వినదగు!

మోహవిముక్త జ్ఞానానంద ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ
శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేష వ్యుదస్య చ’
‘అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్
విముచ్య నిర్మమః శాంతో...’
‘సమం సర్వేషు భూతేషు...’
‘సర్వ కర్మాణ్యసి సదా కుర్వాణో...’ అంటూ ‘పురుషోత్తమ యోగం’ అనే పేరుతో ఇహ - పర నాయకత్వ లక్షణాలను అర్జునుడి ముందుంచుతాడు కృష్ణుడు.
పద్దెనిమిది పర్వాలలో జీవన గీతగాను, ఆత్మగీతగాను, నాయక గీతగాను, గిక గీతగాన పరచుకున్న కృష్ణోపదేశంతో విషాదయోగం నుండి బయటపడ్డ అర్జునుడు
‘నష్టో మోహః స్మృతిర్లబ్దా త్వత్ప్రసాదాన్మయాచ్యుత
స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తన’ అని తనను ఆవహించిన మోహం సంపూర్ణంగా తొలగిపోయిందని, సంశయరహితుడిని జ్ఞానానందుడిని అయ్యానని అంటాడు అర్జునుడు. ఈ మాటలతో, ఈ త్రిలక్షణ శోభలో అర్జునుడిలో ఒక పూర్ణ పురుషుడ్ని చూడగలిగాడు కృష్ణుడు. ఈ పూర్ణ పురుషత్వమే నాయక ప్రతిభ. ఈ మలుపునకు మార్గదర్శి కృష్ణుడు కాబట్టి కృష్ణుడిది పురుషోత్తమ నాయక యోగ శోభ. అందుకే నాటికీ నేటికీ కృష్ణుడు ‘ఎటర్నెల్ లీడర్’గా మన్ననలు అందుకుంటున్నాడు.
జీవన గీతాపరంగా దృశ్య పోరాటం పాండవులకి, కౌరవులకి మధ్యనే.
జీవన పోరాటంలో పాంచభౌతిక దేహానికి, వందల భావోద్రేకాలకు మధ్యనే.
కొంత మంచికి మరెంతో చెడుకు మధ్యనే.
ఇలా చూస్తే భగవద్గీత కేవలం జీవన గీతగా కొంతమటుకే... ఆ పైనిదంతా ఆత్మగీతనే.
ఇలా ఆత్మగీత - పర ఆత్మ, ఇహ ఆత్మల మధ్యనే; మానవ తత్వానికి, పురుషోత్తమ తత్వానికి మధ్యనే.
ఒక విధంగా భగవద్గీతను ఒకవైపు జీవన గీతగాను, మరొకవైపు ఆత్మగీతగాను అర్థం చేసుకోగలిగితే తప్ప అది ‘నాయక గీత’గా అందిరాదు. గత అయిదు వేల సంవత్సరాలుగా అది కాల పరిణామంలో కాలానుగుణంగా మార్గదర్శిగా నిలబడగలుగుతోందంటే అది అనితరసాధ్య నాయకత్వ శోభను ఇనుమడింపజేస్తుండటం వల్లనే! సమకాలీనంగా అది జ్ఞానాన్వితం కావటం వల్లనే. అది ఈనాటికీ ప్రతి ఒక్కరిలో ఒక అర్జునుడ్ని చూపగలుగుతోంది.
కాలం ఎంతలా ప్రవహిస్తున్నా, కురుక్షేత్ర భగవద్గీతను అయిదు వేల సంవత్సరాల వెనక్కు నెట్టుతున్నా గీత ఉపదేశ సారాన్ని నిత్య నూతనంగానే అందుకో గలుగుతున్నాం.
ఇహ క్షేత్రంలో అర్జునుడిలా మనమూ విజయులం కావాలన్నా ఆ కృష్ణోపదేశమే సక్సెస్ సూత్ర అవుతోంది. ఇక మానవ క్షేత్రం పరమాత్మ క్షేత్రంగా పరిఢవిల్లాలన్నా ఆ కృష్ణోపదేశమే స్పిరిట్యుయల్ సూత్ర అవుతోంది.
* * *
గీతోపదేశాన్ని ఆస్వాదించే ప్రయత్నంలో ఎప్పటికప్పుడు కృష్ణుడు వర్తమానాన్ని ఔపోసన పట్టినట్లుగానే అనిపిస్తుంటాడు. పైగా కృష్ణ కర్తవ్యం ‘కొత్త దృక్పథం’ చుట్టూ అల్లుకున్నట్లే అనిపిస్తుంటుంది.
అన్నట్టు, కృష్ణ వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే, నాయకుడన్న వాడు బాధ్యతను ఇష్టపూర్వకంగా చేపట్టాలన్నది స్పష్టమవుతుంటుంది. అంటే ఒకరు అప్పగించినంత మాత్రాన బాధ్యత నాయకుడ్ని అంటిపెట్టుకోదు. తనకు తానుగా మోయటానికి సిద్ధమవ్వటం వల్లనే నాయకత్వం నాయకుడి భుజస్కంధాలను చేరుతుంది. తలకు ఎక్కుతుంది. అంటే, నాయకత్వం అన్నది ఉద్యోగ ధర్మం కాదు.. వ్యవస్థాగత బాధ్యత. విస్తృత పరిధిలో అది పాలనా దక్షత. ఈ పాలనా దక్షతలో నాయకుడన్న వాడు తానే పాలకుడు. తానే పాలితుడు. పాలకుడు, పాలితుడు అభేద్యంగా భాసించటమే నాయకత్వ ప్రతిభ. సమాజంలో తానూ ఒకడు కాబట్టి సమాజాన్ని ప్రభావితం చేయటం అంటే తనను తాను ప్రభావితం చేసుకోవడమే.
