వినదగు!

విక్షేపాలు, వికల్పాలు లేనిదే బుద్ధియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బద్ధి యోగం చేతనే యోగసాధకులమైన మనం ‘ఆది’ అస్తిత్వాన్ని
ఆవిష్కరించుకోగలం. అయితే ఈ బుద్ధియోగానికి కావలసింది
ఆత్మభావం. ఈ ఆత్మభావం స్వయం ప్రకాశకం. ఈ జ్ఞాన ప్రకాశం వల్లనే అజ్ఞానం అనే అంధకారం తొలగుతుంది. అప్పుడు కానీ ఆదితత్వం అందుబాటులోకి రాదు. ఇదీ యోగసాధకుల యోగవిభూతి వైభవం.

ద్ధియోగం అని భగవద్గీత అంటోంది కదా! అసలు, మానవజన్మ విశిష్టతే ‘బుద్ధి’ కదా. పైగా, మనం బుద్ధిజీవులం కాబట్టే కదా జంతుజాలం నుంచి ప్రత్యేకింపబడ్డాం! మనం ఎలాగూ బుద్ధిజీవులమే కాబట్టి మళ్లీ ‘బుద్ధియోగం’ అంటూ సాధనకు ఉపక్రమించాలా?’ చైతన్యది ప్రశ్నలాంటి సందేహం.
‘మంచి సందేహమే చైతన్యా! ‘పరం’ అంటే ‘ఆది’ నుండి పాంచభౌతిక దేహాన్ని చేరిన ఆత్మ తన అసలు జ్ఞానాన్ని దేహంలో పొదువుకుని ఉండిపోతోంది. అది అంతస్సీమలకే పరిమితమై పోతోంది. ఆత్మను మన మానవదేహం, మనస్సు డామినేట్ చేస్తుండటంతో మనం సంసార తాపత్రయంలో పడి భావోద్విగ్నులం అవుతున్నాం. ఎక్కడ ఎలా ఎటాచ్ కావాలో ఎప్పుడు డిటాచ్ కావాలో తెలీక లాభాలాభాల, జయాపజయాల భ్రమణంలో మాయామోహితులం అవుతున్నాం.
జీవితంలోని అన్ని కోణాలలోను భోగలాలసతే మనల్ని ఆకర్షిస్తోంది. ఈ భౌతిక ప్రయాణం ఇలాగే కొనసాగితే అధిభౌతిక చైతన్యమైన ‘ఆది’ చైతన్య ప్రభావం మనపై లేకుండా పోతుంది. మనం కేవలం మానవ చైతన్యంతో సామాన్య మానవులుగానే బ్రతికేసి శాశ్వతంగా కళ్లు మూసేస్తాం’ గిక తాత్వికతతో నేన.
చైతన్య ఆసక్తితో వింటుంటే చైతన్యలో అర్జునుడు కనిపిస్తున్నాడు.
‘అలాకాక అధిభౌతిక చైతన్యాన్ని, హయ్యర్ ఇంటెలిజెన్స్‌ను మన మానవ చైతన్యం అంటే భౌతిక చైతన్యానికి జత కలపటానికి జన్మతః మనకు సంక్రమించిన బుద్ధి ఉపయోగపడాలి. అది కేవలం భౌతికానికి, ఈ వస్తు ప్రపంచానికే పరిమితమై పోకూడదు. సింపుల్‌గా చెప్పుకోవాలంటే సుఖం, దుఃఖం రెండూ ఉంటేనే మానవ జీవితం. రెండింటిలోని ‘అతి’ని ఆకర్షించకూడదు. అంటే, సుఖదుఃఖాల విషయంలో జీవితంలో సమత్వం సాధ్యం కావాలి.
దీనే్న గీతాచార్యుడు ‘సుఖ దుఃఖే సమేకృత్వా’ అని అంటాడు. మనం చెప్పుకుంటున్న హయ్యర్ ఇంటెలిజెన్స్ అంటే పరమార్థ వస్తు వివేకం అనే పరిజ్ఞానానికి భూమిక ఈ సమత్వ జీవనమే. ఈ సమత్వ కర్మాచరణే బుద్ధియోగం.’
