వినదగు!

నాటి నేటిని, నేటి రేపటిని చూడగలగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం మన ఇంద్రియాలకు, మన మనస్సుకు, మన మేధకు అనుచరులమే! అవి కొలువున్న మానవ దేహం, మానవ అవతారం మనది. ఒక విధంగా ఈ మానవ అవతారమే ఒక అయోమయ అసందిగ్ధ స్థితి. సంఘర్షణల స్థావరం. ఒక గందరగోళ వ్యవస్థ ఈ మానవ ఉనికి. కాబట్టి అనుచరత్వం నుండి నాయక తత్వంలోకి పరిణమించాలంటే ఈ ఇంద్రియాలకు, మనస్సుకు, మేధకు అతీతం కావలసిందే! అంటే, వాటి చెప్పుచేతల్లోంచి విడివడాల్సిందే!
మనం మానవ తత్వం నుండి ఉన్నతీకరింపబడాలి.. ఔన్నత్యాన్ని సంతరించుకోవాలి. దైహిక వ్యవస్థకు మనం ప్రతిస్పందించటం కాదు - స్పందించటం తెలిస్తేనే నాయకత్వం. దీనే్న భౌతిక మూలాల నుండి బయటపడి పరిణమించటం అంటాం. ఒక విధంగా డెవలపింగ్ టెర్మినల్ వాల్యూ సిస్టమ్స్ అంటే ఇదే!
ఈ నాయక లక్షణాన్ని భగవద్గీత ‘నిష్కామ కర్మ’ అంటుంది. ప్రతిఫలాపేక్ష లేని కర్మాచరణ అన్ని ఇదే. అంటే, నాయకుడి కర్తృత్వం విశ్వమంత విస్తృతం కావాలి. నాయకుడికి ఉండవలసిన ఏకైక ‘నిస్వార్థ’ లక్షణం ఇది. విషయం చిన్నదైనా దాని విస్తృతిని విశాలం చేసుకోవటం నాయకోత్తముని లక్షణం. ఈ విస్తృతిలో టీమ్ లీడర్ ప్రతి ఒక్కరినీ ఇన్వాల్వ్ చేయటం జరుగుతుంది.
కృష్ణోపదేశం జరిగింది అర్జునుడికే. కానీ ఆ ఉపదేశ విస్తృతి తరతరాలకు విస్తరిల్లింది కదా! ఇలా కృష్ణుడు విజనర్ లీడర్ కూడా అయ్యాడు. నాటి నేటిని, నేటి రేపటిని చూడగలిగాడు. పైగా, కృష్ణుడు కేవలం తెలివితేటలకే పరిమితం కాక జ్ఞాన యోగాన్ని మనకు అందించి ప్రజ్ఞామూర్తి అయ్యాడు.
* సాధికార స్వరం అవసరం
కృష్ణుడు ముందుచూపున్న స్ట్రాటజిక్ లీడర్ కూడా! తొలి నుండీ ఒక లక్ష్యమున్నవాడు. ధర్మపక్షపాతి. అందుకే పాండవులకు చేరువ అయ్యాడు. కారణం, కృష్ణుడి నాయక తత్వం కేవలం భౌతికానికి, ప్రాపంచికానికి మాత్రమే పరిమితమైంది కాదు. అది ప్రాపంచికాన్ని దాటి, భౌతికాన్ని దాటి పరాన్ని తాకినటువంటిది. ఇలా కృష్ణుడి ఎటర్నల్ లీడర్‌షిప్‌కి స్వ-పర భేదం లేదు. ‘నీ-నా’ అన్న వ్యత్యాసం లేదు. అంతటా అభేదత్వమే. ఆతడిది విశ్వకామన. విశ్వకామనలో మంచీ చెడుల పరిగణన ఉండదు. ఉండేదల్లా ఔన్నత్యం మాత్రమే. దీనే్న స్ట్రాటజిక్ లీడర్‌షిప్ అంటుంటాం.
