వినమరుగైన

గయోపాఖ్యానము - చిలకమర్తి లక్ష్మీనరసింహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ అంకంలో కరుణ రసాత్మకమైన పద్యాలున్నాయి. అవి ప్రేక్షకుల మనస్సులను కరిగిస్తాయి.
ఖలులనేనియు కావ కంకణము దాల్చు
నలిన నాభుండు భక్తుని నన్ను చంప
ప్రతిన గైకొన రక్షించువా డెవండు
కంచెయే చేను మేసిన కలదె దిక్కు
తృతీయాంకంలో అరణ్యవాసంలో ఉన్న పాండవులదగ్గరకు గయుడు రావటం, అర్జునుడు అభయం ఇచ్చాక అసలు సంగతి తెలియటం అయినా శరణాగత రక్షణకు కట్టుబడాలని పాండవులు నిర్ణయించటం, ఇది తెలిసి కృష్ణుడు సుభద్రాదులను రాయబారం పంపటం, అది విఫలం కావటం ఈ కథాంశం.
ఈ అంకంలో వీర రసం తొణికసలాడే పద్యాలు ఉన్నాయి
నిటలాక్షిండిపుడెత్తి వచ్చినను రానీ యన్నదమ్ముల్ ననున్
విటతాటంబుగ బాసి పోయినను బోనీ విష్ణుడే వచ్చి వ
ద్ది పార్థా! యనీ మరే మయినగానీ లోకముల్ బెగ్గిలం
బడు దర్పంబున నిల్చి ఆ గయుని ప్రాణంబేను రక్షించెదన్
తన దేహము తన గేహము
తన కాలము తన ధనంబు తన విద్య జగ
జ్జనులకై వినియోగిం
చిన నరుడే నరుడు వాడె చెందున్ దివమున్
మొదలైన ప్రజల నాలుకలపై ఆడే ప్రసిద్ధ పద్యాలు
నాలుగవ అంకంలో సుభద్రాదుల మాటలు విని కృష్ణాదులు పాండవులను నిందించటం, రుక్మిణి సత్యభామ మొదలైనవారు సర్ది చెప్పబోగా కృష్ణుడు ఆగ్రహించి చివరకు తల్లి దేవకి చెప్పినా వినక యుద్ధానికి సిద్ధపడతాడు.
ఈ అంకంలో తెలుగు ఇళ్ళలో వుండే పుట్టింటి అత్తింటి వైరాలు, భార్య భర్తల మధ్యన వుండే ఎత్తిపొడుపులు, పురుషాధిక్యాన్ని ఎదిరించే మంచి మంచి సంభాషణలు ఉన్నాయి. - సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-పాలపర్తి శ్యామలానందప్రసాద్