జీవనయానంలో సంయమనం, సహనం సాధ్యమైతే ‘సమత’ ఆచరణలో తొంగిచూడగలదు. కర్మరాహిత్యం ఈ సమత్వ సిద్ధితోనే సాధ్యం. ఈ సాధ్యతకు కావలసిందే ‘సాధన’. ఈ బుద్ధిపూర్వక సాధనతో వ్యర్థత, హీనత అనేవి దరిదాపులకు రావు. అలాగే అతిగా ఆశించటాలు ఉండవు. అంటే, ఫలతృష్ణలోని సహనం, సంయమనం సాధ్యమవుతుంది. కోరికలే గుర్రాలయితే అంటారే - అంటే, మన కోరికలు గొంతెమ్మ కోరికలు కావు.
మొత్తానికి, ఈ బుద్ధి యోగసాధనతో ‘స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్’ యోగఫలాన్ని నిర్వచిస్తుంది గీత. అంటే ‘సుఖ దుఃఖ సమేకృత్వా లాభాలాభౌ జయాజ’ అనేది అతి సావాన్య విషయంగా అనిపించినా ఆచరణలో అది ఎప్పటికప్పుడు ఎండమావిలా మారుతుంటుంది. అయినా యోగసాధనతో సమత్వ సిద్ధిని పొందగలిగితే సంసార భయాన్ని ఇట్టే పోగొట్టుకోగలుగుతాం. ఈ యోగసాధనా క్రమాన్ని ‘వ్యవసాయాత్మికా బుద్ధి స్సమాధౌ’ అని అంటుంది గీత. వ్యవసాయాన్ని పోలిన సాధనతో మనం ద్వంద్వాతీత స్థితిని పొందగలగాలి.
* * *
‘బుద్ధి యోగం తం యేన మా ముపయాన్తి తే’
బుద్ధి యోగం చేతనే యోగసాధకులమైన మనం ‘ఆది’ అస్తిత్వాన్ని ఆవిష్కరించుకోగలం. అయితే ఈ బుద్ధియోగానికి కావలసింది ఆత్మభావం. ఈ ఆత్మభావం స్వయం ప్రకాశకం. ఈ జ్ఞాన ప్రకాశం వల్లనే అజ్ఞానం అనే అంధకారం తొలగుతుంది. అప్పుడు కానీ ఆదితత్వం అందుబాటులోకి రాదు. ఇదీ యోగసాధకుల యోగవిభూతి వైభవం.
ఆది తత్వానిది మహాచైతన్యం. మన మనస్సు తపస్సుగా పరిణమిస్తే తప్ప మన మానసిక చైతన్యం అధిమానసిక చైతన్యంతో సంయోగించలేదు. భౌతిక వనరుల మధ్య మన మానసిక స్థాయి ‘అవగాహన’కే పరిమితమై ఉంటుంది. సామాన్యంగా ఉండే మనస్సు కాస్తంత పెరిగితే తప్ప అవగాహన ‘వివేకం’గా పరిణమించదు.
భౌతిక క్షేత్రంలో ‘వస్తు వివేకం’గా నిలదొక్కుకున్నప్పటికీ అధిభౌతిక స్థాయిలో ‘పరమార్థ వస్తు వివేకం’గా ప్రస్ఫుటమవటానికి నిత్యయోగ సాధన అత్యంత అవసరం. ఈ నిత్య సాధనతో మన బుద్ధి ఎటువంటి విక్షేపం లేకుండా, వికల్పం లేకుండా ఆత్మజ్ఞానంతో ప్రకాశిస్తుంటుంది. అంటే, బుద్ధియోగం వల్ల ‘స్థిత ప్రజ్ఞత్వం’ సంప్రాప్తమవుతుంది.
