వినదగు!

స్వతంత్రంగా సూక్ష్మం కావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః
ఉప విశ్వసనే యుంజ్యాత్ యోగ మాత్మ విశుద్ధయే’
మానసిక పర ఏకాగ్రత, చాంచల్యచిత్త నిరోధత, ఇంద్రియ క్రియల కట్టడి - ఫలితం త్రికరణశుద్ధి.
త్రికరణ శుద్ధికై ఉపక్రమించి నిత్య సాధనతో పురోగమిస్తుండటమే యోగం.
* * *
‘ఈ రోజు నాది అనుకుంటున్నది నిన్నటి దినాన మరొకరిది. ఆ మరొకరిది నేటికి నాది అయినట్లే రేపటికి మరొకరిది అవుతుంది. ‘నాది’ అనుకుంటున్నంత కాలం మనం ఆనందంగా ఉంటున్నాం.. రేపటికి మరొకరిది అనుకున్నంత మాత్రాననే ‘అలజడి’కి లోనవుతున్నాం.. ఆనందాన్ని కోల్పోతున్నాం. ఈ చిత్త చాపల్యమే విషాద జీవనానికి తొలి అంకం. మనం ఆనందిస్తోంది అశాశ్వతాల విషయంలో కాబట్టి మన ఆనందమూ అశాశ్వతమే అవుతోందనుకోవటం తొలి అపశ్రుతి. మన దుఃఖ జీవనానికి ఈ అశాశ్వత ఆనందం వెంట పరుగులు తీయటమే కారణమని తెలుసుకో గలిగితే యోగ జీవనానికి తెర తీసినట్లే! గిక గీత అంది వచ్చినట్లే’ అన్నాన చైతన్యతో కృష్ణ చైతన్యంతో.
‘అసలు మార్పును అంగీకరించ లేకపోవటమే బాధామయ జీవితంలో తొలి అధ్యాయం. మారే జీవితానికి తుది అధ్యాయం మృత్యువే. నిజానికి ఆ మృత్యువు మలి పుటనే తప్ప తుది పుట కాదన్న ఆత్మస్పృహ ఈ ప్రాపంచిక జీవనంలో కొట్టుకుపోతున్న మనకు ఉండటం లేదు.
నదీ ప్రవాహం వంటి మన జీవితం ఏదో ఒకనాడు కడలి కెరటాలలో కలవాల్సిందే! సముద్రంలో సంగమించటం మలి మజిలీనే తప్ప తుది మజిలీ కాదు. కడలిలో కలిసిన నది వ్యాప్తవౌతుంది. అలా నదితో పాటు సముద్రమూ విస్తరిస్తుంది. నదీ ప్రవాహం వంటి మన జీవితం మృత్యుద్వారం ద్వారా సముద్రం వంటి విశ్వ గర్భాన్ని చేరి విస్తృతవౌతోంది. జీవాత్మ విశ్వాత్మగా విస్తరిల్లుతోంది. ఈ మార్పు, పరిణామం దుఃఖభాజనం అనుకుంటే ఎలా?!’ చైతన్య.
అవును, చైతన్యది ప్రశ్నలా శబ్దించవచ్చు. కానీ అందులోనే నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న సమాధానం ఉంది.. విస్తరిస్తున్న సాధనా జీవితమూ తొంగి చూస్తోంది. ఆత్మయోగ సాధనా పరిణతి కళ్ల ముందుకొస్తోంది.
‘చైతన్యా! మనం పాంచభౌతికం అవుతోంది ఆత్మతోనే... మనం పాంచభౌతిక దేహాన్ని వీడుతోంది ఆత్మ పరంగానే. అంటే పుట్టుకతో వచ్చేది ఆత్మనే, మృత్యువుతో మిగిలేది ఆత్మనే. ఆ మిగులు అరూపమే తప్ప రూపం కాదు. జననం నుండి మరణం దాకా సాగే ప్రయాణంలో మనం కూడబెట్టుకునేదంతా అశాశ్వతత్వానే్న. అదే మన స్వంతం అనుకుంటూ అది కరుగుతుందేమో అనీ, క్షీణిస్తుందని వెర్రెక్కిపోతాం. ‘ఇక్కడి సంపాదన ఇక్కడికే’ అన్న విషయాన్ని మరిస్తే తరుముకొచ్చేది అలజడే.. మనం తలమునకలయ్యేది విషాదంలోనే.
ఈ మానవ దేహంలోకి ఎలా వచ్చామో అలాగే నిష్క్రమించాలి. ఏది వెంట తెచ్చుకున్నామో దాన్ని మాత్రమే వెంట తీసుకెళ్లాలి. ఇది సృష్టి ధర్మం.. అవతరణ రహస్యం. అప్పుడే గతమైనా, వర్తమానమైనా, భవిష్యత్తయినా కాలం గీసిన చిత్రంలో ఒకేలా భాసిస్తుంది. ‘నీది’ ‘నాది’ అన్న రక్షణ రేఖ చెరిగిపోతుంది. నేను ‘మన’ స్వంతమవుతుంది. మనం ‘నేను’ అక్కున చేరుతుంది.
