వినమరుగైన

రాణా ప్రతాపసింహ చరిత్ర - దుర్భాక రాజశేఖర శతావధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవి జీవితానికీ- కవిత్వానికీ వున్న అనుబంధం విడదీయరానిది- గాంధీజీ పిలుపుతో ప్రభుత్వ ఉద్యోగాన్ని పరిత్యజించిన దేశభక్తుడు రాజశేఖరకవి- కవి, కావ్యనాయకుడు అద్వైత స్థితినంది ఈ కావ్యంలో సాక్షాత్కరిస్తారు.
‘‘నేనల్లప్పుడు భావనాబలమునన్ నీ రూప - నాదు - క్రియా
ధ్యానంబున్ గొని తన్మయత్వమున నన్యాకాంక్షలేకుండు నీ
వే నే నైతినో- నేనే నీ వయితివో - రూపింపంగ రాకుండె ని
త్యానందంబు ఘటించే కృతి, ప్రతాపా! విశ్వలోకార్చితా!’’
‘‘ఇది రాజశేఖర కవికి పరిపూర్ణ తృప్తినిచ్చిన కృతి- తెలుగు జాతిమెచ్చిన కృతి- రాజశేఖర కృతులెన్ని వున్నా, వారి యశఃసౌధానికి విజయకేతనమై వెలిగే రసవత్కృతి రాణాప్రతాప చరిత్ర అని జానుమద్ది హనుమచ్ఛాస్ర్తీగారు చేసిన వ్యాఖ్య ప్రత్యక్షర సత్యం!
రాజశేఖర కవి రాణాప్రతాప కావ్య పరమార్థాన్ని ఆవిష్కరించిన తీరు అనన్య సామాన్యమైనది రాణాప్రతాపుడు రక్తపిపాసతోగాని, సామ్రాజ్య కబళన కాంక్షతోగాని అక్బరుతో యుద్ధం చేయలేడు. భారత ధర్మపరులకు లొంగిపోదు. పుడిసెం డూపిరి మేననుండు వరకున్ పోరాడు అని ఋజువు చేయడానికై యుద్ధం చేశాడు.
‘‘కాన విజయంబె ముఖ్యంబు కాదు మనకు
ధర్మ నిర్వహణంబు కర్తవ్యమిపుడు’’
అన్న రాణాప్రతాపుని మాటలు ఈ సత్యానే్న నిరూపిస్తాయి. ‘‘నేను నీవాడనే అంటే చాలు- ఆర్యావర్తంలో అర్థ్భాగం ఇస్తానని అక్బరు చక్రవర్తి రాయబారం పంపితే ప్రతాపసింహుడు-
‘వల్కలము గట్టి స్వాతంత్య్ర వైభవమున
నిట్లె సన్యసినై యున్న నిదియె చాలు
నాకు, భోభాగ్యముల కెంతయును దూర(ము)
మాస విడిచిన వాని కాయాసమేల?’’
అని తిరస్కరించడంలో వార్తాయోగి గాంధీ మహాత్ముడే మనకు స్ఫూర్తిస్తాడు. రాణా ప్రతాపుని వీరకృత్యాలూ- చేసిన త్యాగాలూ అనుభవించిన బాధలూ- మహాత్ముని నాయకత్వంలో స్వాతంత్య్రం కోసమై చేసిన త్యాగాలతో సంవదిస్తున్నాయని డాక్టర్ నారాయణరెడ్డిగారి అభిప్రాయం. విశ్వనాథ వారన్నట్లుగా ‘‘ఈ కావ్యం అస్వతంత్య్రం భారత జాతికొక స్మృతిగ్రంథం వంటిది’’ అనటంలో సందేహం లేదు.
రాణాప్రతాప చరిత్రలో ప్రధాన రసం ధర్మవీరం! ఐదాశ్వాసాల కావ్యంలో దాదాపు మూడాశ్వాసాలు వీరరసపోషణకే కవి వినియోగించాడు- అన్నగారిని ఎదిరించి అక్బరు పక్షంలో చేరిన సోదరులు సాగరసూక్తులు ప్రతాపునిపై కత్తిగట్టారు- వారు అన్నగారిపై విజృంభించిన దృశ్యం-
-అయపోయంది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-జంధ్యాల మహతి శంకర్