వినమరుగైన

రాజమన్నారు నాటికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలే యుద్ధం రోజులు. ఆపై ఆర్థిక మాంద్యం
ఎటు చూసినా అనిశ్చితి. ఎవరిని కదిపినా అభద్రత
లలిత కళలు పల్లవించే ప్రభవించే వాతావరణం, అవకాశం ఉంటుందా?
సంగీత సాహిత్య వాచికాభినయాల సమ్మిళితమైన రంగస్థల వైభవం మసకబారకుండా ఉంటుందా?
ఇదీ రాజమన్నారు నాటికలకు తెరతీసే నాటి తెర వెనుక కథ
1957లో దక్షిణ భాషా సమితి వారి ప్రసిద్ధ నాటికలు అన్న సంపుటిని సంకలనపరుస్తూ శ్రీ కూర్మా వేణుగోపాలస్వామిగారు ఆ సంక్షోభ నేపథ్యమే ఆధునికాంధ్ర నాటక ఆవిర్భావానికి అపూర్వమైన సాహిత్య సందర్భాన్ని ఎలా కలిగించిందో వివరించారు.
ఒకవైపు-
ఏప్రిల్ 6, 1942న జపాన్ వారు విశాఖపట్నంపై బాంబు దాడి చేయడంతో ఆంధ్ర విశ్వకళాపరిషత్ కళాశాలలు గుంటూరుకు తరలి వెళ్లాయి. అప్పటికే గుంటూరులో చదువుకుంటోన్న వేలాదిమంది విద్యార్థులకు వీరు తోడయి విద్యార్థి నాటక రంగం పరిపుష్టమైంది.
మరోవైపు-
యుద్ధ పరిస్థితుల కారణంగా విదేశీ ఫిల్ముల దిగుమతి ఆగిపోవడంతో వ్యయభారానికి లోనై చలన చిత్రాలలో వినోదగుణం క్షీణించింది. సినిమా రంగంలో రాణించని కళాకారుల చేతికి వ్యాపార నాటక రంగం చిక్కింది. యుద్ధ విరాళపు నాటికల పేరిట చవుకబారు హాస్యాలతో విలువలతో నిండిన నాటక ప్రదర్శనల వలన అవాంఛనీయమైన పరిస్థితిలోకి రంగస్థలం దిగజారింది.
ఈ నేపథ్యంలో ఏర్పడిన శూన్యాన్ని భర్తీచేయడానికి ఉబలాటపడిన ఔత్సాహితులతో కూడిన ప్రజా (అమెచ్యూర్) నాటక రంగం, విద్యార్థి (కాలేజియేట్) నాటక రంగం ఆధునిక సాంఘిక నాటికల ఆవిర్భావానికి ఒక అత్యవసర పరిస్థితిని కల్పించాయి.
1943లో సంస్కృతీ వారం, నాటకోత్సవం జరపటంతో గుంటూరు ఆధునిక తెలుగు నాటక పునరుద్ధరణకు రంగభూమి అయింది.
విద్యార్థి నాటకరంగం వ్యాపార నాటక రంగంతో ఏనాడూ పోటీపడలేదు.
వ్యాపార నాటక రంగంవారు వెచ్చించగల సమయమూ, వారికి ధీటుగా నిలబడగల సామర్థ్యమూ, అన్నిటికి మించి వారితో తలపడాలన్న కాంక్ష విద్యార్థి నాటక రంగానికి లేదు.
ఉత్సాహమే విద్యార్థుల ఊపిరి. దీక్షా దక్షతలే వారి పెట్టుబడి.
అయితే, ప్రజా నాటకరంగంతో పోల్చితే అన్ని విధాలుగా ఎక్కువ అవకాశాలు కలిగిన విద్యార్థి రంగస్థలమే ఆధునిక సాంఘిక నాటక రంగానికి వేదిక కాగలిగింది.
విద్యార్థి నాటక రంగం ఎదుర్కొన్న ప్రధాన సమస్య ప్రదర్శనయోగ్యత కలిగిన నాటకాలు లభ్యం కాకపోవడం. ప్రదర్శన నిడివి పరిమితం కావడం.