అన్నట్టు, కృష్ణుడు వంటివారు నాయకులకే నాయకులంటే వారిలో ఉండేది ధైర్య సాహసాలలు మాత్రమే కాదు. ఆత్మవిశ్వాసం. అంటే తమపై తమకు అచంచల విశ్వాసం. సాధికార స్వరం వారి స్వంతమై ఉంటుంది. విజన్, యాక్షన్ కలగలిసిన చోటనే ఇటువంటి డైరెక్టివ్ లీడర్‌షిప్ రాణిస్తుంది. అర్జునుడికి ఈ విజన్, యాక్షన్ లేకనే కదా నాయకుడయి ఉండీ కురుక్షేత్రంలో కూలబడ్డది. కాబట్టి, అర్జునుడికి భవిష్యత్తును దర్శింప చేయగల కృష్ణ మార్గదర్శకత్వం అవసరం అయింది.
అర్జునుడ్ని మోటివేట్ చేయవలసిన అవసరం కృష్ణుడికి కలిగింది. కార్యాచరణలో దాదాపుగా ఎంతటి ధీరోదాత్తుడయినా అప్పుడప్పుడూ ఇలా మోటివేట్ కావలసిందే! పదిమంది కలిసి అడుగులేస్తున్నపుడు ఈ టీమ్ లీడర్‌షిప్ స్టైల్ మరింత అవసరమవుతుంటుంది. అందుకే అంటుంటాం - ఘరీజశ ఘ్యశ ఆ్దళ ఆళ్ఘౄ ఘశజూ ఘజశజశ ఆ్దళజూ య్ఘఒ తీజఆ్ద ఆ్దళ య్ఘఒ యఛి ఆ్దళ యూఘశజఛ్ఘీఆజ్యశ జఒ ఘ ళ్ఘఆ ష్ద్ఘళశళ -అని.
* ఛిరు చర్చలకు అవకాశమిస్తుండాలి
టీమ్ లీడర్‌షిప్‌లో టీమ్ మెంబర్స్ సందేహాలు తీర్చవలసి ఉంటుంది. సందేశాలను అందించవలసి ఉంటుంది. చర్చోపచర్చల అవసరమూ ఉంటుంది. ఇదంతా విజయాన్ని వరించటానికే. ఈ విజయపథాన్ని ఆశించే కృష్ణుడు అర్జునుడికి ఇహ - పర సందేశా లిచ్చారు. సందేహ నివృత్తి చేశాడు. గీతోపదేశ సందర్భంలో చిరు చర్చకూ అవకాశమిచ్చాడు. అర్జునుడ్ని సందేహ ప్రవృత్తి నుండి బయటపడేలా చేశాడు.. తన ఉపదేశామృతంతో నిష్కామ కర్మయోగిని చేశాడు.
అర్జునుడిలోని బలహీనతలను పసికట్టి, బలాలను గుదిగుచ్చి, సంకట స్థితి నుండి వెలికివచ్చేలా చేయటంతో కృష్ణుడు టీమ్ లీడర్‌లా మన కళ్ల ముందుకొస్తున్నాడు. ఇలా వ్యక్తిత్వంలో ఉన్న అంశాలను మెరుగుపరచటం చేయగలిగితే నాయకుడన్నవాడు సక్సెస్‌ఫుల్ లీడర్ అవుతాడు. అయితే టీమ్ లీడర్‌గా కేవలం మోటివేట్ చేసుకుంటూ పోతుంటే సరిపోదు. అప్పుడప్పుడూ టీమ్ మెంబర్స్‌కి మెచ్చుకోలు సందర్భాలు కలుగజేస్తుండాలి.. వారి కార్యాచరణను మెచ్చుకుంటుండాలి.
టీమ్ మెంబర్స్ ఉత్తేజితులు కాగలగటంలో ‘రికగ్నిషన్’ ప్రధాన పాత్ర వహిస్తుంటుంది. అవును, ఇటువంటి గుర్తింపు టీమ్ మెంబర్స్‌లో ‘్ఫల్ గుడ్’ను కలగజేస్తుంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంటుంది. మరింత చురుగ్గా పాల్గొనేలా చేస్తుంటుంది. అలా టీమ్ మెంబర్స్‌కి తాము చేస్తున్న పని అర్థం, ప్రయోజనం స్పష్టంగా తెలిసి వస్తుంది. అంటే కార్యాచరణలో క్లారిటీ ఏర్పడుతుంది.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946