ఈ మానవ దేహం నిప్పు, నీరు, గాలి, మట్టి, వాయువు అనుకుంటే సరిపోదు.. వాటిల్లో కరిగిపోవటమే మృత్యువు. అందుకే దేహాన్ని చేరిన ఆత్మనే శాశ్వతం అనటం. పంచభూతాలు దేహంగా పరిణమించినట్లే, అవి యధాస్థానాన్ని చేరుకుంటూ దేహ రూపాన్ని కోల్పోవటం సృష్టి ధర్మం. దేహాన్ని చేరిన ఆత్మే దేహాన్ని వీడి మళ్లీ శాశ్వతత్వంలో లయమై పోతుంది’ అలల్లా నా వాక్ప్రవాహం.
‘పాంచభౌతికంగాను, ప్రాపంచికంగాను మార్పు సహజమంటున్నారు కదా! అలాగే మానవ మనస్తత్వమూ మార్పునకు లోనవటం సహజమే కదా! సహజమే అయినప్పుడు మనస్తత్వంలో చోటు చేసుకునే ఒడిదుడుకులను, మార్పులను అడ్డుకోవటం సృష్టికి విరుద్ధం కా?!’ చైతన్య అనుమానం.
‘నిజమే చైతన్యా! స్వభావాన్ని కాదనటం సృష్టి ధర్మానికి వ్యతిరేకమే! మార్పును మనం కాదనకూడదు... పరిణామాన్ని ఆహ్వానించాల్సిందే! అయితే మార్పు పరంగా కలిగే అలజడిని దూరం చేయాలి. అలజడికి లోను కాని మనస్తత్వం స్వంతం కావాలి. అదే సమాధ్యవస్థ.. అదే సన్యాస జీవనం.. అదే గిక జీవనం. ఇక్కడ గిక జీవనం అంటే సదా చైతన్య స్పృహలో ఉండటం. అంటే అలజడిని అలలా చాడగల స్పృహ మనకు ఉండాలి. ఇక్కడ అల అంటే అనిత్యమే. నిరంతరం కాదు. ఎటువంటి అలజడి అయినా అలలా కరిగిపోయేదే!
గిక జీవనం అంటే అనభూతి చెందటం.. అనుభవానికి లోను కావటం. అంతే తప్ప కేవలం జ్ఞాన, విజ్ఞాన సంపదతోనే మురిసిపోవటం కాదు. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే ప్రజ్ఞానాన్వితం కావటమే యోగానుభవ సంపద. స్థూలం సూక్ష్మంగా పరిణమించటం గికత్వం. వన దేహం స్థూలమే. ఆ భౌతికత నుండి విడివడి స్వేచ్ఛగా విస్తృతం అవుతూ స్వతంత్రంగా సూక్ష్మం కావాలి.
ఈ గిక సాధన తొలదొల్తుగా జిజ్ఞాసగా పొటమరించి, మలి మజిలీలో అంతరవలోకనకు దారితీసి, ఆముష్మిక అనుభవానికి ఆవాసం అవుతుంది. ఇదే ఆత్మస్పృహ, స్వస్పృహ అంటే. ఈ స్పృహతో ఆదిని విశ్వసించటం, గురువును విశ్వసించటం, ఆత్మను విశ్వసించటం ఒక్కటే. ఆది, గురువు, ఆత్మ అభేదాలే!
ఈ ‘ఎరుక’తో యోగ సాధన ఎంత ముఖ్యమో ఆ సాధన నిలకడగా సాగటమూ అంతే ముఖ్యం. అంటే నిరంతర అభ్యాసమే యోగ సాధన అవుతుంది. పట్టుదలతో సాధనలో పరాక్రమించటం మన చైతన్య స్పృహ పెరగటానికి ఇదే ఆలంబన. అనవసరాలను త్యజించటమూ ఈ అభ్యాసంతో సాధ్యమవుతుంది. ‘ఆది’ లేదా ‘విశ్వాత్మ’తో కనెక్ట్ కావటానికి కావలసిన అవలోకనా మార్గాన్ని ఆలోచనా సరళిని యోగ సాధన అభివృద్ధి పరుస్తుంది.
చైతన్యా! చైతన్య స్పృహను విస్తరింపజేసుకునే అభ్యాస రహస్యం ఒకటి ఉంది. కనీసం సమయ పాలనతో 45 రోజులు సాధన సాగించనిదే పాంచభౌతిక చైతన్యం విస్తరించటం ప్రారంభించదు. మరో నలభై అయిదు రోజులు అంటే 90 రోజుల నిరంతర అభ్యాసంతో మానసిక చైతన్యం పురివిప్పుతుంది. మరో 45 రోజులు సాధనను పెంచుకోవటం వల్ల ఐహికంగాను, ఆముష్మికంగాను మన దృక్పథం విస్తరిల్లుతుంది. ఇలా సమయాన్ని కేటాయించలేక పోవటం వల్ల చైతన్యం విస్తరిల్లటానికి బదులు సంకుచితం అవుతుంది.
కాబట్టి, సాధనకు ముఖ్యంగా కావలసింది సంకల్పం. సంకల్పం స్థిరమైనదైతే మన సాధన పాజిటివ్‌గా సాగుతుంది. సంకల్పంలో స్థిరత్వం లేకపోతే సాధన జారుడుబల్లను చేరుకుంటుంది. పైగా మన సాధనను అర్థవంతం చేసుకోలేక అభాసుపాలవుతుంటాం.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946