక్తి కలిగి ఉండటం, క్షత్రియ కర్మలకు ఆలంబనలే! అంటే భీరువులా కాక ధీరోదాత్తతతో వర్తించగలిగితే మనమూ నిజ జీవితంలో క్షత్రియులమే!
గోరక్షణలోను, సేద్యం చేయడంలోను, వాణిజ్యంలోను సమర్థత కలిగి ఉండటం వైశ్య లక్షణం. అంటే వ్యవసాయ క్షేత్రాలను సస్యశ్యామల క్షేత్రాలుగా పరిఢవిల్ల చేయటం, పాల ఉత్పత్తులను పెంచటం, వర్తకం చేయటం అనే లక్షణాలతో మనం వైశ్యులం అవుతున్నాం. ఇలాకాక కేవలం సేవా తత్పరతతో వర్తిస్తే శూద్రులమనే! దీనే్న కృష్ణుడు ‘పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్’ అని అంటాడు.
మొత్తానికి, మన తపనను బట్టి మన కర్మాచరణ సాధ్యమవుతుంటుందే తప్ప పుట్టుకను బట్టి, అంటే కుల ప్రాతిపదికన, కర్మాచరణ సాగటం లేదు.

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946