వినమరుగైన

కన్యాశుల్కం - గురజాడ అప్పారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత కొత్తల కీడు కలయికగా ఉదయించబోతున్న ఒకానొక సంక్లిష్ట స్వభావం తనని తాను పరిచయం చేసుకుంటూ నాటకాన్ని ఆరంభించింది.
ఈ ఆరంభపు మెలకువలుల అర్థవంతమైన ముగింపు తొలి కూర్పులోనే వున్నాయి. అయితే అందులో పాత కొత్తల కీడు కలయిక జరిగినంతగా మేలు కలయిక జరగలేదు. ఆ గుణ దోషాల్ని బేలన్స్ చేసే ఉద్దేశంతోనే గురజాడ ఆకాశాన్ని పైకెత్తేంత విశ్వ ప్రయత్నం చేసుంటారు. ఫలితంగా నాటకం మహా నాటకమైంది.
ఇందుకు ఆధారం గురజాడ జీవితంలోనే కనిపిస్తుంది. విజయనగరంలో ఓ డిబేటింగ్ సొసైటీకి గురజాడ ఉపాధ్యక్షులట. ఆయన అక్కడ స్ర్తి సమస్యమీద మాట్లాడేటప్పుడు మానవజాతి వినాశనానికి మహిళే మూలమని ఉపన్యాసం ఎత్తుకునేవారట. చివరికి శాస్ర్తియమైన ఆధారాలతో మగవాడే ఎలా కారణమైందీ నిరూపించి ఉపన్యాసాన్ని ముగించేవారట. విస్తరించి వికసించిన రెండో కూర్పు ఆద్యంతాల్లో ఈ ఒడుపు స్పష్టంగానే కనిపిస్తుంది.
అయితే గిరీశం పాత్ర చిత్రణలోని వెలుగునీడలు వీలైనంత స్పష్టంగా వ్యక్తం కావాలంటే నాటకం ఆరంభానికి ముందూ, ఆ తరువాత దృశ్యాల గమనంలోనూ పూర్వ చరిత్ర ఎలా సూచించాలో ఆలోచిస్తూ ప్రయోక్త నాటకాన్ని నడిపించాలి.
చరిత్ర గతిలో గణతంత్రాలది ప్రజాస్వామిక పునాది. పాలక వర్గాలు వాటిని విచ్ఛిన్నం చేసి రాచరిక వ్యవస్థని నిర్మించాయి. ప్రాచ్య ప్రపంచంలో రాచరికం నగ్నంగా కనిపిస్తూ పాలిస్తే పాశ్చాత్య ప్రపంచంలో ప్రజాస్వామ్యం మేలి ముసుగులో ఆ పనిచేసింది. అన్నిచోట్లా ఆడది గృహిణిగా, వేశ్యగా- అమ్మకం వస్తువుగానే వుంది. ఎటొచ్చీ గృహిణిది లైఫ్ కాంట్రాక్టయితే, వేశ్యది కాజువల్ కాంట్రాక్ట్, శ్రమించే పురుషులు బానిసలయిన మానవ సమాజంలో ఆ పురుషులకి బానిస ఆడది.
పారిశ్రామిక విప్లవానంతర ప్రపంచంలో వచ్చిన పెను మార్పులవల్ల వలసల్లోని విశ్వవిద్యాలయాల్నించి రూపొందుతున్న పాత కొత్తల కీడు కలయిక ఇది. ఇదెంత ఆకర్షణీయమైన ప్రమాదమో అర్థం చేయించేలా గిరీశం పాత్ర పోషణ సాగాలి.
ఇందుకు ఆధారాలు తొలి దృశ్యం నిండా వున్నాయి. గిరీశం తన్ను తాను పరిచయం చేసుకుంటూనే ‘‘నిఆ జఒ త్యీౄళశ ఆ్ద్ఘఆ ఒళజూఖషళ ఘ ఘౄశరీజశజూ’’ అని మధురవాణిని పరిచయం చేస్తాడు. పరస్పర హరణోద్యోగంలో తానెంత చెయ్యి తిరిగినవాడో తన ప్రవర్తన ద్వారా వెంకటేశం బంట్రోతుల దగ్గర నిరూపిస్తాడు. దృశ్యాంతంలో మేక్ హే వైల్ ది సన్‌షైన్స్ అనడంతో తాను ఏ అనువంశిక లక్షణాల్నించి పుట్టి ఏ వర్గానికి ప్రతీకై ప్రవర్తించబోతున్నదీ సూచించాడు.
ఇలాగే మధురవాణి రెండో దృశ్యంలో తనను తాను పరిచయం చేసుకుంది. మగాడికైనా ఆడదానికైనా నీతుండాలనీ ఆరంభమైన మధురవాణి వర్తమాన సమాజంలో రూపాంతరం చెందుతున్న వేశ్య వ్యవస్థా సానిదానికున్న నీతిని వదిలి ఎలా పతనమవుతుందో సూచించింది. తాను అందరి సాన్ల వంటిదాన్ని కానని నిరూపించుకుంది. ఆమె తన ప్రవర్తన ద్వారా గురువు మించిన శిష్యురాలినని కూడా నిరూపించుకుంది.
నాటకానికి చోదక శక్తులైన గిరీశం మధురవాణుల్ని, విధవా వివాహ సమస్యకి, బాల్య వివాహ సమ్సయకి ముడేసి, తాను తెలివిగా వెనక్కి తప్పుకున్నాడు గురజాడ. వేశ్యా సమస్యకి ఆమె ప్రతినిధైనందువల్ల అది ఆమెతో కూడా వుంది. కృష్ణరాయ పురాగ్రహారం నుంచి గిరీశం,రామచంద్ర పురాగ్రహారం నుంచి మధురవాణి సమాజ ప్రాతినిధ్యాలైన పాత్రల్ని పరిచయం చేస్తూ నాటకాన్ని నడిపిస్తారు.
గిరీశం ఉత్తరం ద్వారా మధురవాణి వెనక నుంచి సూత్రధారై హంగు చేస్తూనూ, శిథిల వ్యవస్థకి ప్రతినిధేగాక ప్రతీక కూడా అయిన ఉబ్ధావధాన్లని పరిచయం చేస్తారు. మధురవాణైతే చక్రం అడ్డువేస్తానంటూ చక్రవ్యూహం పన్ని పీక్కి ఉరిచుట్టుకునే పరిస్థితుల్ని సృష్టించింది. ఈ ప్రయత్నంలోనే సమాజంలోని ఉన్నత అధో జగత్తుల జీవిత వాస్తవికత సూచిమైంది.
ఇంతేకాదు దాసరి వేషంలో వున్న శిష్యుడు పాడిన తత్త్వం ద్వారా ‘సమాజంలో వున్న సమస్యలకి మూలమైన సొంతాస్థి ఊబిలో కూరుకుపోయినవారు, ఎంత సంస్కరించదల్చుకున్నా సంస్కరించబడరని సూచితమైంది.
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
*
-సశేషం

-కాకరాల