వినదగు!

నాటి ప్రాకృతిక కర్మలే నేటి స్వాభావిక సంస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

............
కర్మయోగ సాధకులకు ఈ
సమదృష్టి, సమభావనల
ఆవశ్యకత ఏమిటి? అంటే
సమస్థితచిత్తం వల్లనే వర్తమాన మానవ జన్మలోనే ఈ భౌతిక ప్రాపంచికతకు
అతీతం కాగలం.
...................

మన మానవ దేహంలో ‘ఆత్మ’ అంతర్యామి!
మనను ఆవరించిన విశ్వంలో ‘పరమాత్మ’ అంతర్యామి!
మొత్తానికి ఆత్మ అయినా, పరమాత్మ అయినా అంతర్యాములే!
పరమాత్మ తన కార్యాచరణను విశ్వ రచనా రూపంలో కొనసాగిస్తూనే ఉంటుంది. అదే సృష్టి కార్యం. కాబట్టి జీవాత్మ కూడా తన కర్మాచరణను త్యజించవలసిన అవసరం లేదు... కారణం జీవాత్మ కూడా విశ్వ సృజనలో భాగస్వామి కాబట్టి. అయినా భౌతికతలోని కాలుష్యం వల్ల ఆత్మ దేహపరంగా సంచరిస్తున్నా కొన్ని కర్మల స్వాభావికత నుండి విడివడి కర్మాచరణను పూర్తి చేయవలసి వస్తోంది. అంటే రూటు మార్చవలసిన అవసరం లేకపోయినా గేరు మార్చి గమ్యం చేరవలసి వస్తోంది.
ఇలా గేరు మార్చటమే మనం ప్రాపంచికంగాను, దైహికంగాను సన్యసించటం. ఇదే కర్మ సన్యాసం... సాంఖ్య యోగం. ఇంతకీ సన్యసించటం అంటే జీవాత్మ తన కర్మాచరణను పరమాత్మ పరం చేయటం... భౌతిక కర్మలను అధిభౌతికానికి అంకితం చేయటం... సర్వ సమర్పణ అంటే ఇష్టాలకు అయిష్టాలకు అతీతం కావటం... ద్వైతం నుండి అద్వైతం కావటం... బంధాల నుండి విడివడటం - సన్యాసం.
నిజానికి ఏ వివక్షా లేని స్థితే సన్యాసం... అంతే తప్ప ప్రతి కర్మనూ త్యజించుకుంటూ పోవటం కదా. ఇలా చూసినప్పుడు సన్యాస యోగానికైనా, కర్మ యోగానికైనా లక్ష్యసిద్ధి ఒక్కటే. అయితే ప్రారంభమూ, గమనమూ వేరువేరు.
మొత్తానికి కర్మలకు సంబంధించిన కర్తృత్వ బాధ్యతను వహించకుండటం కర్మ సన్యాసం.. ఇదే యోగి లక్షణం. ఇక్కడ సన్యాస జీవనం అంటే ఆశారహితులం కావటం.. మమకార రహితులం కావటం.. సంతాప రహితులం కావటం.. అంటే సుఖదుఃఖాలకు, సంతోష సంతాపాలకు మనసును చేర్చకుండటం. ఇలా సమస్త కర్మ బంధాల నుండి ముక్తం కావటమే సాంఖ్యయోగ నిష్ఠ. ఆ జీవన విధానమే సాంఖ్య యోగ సాధన. అయితే ఈ సాంఖ్య సాధనకు జ్ఞాననిష్ఠ అవసరం.
ఆశలు, మమకారాలు, కోరికలు, ఆనందాలు, ఆవేదనలు, ఆవేశాలు, అవమానాలు, ఆక్రందనలు - ఇటువంటి ఉద్వేగాల సమాహారమే ప్రాపంచిక జీవనం. ఇవేవీ లేని మానవజీవితం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తటం సహజం. సృష్టిలోని ప్రతి ప్రాణీ తమ ప్రకృతులకు అనుగుణంగానే కర్మలను ఆచరిస్తుంటాయన్న అవగాహన మనందరకు ఉన్నదే. కాబట్టి కర్మాచరణను త్యజించటం జీవన ప్రవృత్తి కాదు అన్నది స్పష్టం. ప్రకృతిబద్ధమై జీవన యానం సాగించవలసిందే.
