వినమరుగైన

గయోపాఖ్యానము - చిలకమర్తి లక్ష్మీనరసింహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారె చీరెలు నగలును చాలగొనుచు
బుట్టినిండ్లు గుల్ల చేసి పోయి సతులు
తుదకు మగని పక్షము చేరి ఎదురగదురు
మగనిపై కూర్మి అధికంబు మగువకెపుడు
అంటాడు సుభద్రతో కృష్ణుడు. తల్లితో
తనయుని కంటె పుత్రికలె తద్దయు తల్లికి గూర్తురందు చే
ననయము నాడు వారలకు అల్లునిపైఅనురాగ మగ్గలం
బని బుధులందు రాపలుకులన్నియు నిక్కములయ్యె నాకతం
బున కొడుకెట్లు పోయినను పుత్రిక అల్లుడునున్న చాలొకో! అంటాడు.
‘ఈయన కతికోపము కల్గినది పట్టమహాదేవిని నాకవమానము కల్గునట్లు తిరస్కరించుటయే కాక, మా వంశమును కూడా నిందించిరి. మగవారిని నమ్మరాదు. తమ అక్కర తీరువరకు బ్రతిమాలి పిదప దాసి కంటె హీనముగా జూతురు’ అంటుంది రుక్మిణి.
‘కాంతలకు పురుషులెంత- చనువొసంగదగు నంతియమొసంగు వలయు. చనవు లెక్కువ యగునప్పుడు వారు కార్యలాఘవ గౌరవంబుల నరయలేక అన్నిట ప్రవేశింతురు’ అంటాడు బలరాముడు.
అయిదవ అంకంలో పాండవులకు సహాయంగా దుర్యోధనుడు సైన్యంతో వస్తాడు. శ్రీకృష్ణ బలరాములు యుద్ధానికి వస్తారు. గయుని విడవమని కృష్ణుడు అడిగినపుడు కృష్ణార్జునులకు సంవాదం నడుస్తుంది. చివరకు యుద్ధం ఆరంభవౌతుంది. ఒకరు మూర్ఛపడినపుడు మరొకరు బాధపడతారు. అయినా పంతం వీడక మళ్లీ యుద్ధం చేస్తారు. ఈ సంక్షోభ నివారణకు శివుడు ప్రత్యక్షమై ఇద్దరినీ వారిస్తాడు. కథ సుఖాంతం అవుతుంది.
ఈ అంకంలో సుప్రసిద్ధమైన అల్లుడా రమ్మని మొదలైన పద్యాలు, శివకేశవుల మాహత్మ్యాన్ని, అభేదాన్ని తెలిపే మనోహరమైన పద్యాలున్నాయి. ప్రధానపాత్రలైన కృష్ణ అర్జున గయులు ముగ్గురూ దోషులే అంటూ
ధర గలవారి జూడకయె తానుమియన్ గయు తప్పు; చూడ కీ
కరణి నొనర్చు వాని నఱకం గమకించుట నీదు తప్పు; తా
నరయక ముందుగా శరణు నాతనికిచ్చుట పార్థు తప్పు; ఓ!
సరసిజనాభ! యిక్కతన సంధియొనర్చుట యొప్పు నిత్తఱిన్
అని శివుడు చమత్కరిస్తాడు.
భిన్నమయునను నేకమై వెలయునెద్ది
ఏకమయ్యును భిన్నమై ఎసగునెద్ది
అమ్మహా దివ్య తేజంబు హరిహరులుగ
ద్వివిధమయి తోచె మన పూర్వ విభవమునను అని అర్జునుడంటాడు.
ఈ విధంగా ఈ నాటకం ఒక ఉదాత్తమైన వీర రసావిష్కారం వలన అద్భుతమైన కల్పన వలన, బంగారు తీగల వంటి పద్యాలవలన, తెలుగు నాటక రంగంమీద చిరంజీవి అయ్యింది. అయితే కృష్ణార్జునులు సామాన్య మానవులవలె ఒకరినొకరు నిందించుకోవటం ఔచిత్యానికి భంగకరమని శ్రీ జయంతి రామయ్య పంతులు మొదలైన ఒకరిద్దరు పెద్దలు ఈ నాటకాన్ని విమర్శించారు. ప్రేక్షకులు మాత్రం ఇప్పటికీ ఆ పద్యాలను, సంభాషణలను విని ఆనందిస్తూనే ఉన్నారు. సామాన్య మానవుల రాగద్వేషాలను, పంతాలు పట్టింపులను ప్రతిబింబించటమే గయోపాఖ్యాన విజయరహస్యం. క్రోధం, అహంకారం పెరిగినపుడు ఎంతటివారైనా తమ స్థాయిని మరచి ప్రవర్తిస్తారని కృష్ణార్జున పాత్రల ద్వారా వ్యక్తవౌతుంది. కాల్పనికమైనా, పౌరాణికమైనా జీవితానికి దగ్గరగా ఉంటే ఆ నాటకం ప్రజా బాహుళ్యాన్ని ఆకర్షిస్తుందనడానికి గయోపాఖ్యనం సజీవ ఉదాహరణ.

-అయపోయంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచ

--పాలపర్తి శ్యామలానందప్రసాద్