వినదగు!

వ్యామోహం ఒక యోగ మాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వం, సృష్టి, ప్రకృతి, చరం, ఆచరం, దృశ్యం, అదృశ్యం, వృతం, అమృతం, సత్, అసత్, అణువు, కణం - ఇలా అన్నిటికీ కేంద్రమైంది ఆది స్థితి.. అన్నిటా తానే అయి ఉంది ఆరిజిన్. ఇలా ‘ఆది’ది విరాట్ తత్వం.. విరాడ్రూపం.
* * *
‘మామే వైష్యసి యుకె్తై్వవ మాత్మానం’ - పురుషోత్తముడే ఆత్మరూపుడు అని. అంటే ఆది స్థితి ఆత్మరూపం అని. పరమాత్మ అయిన పురుషోత్తముడ్ని, ఆత్మరూపమయిన ఆది స్థితిని పొందాలంటే ‘ఏకాగ్రచిత్తం’తో యోగసాధన సాగాలి. అంటే నిత్యసాధనతోనే చిత్తం సావధానం అవుతుంది అని. గికంగా ఇది సవాహిత స్థితి.. ధర్మస్థితి... శాంతస్థితి. ఈ స్థితుల కలయికతోనే శాశ్వత సిద్ధి సాధ్యమవుతుంది.
గిక పరిభాషలో చెప్పుకునే ‘్ఫజికల్ ఇవ్మోర్టాలిటీ’కి ఇలా ఏకాగ్రత, ధర్మశీలత, శాంతవర్తనం భూమికలవుతుంటాయి. ఈ స్థితులలో సిద్ధి పొందిన వారు తమ యోగసాధనా ఫలితాలను తమ స్వప్రయోజనాలకే పరిమితం చేసుకోరు... అది లోకహితం కోసమే! విశ్వ పరిణామ కల్యాణం కోసమే! కారణం పరిపూర్ణ యోగులకు ఆది స్థితి ఒక్కటే యదార్థం కాబట్టి ఆరిజిన్ ఈజ్ ఒరిజినల్. తక్కినవన్నీ మాయామోహిత స్థితులు... అయదార్థాలు. మాయామోహ భక్తిపూర్వక క్రతువులన్నీ అజ్ఞాన సంకేతాలే!
కాబట్టి పరిపూర్ణ యోగులు విశ్వ పరిణామంలో మగ్నమైన ఆది స్థితికి తమ యోగసాధనా ఫలితాలు ఉపయుక్తం కావాలన్న ఏకాగ్రచిత్తం కలిగి ఉంటే ఆ ఆదిస్థితి సర్వకాలాలలో తనపై మగ్నమై ఉన్న యోగిపుంగవుల యోగ క్షేమాలకు ఆయువుపట్టుగా ఉంటుంది.
గీతలోని తొమ్మిదవ అధ్యాయంలోని-
‘అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే/ తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమం వహామ్యహమ్’ అన్న 22వ శ్లోక అంతరార్థం ఇదే. అంటే యోగ సిద్ధికి, ఆది స్థితికి ఉన్న అవినాభావ సంబంధం ఇదన్నమాట. అందుకే యోగులు ఆదితత్వాన్ని మృత అమృత, సత్ - అసత్‌ల సంయోగంగానే పరిగణిస్తారు. అంటే మృతానికి అమృతానికి, సత్‌కి అసత్‌కి హిరణ్య గర్భం ఒక్కటేనన్నమాట. అంటే విభిన్నంగా గోచరించే అభిన్నతే ‘ఆది స్థితి’.
ప్రభవానికి, ప్రళయానికి కేంద్రం అవ్యయమైన ఈ ఆరిజినే! అందుకే ‘నిత్యాయుక్తు’లైన ‘దృఢవ్రతు’లైన యోగులకు ఈ ఆది స్థితి ‘విశ్వతోముఖ’మైంది. నిజానికి, ‘ప్రకృతి మాశ్రీత’ ఆది స్థితిది సర్వాతీత స్థితి.