మనం చేసే కర్మల విషయంలో ఒక్క ప్రకృతి ప్రభావం అనే కాదు... మోహ ప్రభావం కూడా ఉంటుంది. దీనికి సంస్కార ప్రభావం తోడవుతుంటుంది. దీనే్న ‘స్వభావజేన.. నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోపి తత్’ అని అంటుంది భగవద్గీత.
మనం ఎంత కాదనుకుంటున్నా, వద్దనుకుంటున్నా స్వభావ కర్మ వర్తమాన కర్మను ప్రేరేపిస్తుంటుంది. ప్రభావితం చేస్తుంటుంది. ఇక్కడ స్వాభావిక కర్మ అంటే గత కర్మ అనే! దీనే్న మనం స్వాభావిక సంస్కారం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ జన్మకు సంబంధించిన కర్మాచరణ విషయంలో మనలో సంపూర్ణ ఇష్టత నెలకొని ఉండకపోయినప్పటికీ, స్వాభావిక సంస్కారం వల్ల వర్తమాన కర్మాచరణ విషయంలో వెనుతిరగటం సాధ్యపడదు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కర్మాచరణ తప్పదు.
ఇంతకీ స్వాభావిక కర్మ అనేది గతంతో సంబంధం కలిగి ఉన్నటువంటిది. అందుకే వర్తమాన కర్మాచరణను గత జన్మ కర్మ శేషం అంటుంటాం.. పూర్వజన్మనే ఈ జన్మ కర్మకు కారకం అంటుంటాం. కాబట్టి వర్తమాన కర్మాచరణ నుండి తప్పుకోవటం సాధ్యం కాదన్నది సామాన్య భావన.
యోగ జీవనంలో వర్తమాన కర్మాచరణకు మూలమైన ప్రకృతికి, స్వభావానికి అతీతం కావటం ముఖ్యం. అంటే స్వభావజనితంగా కాక వివేచనా పూర్వకంగా వర్తమాన కర్మాచరణ పరంగా అడుగులేయటం ముఖ్యం. ఇలా గత కర్మ బంధాల నుండి ముక్తం కావటమే కర్మయోగం.
ఈనాటి మన కర్మాచరణకు మూలమవుతున్న స్వభావం, సంస్కారం అన్నవి మన స్వతంత్ర ప్రవృత్తులుగా అనిపిస్తున్నా నిజానికి అవి పరతంత్రాలే! గత కర్మ శేషాలు కాబట్టి పరతంత్రాలే. పరతంత్రాలయినప్పటికీ స్వతంత్రా లనిపించటమూ మోహ ప్రభావ కారణానే్న!
ఇలా ‘కర్మ’ను అర్థం చేసుకునే ప్రయత్నంలో కర్మలు స్వభావ ఫలితాలనుకుంటున్నప్పటికీ గత జన్మ కర్మల సంస్కారాలే ఈ జన్మ స్వభావాలన్న సత్యాన్ని, వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. గతం ప్రకృతి అయితే వర్తమానమే స్వభావం. నాటి ప్రకృతి ప్రతిబింబమే నేటి స్వాభావిక సంస్కారం.
ఇంతకీ కర్మాచరణ పరంగా మనం చేసే యోగ సాధన ఏమిటి? అంటే మమతాసక్తికి దూరం కావటమే కర్మయోగానికి భూమిక. మన ఇంద్రియాలను, మనసును, బుద్ధిని, దేహాన్ని, అంతఃకరణ శుద్ధిపరంగా వినియోగించటమూ యోగ సాధనే. ప్రాపంచిక, భౌతిక, దైహిక స్వార్థాన్ని వీడి నిష్కామ భావనతో యోగ జీవనాన్ని సాగించటమే కర్మయోగం.
నిష్కామ భావనతోనే యోగ సాధకులమైన మనం కర్మ బంధనం నుండి విడివడగలం... అలాగే ఫలాసక్తి లేకపోవటంవల్ల సమదృష్టి సాధ్యమవుతుంది.

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946