* * *
మనం మైండ్‌కల్చర్ అని అంటుంటాం. ఈ మైండ్ కల్చర్ అనేది వివేక ప్రజ్ఞనే. సమదుఃఖ సుఖ ధీరత్వం ఈ మైండ్ కల్చర్ వల్లనే సాధ్యమవుతుంది. మైండ్ కల్చర్‌లో కంట్రోలింగ్ ది సెనె్సస్ కూడా ఒక భాగమే. దీనే్న ఇంద్రియ నిగ్రహం అంటుంది భగవద్గీత. మంచి చెడుల వివేచన, అవసర అనవసర విభజన, ఉచ్ఛ్వాస నిశ్వాసల గమనింపు, సత్వ, రజ స్తమో గుణాల ప్రవృత్తి - ఇవన్నీ బుద్ధియోగ నిత్య సాధనలో అంతర్లీనంగా భాగస్వామ్యం వహిస్తుంటాయి.
‘దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగాద్ధనం జయ/ బుద్ధౌ శరణ మన్విచ్ఛ కృపణాః ఫలహేతవః’
అని అంటాడు కృష్ణుడు ధనంజయుడితో. నిష్కామకర్మ యోగమైన బుద్ధియోగం కంటే కర్మాచరణ అనే కర్మయోగానిది ద్వితీయ స్థానమే అని అర్థం. కాబట్టి నిత్యయోగ సాధనతో మనం బుద్ధినే ఆశ్రయించాలి. కారణం బుద్ధియుక్త సాధన వల్లనే పాపపుణ్యాల ప్రస్తావన లేని యోగప్రాప్తి సాధ్యమవుతుంది. మొత్తానికి ద్వంద్వాలతో సమానత్వాన్ని సాధించడమే బుద్ధియోగం. ఈ అంశానే్న ‘కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః’ అని గీత స్పష్టం చేస్తోంది.
* * *
మనది సంసార తాపత్రయం. సామాజిక అనుబంధం భోగాసక్త మనస్తత్వం.. ఇంద్రియ వైభోగ వ్యక్తిత్వం... టెంప్టేషన్‌లు మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు.. జిహ్వ చాపల్య మానసిక చాంచల్యం మన మనుగడ. ఎప్పుడూ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతుండవలసిందే. ఇంతటి గందరగోళ జీవనశైలిలో అంతర్గత క్రమశిక్షణ అనేది అత్యవసరం. అనవసరాల నుండి విడివడక తప్పదు. ఈ డిసిప్లిన్ అన్ డిసిప్లిన్, ఎటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్ అనేవి మానసికాలు. బుద్ధిపూర్వక చర్యలు. కాబట్టి మన బుద్ధికి సమతాస్థితి చేరువ కావాలి. అంటే, అనవసరాలతో సంయోగించటం కాక వియోగించటం నేర్వాలి... అదే బుద్ధియోగ సాధన.
బుద్ధియోగ సాధనతో స్వస్వరూప దర్శనం సాధ్యవౌతుంది. ఇహలోక కామన అనే కాక పరలోక కామనల విషయంలోను అత్యాసక్తి లేకుండటం వల్లనే స్థితప్రజ్ఞత సాధ్యమై స్వస్వరూప దర్శనం కలుగుతుంది. అంటే, ఇహపర వాసనల విషయంలోను ఒకే విధమైన సంయమనం సాధ్యమైతే స్వరూప దర్శనం కలిగినట్లే.
‘దుఃఖేష్వనుద్విగ్న మనాస్సుఖేషు విగతస్పృహః/ వీతరాగ భయ క్రోధః స్థితధీర్ముని రుచ్యతే’
‘యస్సర్వత్రానభి స్నేహస్తత్త త్ప్రాప్య శుభాశుభమ్/ నౌభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా’
సంక్షోభం, తృష్ణ, ఆసక్తి, భయం, క్రోధం, ద్వేషం, తృప్తి, మమకారం, అహంకారం మొదలైన ఎటువంటి భావోద్రేకాలు లేని తనం బుద్ధియోగ ఫలితం - అంటే సామాన్యంగా జీవిస్తూ అసమాన్యంగా పరిణమించటం బుద్ధియోగ సాధనా సారాంశం.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946