వినదగు!

యోగ సాహిత్యంతో బుద్ధి బంధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వర్గం అనేది ఒకటుందని విశ్వసిస్తూ ఆ స్వర్గాన్ని చేరుకోవటానికి కూడా నోట్ల కట్టలు మీద తుది శ్వాస విడిస్తే సరిపోతుందనుకుంటే ఎలా?’
మొత్తానికి, నేను చెప్పొచ్చేదేమిటంటే, ఈ టిక్కెట్ల సామ్రాజ్యానికి యోగ భొమికలు అందిరావు. ప్రతీ క్షణం ‘నా’ పార్టిసిపేషన్ ఉందనుకునే వారికే యోగం. ఎవరో మంత్రాలు మన తరఫున వల్లిస్తే మనకు ఏదో వొరుగుతుందనే వారికి యోగం వొంటబట్టదు. యోగించటానికి కావలసింది నీ ఆత్మ ప్రయాణమే తప్ప నీ ప్రాపంచిక ప్రయాణం కాదు.’
‘ఈ మధ్య యోగ సాహిత్యంతో బుద్ధి బంధన అనే పదం చూసాను. చిత్తవృత్తి నిరోధం అన్నా బుద్ధి బంధనం అన్నా అర్థం ఒక్కటేనా, గురువుగారూ?’
‘రెండూ సమానార్థకాలే చైతన్యా.. అయితే బుద్ధి బంధనం అన్న పదంలో మన తెలివితేటలతో ఐహిక, ఆముష్మికాలను తూకం వేయకూడదు అన్న అంతరార్థం ఉంది. ఇక్కడ తూకం అంటే అటు ఆధ్యాత్మికాంశాలను కానీ, ఇటు భౌతిక విషయాలను కానీ కేవలం మన ‘ఎరుక’తోనే కొలవకూడదు అని.
ప్రాపంచికంగా కూడా మనం కొన్నిసార్లు తప్పుతుంటాం. అంటే, అలా తప్పటానికి కారణం మన మేధ అందించిన సలహా ఆ ఫలితాన్ని అందుకోవటానికి సరిపోలేదనే! అటువంటప్పుడు అగోచర ఆధ్యాత్మికత్వాన్ని మన భౌతిక ప్రజ్ఞతో అందుకో గలుగుతున్నామనుకోవటం ఒక అవాస్తవమే తప్ప అది సత్యమూ కాదు, పైగా అది సద్య్ఫఃలితాన్ని ఇస్తుందన్న గ్యారంటీనూ లేదు. పరేంగిత ప్రజ్ఞను మన ఇంగితంతో అందుకోగలగటం, అర్థం చేసుకోగలగటం అంత సులభసాధ్యం కాదు. అంతఃకరం శుద్ధి, అర్ధనిమీలిత ప్రజ్ఞ సాధ్యమైతేనే గికత్వంలోకి వన పరిణామం సాధ్యమయ్యేది.
‘అందుకే కాబోలు మామూలు జనం యోగం అంటే భయపడుతుంటారు. పైగా యోగాన్ని మార్మికంగా పరిగణిస్తుంటారు. అంతెందుకు భోగయోగం పేరిట యోగాన్ని ఆసనాలకే, శారీరక ఆరోగ్యానికే, దేహ దారుఢ్యానికే పరిమితం చేసుకోవటం యోగ మర్మాన్ని అర్థం చేసుకోలేక పోవటం వల్లనే.
బాడీ బిల్డింగ్ యోగం ఎందుకు అవుతుంది? యోగ సాధనకు దేహం ఒక సాధనమే తప్ప దేహారోగ్యమే గికానందం కాద కదా. ఇంకా భౌతికానికే బంధింపబడుతూ, ఈ భౌతిక భోగత్వానికే అర్రులు చాస్తున్నంత కాలం కాలాతీత గిక ప్రజ్ఞన అందుకోవటం కాదు కదా దాని ఛాయలకు వెళ్లటం కూడా సాధ్యంకాదు. ఇక గిక ప్రాంగణాల ప్రజ్ఞ కలిగేది ఎప్పుడ?’ చైతన్య ఎరుక అది.
