వినమరుగైన

కన్యాశుల్కం - గురజాడ అప్పారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్నార్థకంగా నిల్చిన మధురవాణి చెవుల్లో, సత్పురుషులు చెప్పిన భగవద్గీత దగ్గర తనకి రక్షణ వుందా? లేక తన స్వానుభవం ‘‘ఒక రైతు కిల్లాలినై వంగ మొక్కలికి, మిరప మొక్కలికీ నీళ్లు పోసుకుంటే నా అన్నవారుండేవారేమో’’ అని చెప్పిన చోట రక్షణ సంరక్షణగా వుంటుందా అన్న సందేహాలు మారుమ్రోగి ప్రశ్నల్నించి ప్రశ్నల్ని పుట్టిస్తూ ఉంటాయి.
చివరికి తెరపడ్డాక లేచిన ప్రేక్షకుడు పరిశోధకుని స్థాయికి ఎదిగి నాటకం ముగిసిన తరువాత జరుగుతున్న ఉత్తరోత్తర చరిత్రని శాస్ర్తియంగా వూహించే స్థాయికెదుగుతాడు. అలాంటి ప్రేక్షకుడి కళ్లముందు శిథిలమైపోతున్న రాచరిక వ్యవస్థకి పూర్తి ప్రత్యామ్నాయమైన ప్రజాస్వామిక దృక్పథమే గురజాడ అడుగుజాడని అర్థమవుతుంది. అదే మనలో వెధవాయిత్వాన్ని మరిపించే - బతుకు - పాటయి మనల్ని వెన్నంటి భావికి బాటలు వేసే ప్రజల ఉద్యమాలవైపు నడిపిస్తుంది.
పునర్వికాశోధ్యమ సంస్కర్తలందరూ ప్రజాస్వామ్యానే్న ప్రతిపాదించారు.
ఐతే అందరూ శిథిల సమాజానికి చెందిన పితృస్వామిక అవశేషాల్నించి బయటపడలేకపోయారు. అందుకు దృష్టాంతంగా ఆంధ్రప్రదేశ్‌లో సంస్కరణోద్యమాన్ని వొంటి చేతిమీద నడిపిన వీరేశలింగం జీవితమే దృష్టాంతం. ఆయన సంస్కరించదల్చుకున్న అందరూ పూర్తిగా సంస్కరించబడిన దాఖలాల్లేవు. శుద్ధ సనాతన కుటుంబంలో పుట్టిన తాను ఇతరుల్ని సంస్కరించే ప్రయత్నంలో తనని తాను సంస్కరించుకుని మంచికి మారాడు. అన్ని సనాతన ఆచారాల్ని వదులుకుని హరిజనులతో సహపంక్తి భోజనం దాకా వచ్చాడు. అయితే పితృస్వామిక అవశేషాల్ని బయటపడే రాజకీయ చైతన్యం ఆయన్లో రాలేదు.
అందువల్లనే కొ.కు క చోట ‘‘వెనకకి తిరిగి చూసుకుంటే, ఇంత గొప్పవాడికి రాజకీయ పరిజ్ఞానం లేకపోవడం ఒక కళంకమేమోననిపిస్తుంది’’ అని ఆయన కాలంలో వున్న రాజకీయాల స్వభావంవల్ల ఆయన నైతిక దృక్పథం వైపు వెళ్లి ఉండవచ్చన్నారు. ఇది ఆ కాలపు సంస్కర్తలందరికీ వున్న పరిమితి, గురజాడ తన ఇంటలెక్చువల్ ఎక్విప్‌మెంట్‌తో - ప్రాచ్య పాశ్చాత్య నాటక రచనా పద్ధతుల అనుభవ సారంతో బురదలో కమలంలా పుట్టిన మధురవాణి జీవితానికి ఆమె జీవిత సంఘర్షణ నుంచే ఆ రాజకీయ పరిజ్ఞానం అందించాడు. ప్రజాస్వామిక చైతన్యానికి ప్రతీకగా నిలబెట్టాడు.
ప్రయోక్త ప్రజాస్వామిక చైతన్యానికెదిగిన మధురవాణిని ప్రశ్నార్థకంగా నిలబెట్టి ప్రశ్నించగలిగితే, ప్రేక్షకుడు ఆ వుప్పందుకుని ఉత్తరోత్తర చరిత్రని శాస్ర్తియంగా వూహించగలుగుతాడు. అయితే ఇక్కడో చిన్న వ్యత్యాసముంది. గురజాడ తన కాలానికి అభివృద్ధి చెందిన బూర్జువా ప్రజాస్వామిక దృక్పథంతో విమర్శించి విశే్లషించి ప్రశ్నార్థకంగా మధురవాణిని నిలబెట్టాడు. ఎంత మేధావైనా తన కాలపు చారిత్రక పరిధిని అధిగమించి ఆలోచించలేదని అలా చేశాడు. అందుకే కన్యాశుల్కాన్ని ప్రాబ్లమేటిక్ ప్లే అంటున్నారు.
