వినదగు!

ఆత్మ.. జీవాత్మ.. పరమాత్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమాత్మ అంశనే జీవాత్మ.
విత్తు జీవాత్మ అయితే చెట్టు పరమాత్మ!
విత్తు ముందా? చెట్టు ముందా? అంటే జీవాత్మ నుండి పరమాత్మనా? పరమాత్మ నుండి జీవాత్మనా? అన్న ప్రశ్న వేధిస్తుంది. నిజానికి ఈ వేదన జీవాత్మది.. వేదన లేనిది పరమాత్మ.
అసలు వేదనకు మూలం ఆలోచనల పలవరింతలు... తెలివితేటల పలకరింతలు... జ్ఞాన విజ్ఞానాల పులకరింతలు. వాస్తవానికి వేదన ఒక జ్ఞాపకం.. ఒక సంస్మరణ. ఇవన్నీ విస్తృతమవుతున్నంత కాలం జీవిక.. జీవనం. వీటితో చరిస్తున్నంత కాలం ఆత్మ జీవాత్మనే.. చరించటం మానేస్తే పరమాత్మనే. అంటే జీవ-ఆత్మ పరం - ఆత్మ అవుతుంది. విత్తు రూపరాహిత్యమైతే తప్ప చెట్టు కాలేదు కదా! అలాగే జీవ ఆత్మ వేదనాస్థితిని కోల్పోతే తప్ప ‘పరం’ ఆత్మ కాలేదు.
అందుకే యోగం అంటే ఆత్మసంయోగ యోగమే. జీవం పరం సంయోగించటమే గికం కావటం... జీవ ఆత్మ ధ్యాసతో ధ్యానవగ్నతతో గిక సిద్ధిని పొందటవే పరం ఆత్మ కావటం. ఇంతకీ ఈ పరం అంటే ఏమిటి? ఇహం కానిది - అన్నది చాల సులభ సమాధానం. అయితే భగద్గీత ఏమంటుందో చూడండి-
‘సర్వస్య చాహం హృది సన్ని విష్ణో
మత్తః స్మృతిర్ జ్ఞాన మపోహనం చ’
హృదయంలో స్థితమై ఉన్న విస్తృతత్వమే ‘పరం-ఆత్మ’. అది ఎలా స్థితమై ఉందంటే అపోహనం, స్మృతి, జ్ఞాన లక్షణ సమన్వితంగా. అంటే మనం ఇహానిదైన, జీవాత్మ వేదన అంతా హృదయంలో స్థితంగా ఉన్న ‘పరం’దే! ఆ ‘పరం’ విత్తు రూపంలో అంటే సూక్ష్మ అంశగా దేహాన్ని చేరుకుని రూపరహితమై స్థూల అంశగా మహా వృక్షంలా ‘పర’చుకుంటుంది. ఒక విధంగా వేదనకు పరాకాష్ట ఈ పరమ తాత్వికత. జీవాత్మను దేహరూపంలో చూసుకుంటూ పరమాత్మను హృదయ స్థానం నుండి విశ్వంలోకి పంపి - చివరికి ఆ విశ్వమూ పరమాత్మనే, ఆ పరమాత్మ సైతం విశ్వమే అన్న తాత్వికతను చేరుకుంటున్నాం.
నిజానికి కర్మ క్షేత్రంలో కృష్ణ సారథ్యం అంటే పరమాత్మ సారథ్యం అనే. అందుకే పరమాత్మ పరుగులు తీసే ఐహిక రథాశ్వాలకే కాక జీవాత్మ అయిన అర్జునుడి మానసిక - హృదయ సారథీ అయ్యాడు. కారణం వేదనారూపమైన చైతన్యంగా అర్జునుడి ఆలోచన, జ్ఞానం, స్మృతి సంగమించాయి కాబట్టి.
ధ్యాన యోగాలకు కావలసింది భావాతీత స్థితి కాబట్టి అంటే వేదన వైదొలగిన స్థితి కాబట్టి జీవాత్మను పరమాత్మను ఒకే నాణేనికున్న బొమ్మా బొరుసుల్లా చూడటం జరుగుతోంది. అతీత మానసికతతో అద్వైత సిద్ధిని పొందటం సాధ్యమవుతోంది. ఇలా ధ్యాన మార్గంలో మనది ఉన్నతీకరింపబడిన జీవన శైలి అవుతుంది. జీవాత్మ పరమాత్మల అస్తిత్వాన్ని ‘ఏకం’గానే పరిగణించడం జరుగుతోంది.
అయితే భక్తి మార్గీయులు మాత్రం జీవాత్మ పరమాత్మలను ఒకటిగా కాక రెండుగానే చూడటం మనం చూస్తున్నాం. కారణం ఆ రెండింటి ఆత్మైక్య ప్రవృత్తులు ఒకే విధమైనవైనప్పటికీ అవి ప్రవర్తిల్లే విధానం వేరువేరు కాబట్టి. పైగా పరమాత్మ హృదయంలో కొలువై ఉంటాడని ఒప్పుకుంటూనే సాక్షీభూతంగా మాత్రమే వ్యవహరిస్తుందని. కానీ జీవాత్మ ప్రకృతిసిద్ధంగా వ్యవహరించక తప్పటం లేదు కదా!
కాబట్టి జీవాత్మది సదా భౌతిక లాలసతే తప్ప తదితరం కాదన్నది ఒక వాదన. అందుకే భౌతికతను వెన్నంటి ఆధ్యాత్మికతను బాట పట్టిస్తుంటాం తప్ప ఆధ్యాత్మికతను భౌతికతకు ముందు నిలపటం కేవలం మాటలకే పరిమితం చేస్తున్నాం...
మొత్తానికి జీవ-ఆత్మ అన్నది భౌతికానికి చెందిన అంశ. భౌతిక చైతన్యంతో ప్రవర్తిల్లేది. అందుకే ఈ జీవ అంశను మనం వైయక్తికాత్మ అనీ అంటున్నాం.
అయితే పరం - ఆత్మ మాత్రం అన్నింటా తానే అయినటువంటిది. దానిది విరాట్ చైతన్యం. ఆత్మనైనా, అణువునైనా వర్తింపజేయగలదు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే పరానికి ప్రతీకగా ఇహంలో సాక్షీ సంతకం చేసే విరాట్ తత్వం.
ఇంతకీ ఇహానికి చెందిన అజ్ఞానం తొలగటం, అహంభావం వీడటం, స్మృతులకు దూరం కావటం జీవాత్మ పరమాత్మగా పరిణమించటానికి తొలి భూమిక.

-డా.వాసిలి వసంతకుమార్ 93939 33946