వినమరుగైన

పానశాల -దువ్వూరి రామిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతములేని రుూ భువనమంత పురాతన పాంధశాల, వి
శ్రాంతి గృహంబు, నందు నిరుసంజలు రంగుల వాకిళుల్, ధరా
క్రాంతలు పాదుషాలు, బహురామ్ జమిషీడులు వేనవేలుగా
గొంత సుఖించిపోయి రెటకో పెరవారికి చోటా సంగుచున్

తెలుగు సాహిత్యంలో పరిచయమున్న ప్రతి ఒక్కరికీ ఈ పద్యం తెలిసే వుంటుంది. కవితలో గొప్పతనం ఉంటే ఆ కవిత ప్రజల నాల్కలపై సదా నిలిచి ఉంటుంది. అలాగే ఇప్పుడు చెప్పిన పద్యం పండిత పామరులకందరికీ సుపరిచితమైన పద్యం. హృద్యమైన ఈ పద్యంలో అస్థిరమైన మానవ జీవితం గురించి విశదీకరించడం జరిగింది. ఇందులోని ఉపమానం అనుపమానం. నడక మనోహరం. సారాంశం వేదాంతం.
ఈ ప్రపంచం ఒక సత్రం. పూర్వ సంధ్య, అపరసంధ్య అనేవి రెండు వాకిళ్లు. వేలకొలది రాజులు ఈ సత్రంలో కొంతకాలం సుఖాలను పొంది ఇతరులకు అవకాశంయిస్తూ ఎక్కడికో వెళ్లిపోయారు అని ఇందులో భావం. ఈ భూమిమీద శాశ్వతంగా ఉండేవాళ్లు ఎవరూ లేరు. అందువలన వున్న కొద్దికాలం వివాదాలు లేకుండా స్నేహంగా జీవించాలి అన్నది ఈ పద్యం మనకిచ్చే హితోపదేశం.
జీవిత సత్యాన్ని ఇంత చక్కగా తెలియజేసే ఈ పద్యాన్ని రచించిన కవిని గురించి, ఈ పద్యం ఉండే కావ్యాన్ని గురించి తప్పక తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది.
ఈ పద్యాన్ని రచించిన కవికోకిల దువ్వూరి రామిరెడ్డిగారు. ఈ పద్యం ఉన్న కావ్యం పానశాల.
20వ శతాబ్దం చివరన వున్న మనం ఈ శతాబ్దంలోని మహాకవులను గురించి, వారి కావ్యాలను గురించి ఒక్కమారు సింహావలోకనం చేసికొనవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఎందరో మహాకవులు. అందరికీ వందనాలు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అని మహాకవి వేమన అన్నట్లుగా కవులలో కూడా మహాకవులు వేరయా అని చెప్పుకోవలసిన అవసరం ఉంది. అటువంటి మహాకవుల కోవకు చెందినవారే కవికోకిల దువ్వూరి రామిరెడ్డిగారు. నెల్లూరు జిల్లా గూడూరులో 1895లో జన్మించిన వీరిని పండితులు సింహపురి సిరిగా కొనియాడుతారు.
హేతువాద భావాలుగల వీరు మానవ ప్రయత్నంతో దేన్నైనా సాధించవచ్చనే గట్టి నమ్మకం ఉన్నట్టివారు. ఆ నమ్మకంతోనే కృషీవలుడుగా ఉండిన దువ్వూరి రామిరెడ్డిగారు సాహితీ కృషీవలుడుగా కూడా మారారు. 23సం.ల వయసు వచ్చేసరికి రసికజనానందము, స్వప్నాశే్లషము, అహల్యానురాగాలు, కృష్ణ రాయబారము అనే ప్రబంధాలలు నలజారమ్మ అనే కావ్యము, కర్షక విలాసం అనే నాటకం, మాతృశతకం అనే పుస్తకం వ్రాయగలిగారు.
స్వయంకృషితోనే అనేక భాషలలో పాండిత్యం సంపాదించారు. వీరి కవిత్వం పాత క్రొత్తలకు మేలికలయికగా అందాలు అలవరుకుంది.
శ్రమజీవియైన కర్షకుని జీవితం కూడా కవితావస్తువేనని వీరు నిరూపించారు. సి.ఆర్.రెడ్డిగారి అధ్యక్షతన జరిగిన ఒక సభలో 1917లో, అనగా వీరి 22వ ఏట, వీరికి స్వర్ణపతకం బహూకరించబడింది. 1918లో వీరు వ్రాసిన వనకుమారి కావ్యం విజయనగర మహారాజు ఆస్థానంలో కావ్యస్పర్థలో ప్రథమస్థానాన్ని పొందింది. వీరు కృషీవలుడు, జలదాంగన, యువకస్వప్నము, కడపటి వీడికోలు, సీతావనవాసం, కుంభరాణా మాధవ విజయం అనే నాటకాలు కూడా రచించారు.
రామిరెడ్డిగారు 1926లో పానశాల అనే అనువాద గ్రంథాన్ని ప్రారంభించారు. ఈ పానశాల కావ్యం 1928లో సాహిత్య మాసపత్రిక భారతిలో ప్రచురింపబడింది.
1929లో విజయవాడలోని ఆంధ్రమహాసభవారు వీరికి కవికోకిల బిరుదును ప్రదానం చేశారు.
ఉమర్‌ఖయ్యాం అనే మహాకవి పారశీక భాషలో రచించిన రుబాయతు అనే కావ్యం ఈ పానశాల కావ్యానికి మూలం.
గడచిపోయిన కాలం తిరిగిరాదు. రాబోయే కాలం అనేది ఉందో లేదో సందేహం. ఇప్పుడుండే ఈ వర్తమాన కాలంలోనే సుఖాలను అనుభవించాలి అని చెప్పే ఈ మతంలో విషాదానికి తావులేదు.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-కోట రాజశేఖర్