‘మయాధ్యక్షేణ ప్రకృతిస్సూయతే సచరాచరమ్/ హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే’
సకల చరాచర విశ్వ ప్రకృతికి అధ్యక్షత్వం ‘ఆది’ది. ఈ ఆదితత్వంతోనే దృశ్యాదృశ్య జగత్తు పరిభ్రమిస్తోంది. అయినా ఆది అధ్యక్షత్వం ఉదాసీనతే. కర్మ జగత్తులో ఆది ఆసీనత నిరాసక్తతే. అభావ అస్తిత్వం ఆదిది కాబట్టి అది స్వతంత్రం... జగత్తుది స్వభావ భ్రమణం - కాబట్టి అస్వతంత్రం. అంటే ఆదిది ఇన్‌డిపెనె్డన్సీ.. మనలది డిపెనె్డన్సీ. డిపెనె్డన్స్ ఇన్‌డిపెనె్డస్ట్ కావాలంటే స్వభావాన్ని తొలుచుకుంటూ, అంటే ‘బోర్’ చేసుకుంటూ పోవలసిందే. ఈ బోరింగ్ ప్రక్రియకు యోగసాధనే అన్నివిధాల ఆలంబన.
‘మయా తతమిదం సర్వం జగదవ్యక్త మూర్తినా’
సకల చరాచర జగత్తును వ్యాపించిన ఈ ఆది స్థితి ఇంద్రియ గోచరం కాదు. ఈ ఎరుక అవినాశి. ఈ సంసార విముక్త జ్ఞాన విచక్షణా జీవనమే యోగ జీవనం. ఇది అమరం. గిక ‘్ధర్మ’ శ్రద్ధ లేకపోతే సాంసారిక భ్రవణంతో మరణమే! కాబట్టి అమరత్వాన్ని అందించే గిక జీవితానికి వోహమూ పనికిరాదు... అసూయా పనికిరాదు. చివరికి స్వర్గ నరకాల ఆలోచన కూడా పనికిరాదు. కేవలం గిక జ్ఞానం వల్లనే ప్రజ్ఞాన్వితవై అశుభ హేతువైన సంసారానికి దూరం కావటం జరుగుతుంది. ఆ ‘జరుగు’బాటుతో నిత్యసాధనతో గిక ప్రస్థానంతో అసంశయ, సమగ్ర ఆది స్థితితో భాగస్వామ్యం సాధ్యమవుతుంది.
నిజానికి ‘ఆది స్థితికి చెందిన ప్రజ్ఞ’ ఎంతటి యోగి పుంగవులకైనా అంత సులభంగా సిద్ధించదు. ఆది స్థితికి చెందిన ఆ జ్ఞాన విజ్ఞాన మూల ప్రజ్ఞానం నిశే్శష ప్రజ్ఞ. ఆ ఆది ప్రజ్ఞ అద్వితీయం. ఆది ప్రజ్ఞను అందుకున్న తర్వాత మరొక దాని కోసం తలపూ ఉండదు, ప్రయత్నమూ సాగదు. ఆది స్థితి ఎరుక అయిన తర్వాత మరో స్థితిని గురించి తెలుసుకోవాలనే తపన కూడా ఉండదు. అసలు అటువంటి ఆలోచనే ఉదయించదు.