అప్పటి వ్యాపార నాటక రంగంలో పౌరాణికాలు చారిత్రకాలతో నిండిన పద్య నాటకాలను ఆరేడు గంటలకు పైగా ఏకధాటిగా ప్రదర్శించేవారు. ఇక 1920ల నాటి సాంఘికాల పేరుతో ప్రదర్శితమైనవి ‘అత్యంత జుగుప్సాకరం’గా ఉండేవని తెలియజేస్తారు గోపాలస్వామిగారు.
1943నాటికి రెండు మూడు గంటలపాటు ప్రేక్షకులను నిలువరించే మంచి నాటకాలు లేకపోవడం చేత చివరికి ఏకాంకికాలే విద్యార్థి రంగాన్ని ఆదుకున్నాయి.
ఇదీ రాజమన్నారు నాటికలకు రంగస్థలం.
1943-44ల నాటికి ఎంచుకోదగ్గ నాటికలు పరిమిత సంఖ్యలో ఉండగా- 1957లో దక్షిణ భాషా పుస్తక సంస్థవారు ప్రసిద్ధ నాటికలను సంకలనపరచాలని ప్రయత్నించినపుడు వస్తు సేకరణకు దాదాపు 2000 నాటికలు లభ్యమైనాయి.
వాటన్నింటినీ కూలంకషంగా నిర్మొహమాటంగా పరిశీలించి, పరీక్షించి, 1930లో మద్రాస్ మ్యూజియం థియేటర్‌లో శ్రీరాఘవ ఆధ్వర్యంలో ప్రదర్శించిన రాజమన్నారు తప్పెవరిది? నాటికను తెలుగు ఆధునిక నాటక చరిత్రలో మొదటి పరివర్తన సంధిగానూ-
1949లో ఏలూరు నాటక కళాపరిషత్తులో జరిగిన ఆత్రేయ యన్‌జిఓ నాటికను తరువాతి సంధిగానూ సంకలనర్తలు పరిగణించారు.
ఆ విధంగా ఆధునిక తెలుగు నాటకరంగానికి పరివర్తన సంధికర్త, ఆద్యుడు అయ్యాడు శ్రీ పాకాల వేంకట రాజమన్నారు.
అయితే అంతటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన రాజమన్నారు తప్పెవరిది? నాటిక కానీ, రాజమన్నారు ఉత్తమ రచనగా పేర్కొనే సర్దార్ పాపడు కానీ ప్రస్తుతం లభ్యం కావడంలేదు.
నమ్మాళ్వారుగారూ, అభ్యుదయ రచయితల సంఘంవారూ రాజమన్నారు నాటికలను ప్రచురించినట్లు తెలుస్తున్నా ఆ ప్రతులు దొరకలేదు. ఇక మనకు మిగిలిందల్లా దేశి కవితా మండలివారు ‘‘ఇప్పటికి నిండైన ప్రచురణ’’గా పేర్కొంటూ 1958లో ప్రచురించిన రాజమన్నారు నాటికలు.
అయితే ఈ సంకలనంలో ఆయా నాటికల రచనా కాలం కానీ, ప్రచురణ కాలం కానీ, ప్రదర్శన కాలం కానీ తెలియపరచలేదు. ఇక రచయిత వ్యక్తిగత వివరాలు తెలిసింది చాలా తక్కువ. ఈ విషయంలో దక్షిణ భాషా పుస్తక సంస్థవారి ప్రసిద్ధ నాటికలు సంకలనమే సాయపడింది.
పేరులో తమిళ పోకడ ఉన్నా తెలుగువాడైన రాజమన్నారు జననం 10 మే, 1901 అనీ, 1957 నాటికి మద్రాసు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ ఉన్నారనీ, వారి పరిణత రచన ఏమి మగవాళ్లు! 1947 ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో ప్రచురించబడినదనీ, 17 జనవరి, 1947న ఆంధ్ర ప్రజా నాటక్యమండలి, బెజవాడ వారు తొలి ప్రదర్శనం చేశారనీ తెలుస్తోంది. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-పి.చంద్రలత