ఆయన ప్రాపంచిక దృక్పథం నుంచి బూర్జువా ప్రజాస్వామిక దృక్పథంలో వున్న గుణాన్నీ, దోషాన్నీ ఆయనలా చూడగల్గినవారే గిరీశం మధురవాణిల స్వభావ చైతన్యాల్ని సరిగ్గా గ్రహించగలరు. గుణానే్న తప్ప దోషాన్ని చూడలేనివారు లేదా చూడ్డానికి ఇష్టపడనివారు గిరీశాన్ని నాయకుడిగా భావించి మధురవాణి స్వభావ చైతన్యాల్ని విస్మరిస్తారు కాని.. చరిత్రని గతి తార్కికంగా చర్చించి చూడగల్గడం ప్రాపంచిక దృక్పథంలో అనంతరం వచ్చిన అభివృద్ధి. ఆ అభివృద్ధి చెందిన ప్రాపంచిక దృక్పథంలో కన్యాశుల్కం నాటకాన్ని చూడగల్గిన వారికి సిస్మోగ్రాఫ్ అయి రాబోయే భూకంపాల్ని ముందే చూడగల శక్తినిస్తుంది.
అలా చూడగల్గిన వారి చూపు నుంచి ఉత్తరోత్తర చరిత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి కొ.కు. నవలల్లో కథల్లోని పాత్రల్నించి గిరీశం తొంగిచూస్తూ వుంటారు. శ్రీశ్రీ మహాప్రస్థానంలోని వాడులోవాడిని శ్రమ జీవుల చూపునుంచి స్పష్టంగానే కనిపిస్తాడు.
రా.వి.శాస్ర్తీ నవలల్లో, మరీ ముఖ్యంగా నాటకాల్లో గిరీశం అనంతర రూపాలు రాను రాను వారి వారి బజారు మనుషులు తత్త్వాన్ని ప్రస్ఫుటీకరించుకుంటూ కనిపిస్తాయి. ఉదాహరణకి ఆయన తిరస్మృతి నాటకం నగ్న స్వార్థానికి మారిన మోహనబాబుని చూపిస్తే తానే ప్రభుత్వం తానే ప్రజా అయి దోషుల్ని నిర్దోషులుగా, నిర్దోషుల్ని దోషులుగా మార్చే సార్వభౌమరావుని చూపిస్తుంది. ఆయనదే విషాదం అనే చిన్న నాటిక. వందేళ్ల క్రితం గురజాడ గుర్తించిన ఈ లక్షణం వృశ్చిక సంతానమై తరం తరానికి తామరతంపరగా ఎలా వృద్ధి చెందుతుందో చెప్పింది. ఇక కారా మాస్టారి యజ్ఞం కథయితే ప్రజాస్వామిక రాజ్యాన్ని ఆక్రమించుకున్న ఆ లక్షణం భావి తరాల చైతన్యాన్ని పెరగనివ్వకుండా జనరల్ బాడి నుంచి హెడ్‌ను వేరు చేసి కనపడని విధంగా ఎలా కంట్రోల్ చేస్తుందో చెప్పకుండా చెప్పింది.
ఇంతకీ నే చెప్పొచ్చేదేమిటంటే కన్యాశుల్కం నాటకం కొందరికి నాటకమే కాదనిపించవచ్చు. కాని.. గురజాడ కాలానికి అభివృద్ధి చెందిన బూర్జువా ప్రాపంచిక దృక్పథంతో చూడగల్గినవారికి అది విభిన్న కోణాల్ని చూపగా, కెలడియోస్కోపు చరిత్రని గతి తార్కిక దృష్టి నుంచి చూడగల్గిన వారికది రాబోయే భూకంపాన్ని ముందేచూపించగల సిస్మోగ్రాఫ్, శాస్ర్తియమైన ప్రాపంచిన దృష్టి ప్రేక్షకుల్లో పెరుగుతున్న కొద్దీ కన్యాశుల్కం నాటకం అమ్మడం - కొనడం అనే మార్కెట్ వ్యవస్థ గతించేదాకా దాని అంతర్గత చలనాల్ని తనలో దాచుకుంటూ కదిలే కాలనాళిక. గతించాక కూడా ఒకానొక చారిత్రక సందర్భాన్ని భావితరాలకి గుర్తుచేస్తూ నిలిచిపోయే చారిత్రక పత్రం. వెరసి తెలుగునాడున్నంత కాలం తెలుగువాడి ఆలోచనకి పదునుబెట్టే మహానాటకం.
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
-అయిపోయంది

కాకరాల