నాయకుడు పదుగురిని ఒకలా, తనను ఒకలా ‘ప్రభావ’పరచుకోలేడు. అంటే నాయకుడిది ‘త్వమేవాహ’ తత్వం. ఈ త్వమేవాహ వ్యక్తిత్వానికి ఎటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్ అంటూ రెండు స్థితులు ఉండవు.. ఉండేదల్లా ‘ఇన్వాల్వ్‌మెంట్’ మాత్రమే.
‘ఇన్వాల్వ్‌మెంట్ అంటే ‘వర్కింగ్’ అని కాదు ‘డూయింగ్’ అని మాత్రమే! చేసుకుంటూ పోవటమే తప్ప చేస్తున్నాను అన్న స్పృహ కూడా ఉండదు. అలా చేసుకుంటూ పోతుంటే అనుచరులు పెరుగుతుంటారే తప్ప తరగటమంటూ ఉండదు. తాను మార్గదర్శి అవుతుంటాడే తప్ప మార్గమధ్యంలో కుదేలవటం ఉండదు. కర్తవ్యోన్ముఖతలో స్వార్థం ఉండదు కాబట్టి నాయకుడ వ్యక్తిత్వం విస్తృతి చెందుతూ వ్యక్తిమత్వంగా పరిణమిస్తుంటుంది. ఆ సమర్థ నాయకత్వమే పురుషోత్తమ నాయకత్వంగా పరిఢవిల్లుతుంది.
* * *
నాయకుడంటే మోహవిముక్తుడు, జ్ఞానానందుడు!
మానవ ప్రాంగణాలకే పరిమితమైన నాయకులు ఇహలోక నాయకులు మాత్రమే! వారిది అర్థ మనస్క నాయకత్వం మాత్రమే!
మానవ తత్వాన్ని దివ్యత్వం ఆవరిస్తే తప్ప పురుషోత్తమ నా
యకత్వం సాధ్యం కాదు. భౌతిక పరిధిలో నాయకుడికి వైయక్తిక సంతోషం, సంతృప్తి ఉంటుంటాయి. అయితే అధిభౌతికమైతే తప్ప వైయక్తిక సంతోష స్థానాన్ని సామాజిక సంతోషం, సామాజిక సంతృప్తి అన్నవి ఆశ్రమించవు. భౌతిక పరిధికి పరిమితమైతే అధర్మ వర్తనానికే అందలం.. ఆ విలువలన్నీ అధమాలే. అయితే అధిభౌతికతలో ధర్మవర్తనానికే అగ్రాసనం. విలువలకే ఆది తాంబూలం.
మనం ఈనాటి ప్రపంచంలో వినే లస్ట్, డిజైర్, గ్రీడ్ అన్న పదాలు అధిభౌతికత పరంగా పెదాలను తాకను కూడా ఇష్టపడవు. కాంక్ష, తృష్ణ, వ్యామోహం అధిభౌతికత దాపులను చేరలేవు. వ్యామోహం, తృష్ణ, కాంక్ష లనేవి కొద్దో గొప్పో భౌతిక పరిధులకు పరిమితమైన నాయకులలో కనిపించటం వల్లనే వారు ‘అధికులు’గా తమకు తాముగా ‘కీర్తి’ని విరమించుకోగలరే కానీ, ఔన్నత్యంతో ‘ఎటర్నల్’ కాగలుగుతారు. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు తాకని ఎటర్నల్ లీడర్‌షిప్ అంటే అదే! ఈ స్థితి ఒక్క సెల్ఫ్ కంట్రోల్ వల్లనే సాధ్యవౌతుంది.
ఇక్కడ సెల్ఫ్ కంట్రోల్ అంటే తనను తాను నియంత్రించుకోవటం. దీనే్న అంతర్గత శత్రువుల్ని జయిస్తే తప్ప బాహిరి శత్రువుల్ని జయించలేం అనటం. ఇక్కడ అంతర్గత శత్రువులు అంటే మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలే. ప్రాపంచికానికి కట్టిపడేసేవి ఇవే.
ఇలా చూస్తే, భగవద్గీత పరంగా ‘పురుషోత్తమ నాయకత్వం’ అంటే ‘సెల్ఫ్ లీడర్‌షిప్’ అనే! దీనే్న ‘ఎటర్నల్ లీడర్‌షిప్’ అనీ అంటుంటాం. తన ఆత్మదే నాయకత్వం. తన ఆత్మజ్ఞానవే జ్ఞానానందం. ఇక్కడ ఆత్మజ్ఞానం అంటే సమస్థితిని సాధించటం. అంటే ఆత్మసిద్ధి... సమాధి. సమస్థితి అంటే చిత్తచాంచల్యం లేకపోవటం, భ్రమాన్వితం కాకపోవటం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం. అదే జ్ఞానానంద స్థితి... అదే పరుషోత్తమ స్థితి... అదే ‘ఎటర్నల్ లీడర్‌షిప్’ క్వాలిటీ.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946