వినమరుగైన

కన్యాశుల్కం - గురజాడ అప్పారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిరీశం ఆషాఢభూతి స్వభావం వ్యక్తమైనంతగా మధురవాణి మేలైన స్వభావం వ్యక్తం కాలేదు. ఇక వాస్తవికత విశదీకరణ వ్యక్తమయ్యే అవకాశమే లేదు.
నేను సాహిత్యవేత్తను కాను. ప్రయోక్తగా ఈ నాటకాన్ని అర్థం చేసుకుంటూ ఆలోచిస్తున్నవాణ్ణి. అందుకని ఈ నాటకరచయితని, దాన్ని తరచిచూసినకొందరు సాహిత్యవేత్తల్ని సాయం తెచ్చుకుని కనిపించిన కొన్నికోణాలకి భిన్నమైన చారిత్రక దృక్కోణాన్ని కాలపరిమితి కారణంగా స్థూలంగా వివరించి మీ ముందుంచుతున్నాను.
చారిత్రక దృక్కోణం
మన సమాజాన్ని గురజాడ వస్తుగత దృష్టితో పరిశీలించాడు. వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారన్నట్లు తన కాలానికి అభివృద్ధి చెందిన ప్రాపంచిక దృక్పథంతో విమర్శించి విశే్లషించి మన సమాజ వాస్తవికతని వ్యక్తం చేశాడు. మధురవాణి చిరస్మరణీయమైన ప్రధాన పాత్రగా చిత్రించి చివరికి ప్రశ్నార్థకంగా నిలబెట్టి నాటకాన్ని ముగించాడు.
వకులాభరణం రామకృష్ణగారన్నట్లు గురజాడ ఇంటలెక్చ్యువల్ ఎక్విప్‌మెంట్ అర్థమైతేనే రచన వెనుకున్న ఆయన ఉన్నత లక్ష్యం, ఆశయం మనకర్థమవుతుంది. స్టానిఫ్లవస్కీ ఆధునిక నాటక రచనా లక్షణాన్నిలా నిర్వచించాడు.
తాత్కాలిక లక్ష్యాల్ని సాధనంగా చేసుకొని రచయిత నాటకాన్ని నడిపిస్తాడు. చివరలో ఎరపడ్డాక తన వున్నత లక్ష్యం స్ఫురించేలా నాటకాన్ని ముగిస్తాడు.
ఈ లక్షణం కన్యాశుల్కం నాటకంలో స్పష్టంగా కనిపిస్తుంది.
తాత్కాలిక లక్ష్యంలు- బాల్య వివాహ, విధవా వివాహ, వేశ్యా సమస్యలు- ఇక ముగించే ముందు సూచించిన ఉన్నత లక్ష్యం ఏమిటో అనే్వషించాలి. అందుకు ఆధారం రెండో కూర్పుకి రచయిత రాసిన పీఠికలో వుంది.
‘జజఆళ్ఘూఆఖూళ జశ ఆ్దళ పళూశ్ఘషఖ్ఘూ తీజ రీశ్యషరీ ఘఆఆ్దళ జ్య్యూ యచి ఆ్దళ ఔళ్ఘఒ్ఘశఆ ఘశజూ జఆ తీజ రీశ్యషరీ ఘఆ ఆ్దళ జ్య్యూ యచి ఆ్దళ ఉశజఒ్ద ఘౄశ జశ నిశజూజ్ఘ. నిఆఒ ఔ్యఒఒజఇజజఆజళఒ ఘూళ జౄౄళశఒళ’’
ధీన్ని బట్టి వ్యావహారిక భాషలో వచ్చే సారస్వతానికున్న బహుళ ప్రయోజనాన్ని నిరూపించడానికి చేసిన రచన కన్యాశుల్కం అన్నది స్పష్టం. ఇందులోని రైతుని మేలుకొలిపి బ్రిటీష్ వాణ్ణి కదిపే అంశం వున్నత లక్ష్యమై ఉంటుంది. ఈ నాటకాన్ని అనేకసార్లు ప్రదర్శించిన అబ్బూరివారిలా అన్నారు.
‘‘కన్యాశుల్కం నాటకంలో ఆడపిల్లల్ని అమ్ముకోవడమనే దురాచారాన్ని మాన్పడం ప్రధానంగా వున్నట్లు కనిపించినా, కలకాలంగా మన బతుకును భారంగా చేసిన నిస్సత్తువనూ, మాంధ్యాన్నీ చెదరగొట్టి, మన ఐహిక జీవనంలో ఉత్సాహాన్ని రేకెత్తించే, నిద్రాణంగా వున్న మానవజాతిని మేలుకొలపటానికి రుూ నాటకం ఉపకరిస్తుందని కొంచెం నిదానంగా చూస్తే తెలుస్తుంది’’.
ఈ వివరణని బట్టి జాతీయమైన సమస్యలకి అప్పటి అంతర్జాతీయమైన చారిత్రక సందర్భానికి వున్న అవినాభావ సంబంధాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఆనందగజపతి ఆజ్ఞ మేరకు కన్యాశుల్కం దురాచారాన్ని నిరసించే ఉద్దేశంతో నాటకాన్ని రాసినా రచయిత ఆ దురాచార మూలాల్ని చరిత్ర గదిలో సూచించి వర్తమాన చారిత్రక పరివర్తన వ్యక్తమయ్యే రీతిలో ఆద్యంతాల్ని నిర్దేశించుకున్నాడు. సినిమా పరిభాషలో నాటకం ఆఫ్ వేలో ఓపెనవుతుంది. ఒకచోట అర్థవంతంగా ఆగుతుంది. అందుకే శ్రీశ్రీ నాటకం ఆరంభానికి ముందెంత కథ వుందో, ఆగాక అంత కథ వుందన్నాడు. కన్యాశుల్కం జీవితమంత విశాలమైందని కితాబిచ్చాడు.
కన్యాశుల్కం నాటకానికి ఈ చారిత్రక దృష్టి వున్నందువల్లే జీవితానికున్న విశాలతని- నిరంతరాయతని సంతరించుకోగల్గింది. ప్రయోక్త శాస్ర్తియమైన చారిత్రక దృష్టితో నాటకాన్ని లోతుగా అధ్యయనం చేస్తే అందులో పాత్ర చిత్రణ సంభాషణల్లో వున్న ఆధారాలు అవుపిస్తాయి.
రావిశాస్ర్తీ నోట విని నేను ఆశ్చర్యపోయిన ఆధారాన్ని ఉదాహరణగా చెబుతాను.
గిరీశం స్వగతం సాయంకాలమైంది అన్న మాటలతో నాటకం ఆరంభమైంది. ఆ మాట ఎక్కడ నుంచుని అన్నాడు? బొంకుల దిబ్బమీద. దాని వెనకేముంది? పాతబడిన విజయనగర కోట. కనక ‘సాయంకాలమైంది’ అన్నది కేవలం కాలసూచనే కాదు శిథిల రాచరిక వ్యవస్థకి సాయంకాలమైందన్న సూచనా వుంది.
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కాకరాల