సామాన్య జనానికి భక్తిపై ఉన్న వ్యామోహం యోగసాధనా పరంగా ఉండదు. కారణం యోగసాధనకు వ్యామోహం ఏ విధంగాను భూమిక కాదు. పైగా సమయపాలనతో అల్లుకుపోయింది యోగసాధన. ‘నా తనాన్ని’ సంపూర్ణంగా సాధనలో లయం చేయటమే యోగం. ఇలా ‘నా తనం’ సమగ్రంగా గికం అరుతే తప్ప ‘సిద్ధి’ అనేది దరిచేరదు. ఇలా చూస్తే లక్షల్లో ఒకరు యోగసాధనపై ఆసక్తి చూపుతారేమో! నిత్య సాధనతో వారిలోనూ ఏ ఒక్కరికో సిద్ధి సాధ్యమవుతుంది. అంటే, సాధనా ఫలితమైన సిద్ధి కోటిలో ఒకరికి సాధ్యం. ఇలా సిద్ధులు సంక్రమించిన కొందరిలో ఏ ఒక్కరికో ‘ఆది స్థితి’ని గురించిన కనువిప్పు కలుగుతుంది. అంటే కోట్లాది జనాభాలో మహా అయితే వందల సంఖ్యలో మాత్రమే యోగమగ్నం అవుతారు. ఆ మగ్నతలో కానీ ఆదిస్థితి అర్థం కాదు. అర్థం అయితే తప్ప యోగసాధన అర్థవంతం కాదు. ఇక్కడ ఆదిస్థితి అంటే జీవభూత ప్రాణధారణకు మూలమైన క్షేత్రజ్ఞ ప్రకృతే ఆదిస్థితి. అందుకే ఆదిస్థితిని మనం ‘పరాప్రకృతి’ అనీ, ‘ఉత్కృష్ట ప్రకృతి’ అనీ అంటుంటాం.
‘మత్తః పరతరం నాన్యత్కించిదస్తి’ అని ఒకచోట భగవద్గీత అంటుంది. అంటే ఆది స్థితి కంటే అతిరిక్తమైంది అంటే స్వతంత్రమైంది మరొకటి లేదని. అంటే విరాట్ తత్వమైన ‘ఆది’తో పోల్చదగింది మరొకటి లేదు. పైగా ఈ ఆదిస్థితి ముందు ‘మాయ’ కూడా తన ముసుగును తొలగించవలసిందే!
అన్నట్టు, మాయా మోహం అంటే అధమ ప్రవృత్తి అని. అటు మాయకు, ఇటు మోహానికి దాసోహమైన వారు ఎవరైనా సరే అధముల క్రిందే లెక్క. వారి వివేకాన్ని మాయ జయిస్తుంది. కాబట్టి మాయా మోహితులది అసుర ప్రవృత్తిగానే పరిగణించబడుతోంది. మాయా మోహిత ప్రవృత్తి కలవారికి ఆదిస్థితిని గురించిన తలపైనా కలగదు. అటువంటి నరాధములకి మహాత్ముల దర్శనం కలనైనా కలగదు.
మహాత్ములైన యోగి పుంగవులను దర్శించటం అంటే ఆ పరమాత్మను దర్శించటమే! పరమాత్మను దర్శించటం అంటే ఆదితత్వాన్ని అందుకోవటమే! ఇక్కడ ఒక అంశాన్ని జాగ్రత్తగా అనుశీలించాలి - ‘ఆది స్థితి’ ఎరుకకు రావాలంటే యోగసాధన ఒక్కటే మార్గం. అలా కాక కేవలం దేవతారాధనతో కాలం దొర్లించే వారికి ఆ దేవతల అనుగ్రహం మాత్రమే లభిస్తుంది. అంటే దేవతారాధన కంటే యోగసాధన ఉత్కృష్టమైందని గీత స్పష్టంగా చెప్తోంది. చూడండి-
‘అంత వత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్/ దేవాన్ దేవయజో యాంతి మద్భక్తాయాంతి మామపి’
మాయామోహ పీడితులు దివ్య మార్గాన పొందేది ఏమీ ఉండదు. దేవతారాధకులకు దేవతా సాయుజ్యం మాత్రమే లభిస్తుంది. యోగసాధనా మగ్నమైన వారికి ఆది తత్వం, ఆది స్థితి సంప్రాప్తమవుతోంది.
నిజానికి, ‘వ్యామోహం’ సైతం ఒక ‘యోగ మాయ’నే ఆ యోగ మాయను ఛేదించటానికి నిత్య యోగ సాధన ఒక్కటే మార్గం. అంటే, యోగ సాధనతోనే యోగమాయ మాయమవుతుంది... ఆది స్థితి ప్రకటితమవుతుంది.

-డాక్టర్ వాసిలి వసంతకుమార్ 93939 33946