వినమరుగైన

ప్రతాపరుద్రీయము - (వేదము వేంకటరాయశాస్ర్తీ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్ ఆరేనెల్లకు పట్టుకుపోతాన్,
వీరణ్ణి రాగణ్ణి మన్ను చేయిస్తాన్,
గోతిలో పెట్టించి గోరీ కట్టిస్తాన్’’
అంటూ భూనభోంతరాలు దద్దరిల్లగా గర్జిస్తూ ఢిల్లీ పురవీధులను అల్లకల్లోలం చేస్తూ పిచ్చివానిగా తిరుగుతున్న యుగంధర మంత్రి, కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుణ్ణి సుల్తాన్ ఘియాజుద్దీన్ అనుచరులు బందీగా తీసుకొని వెళ్లగా రూపసామ్యంగల పేరిగాణ్ణి గద్దెపై నిలిపి పరిపాలన నిర్వహిస్తున్న జనార్దనమంత్రి, శత్రు శిబిరంలోకి చొచ్చుకొనిపోయి ఖానుల్ని ఓ పట్టు పట్టి మట్టికరిపిస్తున్న యమజోస్యులు చకుముకి శాస్ర్తీ, మహాకవి, పండితుడు విద్యానాథుడు అమాత్యవర్గంగా భారతీయ బ్రాహ్మక్షాత్ర ధర్మనిర్మాతలుగా కొమ్ముకాస్తున్నారు. ఒకవైపు గద్దెనెక్కి సారా చెంబుతాడు (స్వారస్యపు త్రాడు)వల్ల ఇబ్బంది పడుతూనే కొలువు నిర్వహిస్తూ అచ్చమైన తెలుగు జానపద హాస్యాన్ని పండిస్తున్నాడు పేరిగాడు. ఒకవైపు యాస బాసలో పెద్ద ఊహలను, రాజకీయ కుట్రలను పుక్కిటి బట్టి ప్రతినాయకత్వపు బిరుదులతో నవ్విస్తూనే ద్వేషులౌతున్నారు. వల్లీఖాన్, ఖుస్రూఖాన్, మహావీరుడూ, ధర్మోత్తరపరిపాలకుడు అయినా విధివశాన బందీయై అమాత్యుల కృషివల్ల మళ్లీ గద్దెనెక్కిన ప్రతాపరుద్రుడు నమ్రుడై యుగంధరుల పాదాలంటి కృతజ్ఞత చెప్పుకుంటున్నాడు. రాజమాత ముమ్మడమ్మ, మహారాజ్ఞి, పేరిగాని ఇల్లాలు ఎల్లి - ఇలా వేదం వేంకట రాయశాస్ర్తీ ప్రతాపరుద్రీయ నాటకంలో ఎవరినైనా చూడండి, అందరూ సజీవ శిల్పమూర్తులు, రసభావ రమ్యకీర్తులు. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

దారా రామనాథశాస్ర్తీ