వినమరుగైన

ఆధునిక మహాభారతము - గుంటూరు శేషేంద్ర శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈ దేశంలో ఒంగే వాడికి వంగి సలాములు
చేసేవాడు పుడుతున్నాడు
ఈ లక్షణం తలెత్తిందంటే ఆకాశంలో తోకచుక్క పుట్టినట్లే
వాడ్ని చంపెయ్యండి..
అసలు వాడ్ని మాతృగర్భంలోనే సంహరించండి
ఈ దేశపు గాలి పీల్చడానికి వాడికి హక్కులేదు..
ఇలా అనేస్తాడు. ఇతడు కమ్యూనిస్టు అనుకునేసరికీ.. వెంటనే-
‘‘విత్తనంలో వున్న నేను ఒక రాగం విన్నాను
.........
నేను చెట్టునయ్యాను- కొమ్మల్లో చెట్టు కలనయ్యాను
అంటే- రాగ రస గంధాలు మిళితమైన పువ్వునయ్యాను
... మట్టి, నీరు - గాలి ఒక వస్తువు
రూపాంతరాలనీ ఆ మూటి తాత్త్విక
అంశ నాలో ఉన్నాయనీ-
......
......
ఓహో నేను సౌందర్యంలో స్నానం చేస్తున్నాను..
చివరకు రాలేముందు తెలుసుకుంటుంది ఆ పండు, చెట్టు
గింజ తన కడుపులో ఉందనీ, చెట్టనుకునే ‘నేను’
పండనుకునే ‘నేను’ ‘రెండూ ఒకటేననీ’
ఈ ధోరణి చూస్తే ఆధునిక కవిత్వం చెప్పే ఆదిశంకరాచార్యులు కనిపిస్తాడు- దీన్ని వైరుధ్యమని విమర్శకుల దృష్టి కానీ
‘‘కాలాన్ని నా కాగితం చేసికుంటా
దానిమీద లోకానికి ఒక స్వప్నం రాసిస్తా
దాని కింద ఊపిరితో సంతకం చేస్తా’’
అనే కవి యొక్క కవిత్వాన్ని ఆమూలాగ్రహం మహాభాష్యం చెప్పుకుంటూ పోవాలి. అపుడు ఆ మహాభాష్యంలోంచి
‘‘స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం
న్యాయేణ మార్గేణ జన రాజ్య తంత్రాః
శుభమస్తు పశుపక్షి వృక్ష కీటభ్యః
లోకాః సమస్తాః సుఖినోభవంతు’’
అనే మాటలు వినిపిస్తాయి.
ఒకానొక ప్రాచీనమైన ఆత్మ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో మానవీయమైన కవిగా రూపాన్ని పొందిందనుకుందాం. అది విభిన్న కాలాలలో విభిన్న వ్యక్తీకరణలతో సాగుతుందనుకుందాం. ఆ ప్రస్థానంలో 20వ శతాబ్దపు చివరి భాగంలో ఎలా పలకాలో అలానే పలికిన సహజ కవిత్వ స్థితి ఆధునిక మహాభారతం ఆ స్థితికర్త-గుంటూరు శేషేంద్ర శర్మ. అందుకే ఆశగా శేషేంద్ర ఇలా రాశారు-
‘‘ఆధునిక మహాభారతం వింటే-
గులాం మనస్తత్వం కారణంగా వంగిపోయిన మోకాళ్లలో బలం వచ్చి, మనిషి కాళ్ళు నిటారుగా నిలుస్తాయి. దానిపైన వంగి వంగి
సలామూలు చేసి చేసి వంకర టింకర్లు అయిపోయిన వెనె్నముక ఇనుప చువ్వలా నిల్చుంటుంది. సిగ్గువిడిచి తలవంచి వంచి మెలిగే అలవాటు చేత సదా వేలాడే తల ఒక్కసారి భుజాలమీద లేచి నిర్భయంగా నిలబడుతుంది. మనిషి మనిషిగా మారిపోతాడు భూగోళానికి ఇరుసుగా మారిపోతాడు’’ ఎంతటి ఆశో!
ఈ ఆశ నెరవేరటానికి తన ఆధునిక మహాభారతాన్ని, ప్రజాపర్వం, సూర్యపర్వం, పశుపర్వం, ప్రవాహ పర్వం, ఆద్మపర్వం, ప్రేమ పర్వం, సముద్ర పర్వం, జ్యోత్స్నాపర్వం, వౌక్తికపర్వం, మయూర పర్వం అని విభజించుకొన్నారు. విభిన్న సందర్భాలలో రచించిన ఈ కవిత్వం ఒక వర్గీకరణకు లొంగడం కష్టం. అయినా కవి తన అనుభూతి పరంగా విభజించుకొన్నాడు.
ఏకసూత్రతగానీ, కథగానీ ఉండదు
కవి గుండె పాఠకుని గుండెతో రాచుకొన్న శబ్దం
కవి మనస్సు పాఠకుని మనస్సు కలిసి పరవశించే వైహ్వల్యం
కవి ఆత్మ పాఠకుని ఆత్మతో సంలీనమై చెందే తాదాత్మ్యం
ఈ మూడూ ఒకే సమయంలో కలుగుతాయి. కొందరు శబ్దం దగ్గరే ఆగిపోతారు. కొందరు మనో వైహ్వల్యం దగ్గర ఆగిపోతారు. కొందరు మాత్రమే తాదాత్మ్యం చెంది కవి ఎత్తుతో సమానంగా ఎదిగి నిలుస్తారు. ఫలితంగా శేషేంద్రలోని త్రివిక్రమత్వాన్ని చూడాలంటే ఆయన కవిత్వ విష్ణు స్వరూపాన్ని సమగ్రంగా ఏకాగ్రంగా పరిశీలించాలి.
ప్రజాపర్వంలో తనకూ, దేశానికీ, ప్రజలకూ అభేదాన్ని ప్రతిపాదించుకుని కవిత్వం చెపుతాడు.
అదే నా దేశమూ - నా ప్రజలు.
‘‘నేను ఒక విశాల హరితశాద్వలాన్నయి
వెల్లికల పడుకుంటాను. నా దేశపు పిల్లలు
బాల శీతల వాయువులతో ఆడుతూ పాడుతూ
విహరించడానికి.. పోదాం రా అక్కడ
నా దేశపు రాస్తాలు చైత్రమాసం పూలను పువ్వులలోకి
పరుగులిడతాయి. నా ప్రియమైన ప్రజల్ని
రైళ్లలా గొప్ప పండుగలను మోసుకుపోతాయి..’’
అలాగే నగర సంస్కృతిలోని దుర్బరస్థితికి బాధపడతాడు.
*
-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు -

శీర్షిక నుంచి..

-రాళ్లబండి కవితాప్రసాద్