అన్నట్టు చైతన్యా! భక్తిమార్గం కైవల్యప్రాప్తి కోసం, స్వర్గ సుఖం కోసం అయితే యోగ మార్గం సమాధి స్థితిని పొందటం కోసం, ఆరిజిన్‌తో ఆత్మ సంయోగించటం కోసం. కాబట్టి యోగ మార్గంలో స్వర్గ సుఖాపేక్ష ఉండదు, పుణ్యం మూట కట్టుకోవటం ఉండదు. యోగపరంగా భౌతికంగా డిపెనె్డన్సీ లేకపోవటమే ఇండిపెనె్డన్సీ.
అంటే, యోగ సాధకులు బాధ్యత వహిస్తారే తప్ప డిపెనె్డన్డ్స్ కారు.. ఒకరిపై ఆధారపడటం ఉండదు. సర్వ స్వతంత్రం వీరిది. పైగా ఆత్మ ప్రయాణమే వీరి లక్ష్యం తప్ప భౌతిక ప్రయాణం బాధ్యతా నిర్వహణ వరకే. అన్నట్టు, యోగ సాధన మన దేహాన్ని, మన మనసును భౌతికం నుండి పర తీరాలకు పరిణమింప చేస్తుంది. ఆ పరిణామంలో కలిగేదే సమాధి స్థితి. దీనే్న ఈనాటి యోగ సాహిత్యం ‘బ్లిస్‌ఫుల్ ట్రానె్సడెన్స్’ అంటుంది’ నా ధోరణి నాది.
‘గురువుగారూ, మీరు చెప్పినదాన్నిబట్టి, ఈ పాంచభౌతిక జీవనానికి భోగం, చిత్తవృత్తి, భక్తి, జ్ఞానం, కర్మ అన్న అయిదు సంస్కారాలు తప్పవన్నది నిర్ధారణ అవుతోంది. అయితే ఈ అయిదు సంస్కారాలను ఏ మేరకు పరిమితం చేసుకోవాలన్న విచక్షణ పైననే గిక పరిణావం ఆధారపడి ఉంటుందన్నమాట’
‘చైతన్యా, మరొక్కమాట. యోగాన్ని మతానికి కలుపుకుంటున్నంత కాలం మన జీవన మార్గంలోనూ కలుపుమొక్కలు ఏపుగా పెరుగుతూనే ఉంటాయి. రిలీజియన్ అనే స్టేట్ ఆఫ్ మైండ్’ నుండి విడివడటం ఎంత ముఖ్యమో ఆత్మకు ‘సరెండర్’ కావటమూ అంతే ముఖ్యం. ఆత్మకు సరెండర్ కావటం అంటే ఇండిపెనె్డన్డ్ కావటం అనే. దీనే్న భగవద్గీతలో కృష్ణుడు అన్నిటినీ తనకు అర్పితం చేయమంటాడు.
ఇక్కడ, ‘అర్పితం’ అంటే మనం అహాన్ని వీడి శూన్యం కావం. అహంకార రహితం కావటం.. ‘నేను’కు ఉన్న ‘మాయ’ల్ని తొలగించుకుని ‘నగ్నం’ కావటం.. శూన్యంలో ‘మగ్నం’ కావటం. ఇదే గిక సవాధి స్థితి. ఈ సమాధ్యవస్థలో ఇహమూ, పరమూ సంయోగిస్తాయి. ఆది అంతాలు లేని కాలం శూన్య తీరాలలో సేద తీరుతుంది. అంటే, కాలమూ శూన్యమై పోతుంది.
ఆ శూన్యంలో కృష్ణుడు ఉండడు.. అర్జునుడు ఉండడు. శివుడు ఉండడు... విష్ణువు ఉండడు. నేను ఉండను.. నువ్వు ఉండవు. ఉండేదల్లా ‘ఆత్మ’ మాత్రమే. ‘ఆరిజిన్’ మాత్రమే. ఆ ఆరిజినలే ఈ సృష్టి విస్ఫోటనమంతా.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946