వినమరుగైన

మా భూమి వాసిరెడ్డి - సుంకర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిషేధం తొలగించిన తర్వాత ఈ నాటకం మూడవ ముద్రణ సెప్టెంబరు 1957లో ప్రచురించబడింది. ఆ తరువాత 1962 ఆగస్టులో, 1972 మార్చిలో, 1980 సెప్టెంబరులో, 1996 జూన్‌లో పునర్ముద్రణలు పొందింది. ఈ నాటక ప్రదర్శన స్వర్ణోత్సవం 1996లో జరిగింది.
ఇంతగా ప్రేక్షకులను ఆకర్షించిన ఈ నాటకంలో వస్తువేమిటి? రచయితలే తమ మనవిలో ఇలా వివరించారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ప్రజా పోరాటాన్ని గురించి ఈ నాటకం వ్రాశాం. ఆ పోరాటంలో 240 గ్రామాలపై పోలీసులు దాడులు జరిగాయి. 8,500మంది అరెస్టు అయ్యారు. 15,390 మంది నైజాం ప్రభుత్వ హింసాకాండకు గురయ్యారు. 12 లక్షల 25 వేల రూపాయల విలువగల ప్రజల ఆస్తి లూటీ చేయబడింది. 52 మంది వీరుల ప్రాణాలను కోల్పోయారు. నైజాం కిరాతకుల చేతుల్లో 64గురు స్ర్తిలకు, మన తెలుగు సోదరీమణులకు మానభంగం జరిగింది. వీరిలో ఇద్దరు మరణించారు. ఈ మహోజ్జ్వల పోరాటమే మమ్మల్ని ఈ నాటకం రాయడానికి ప్రోత్సహించింది’’.
ఈ మహోజ్జ్వల ప్రజా పోరాటం ఎందుకు సాగింది? రాచరిక, భూస్వామ్య పరిపాలన కొనసాగిన నిజాం సంస్థానంలో భూస్వాములు వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకొని, చిన్న రైతుల భూములను నాగుల పేరుతో, వడ్డీల పేరుతో, దౌర్జన్యంతో కాజేసేవారు. బడుగు వర్గాల వారిని తమ బానిసలుగా పరిగణించి వెట్టిచాకిరీ చేయించుకునేవారు. లెవీల పేరుతో ప్రజల నుండి సాధ్యమైనంత ధనాన్నీ, ధాన్యాన్నీ పిండుకునేవారు. ప్రజల పట్ల రాక్షసంగా ప్రవర్తించేవారు. ఈ అత్యాచారాలకూ, దోపిడీకి వ్యతిరేకంగా సంఘం ఏర్పడింది. ఆంధ్ర మహాసభ ఏర్పడింది. అదే ‘దునే్నవానికే భూమి’ నినాదంతో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. టాల్‌స్టాయ్ ఇలా అన్నాడు- ‘‘అసలు సమస్య భూసమస్య. సామాన్య ప్రజలు కడుపునిండా తిండి తిందామంటే ప్రజానీకానికి చాలినంత తిండి వుండదు. దానికి కారణం వారికి కావాల్సినంత భూమి లేకపోవడమే. వారి దృష్టిలో భూసమస్య అతి ముఖ్యమైన సమస్య’’.
కనుకనే నాటకం చివర్లో దేశ్‌ముఖ్ వూరు వదలి పారిపోగా, ఎవరి పొలాలలో వారు ప్రవేశించి ‘‘మా బొందిలో వూపిరి ఉండగా మళ్లీ మా పొలాలు వదలిపెడతామా?’’ అనీ ‘‘మన గడ్డను కాపాడుకుందాం’’ అనీ, ‘‘నా ప్రాణం పోయినా సరే హక్కు మనదే. దునే్నవాడిదే భూమి హక్కు- ఇది మా భూమేనోయ్ ఇది మా భూమేనోయ్’’ అనే బృందగానంతో నాటకం వీరరసంలో ఉద్విగ్నభరితంగా ముగుస్తుంది.
నిషేధం కారణంగా సుంకర సత్యనారాయణగారు అజ్ఞాతంలోకి వెళ్లారు. వాసిరెడ్డి భాస్కరరావు గారిని అరెస్టు చేసి హింసించారు. వారు రాసిన పద్యకావ్యం, సాహిత్య విమర్శనా గ్రంథాల వ్రాతప్రతులను నామరూపాలు లేకుండా పోలీసులు నాశనం చేశారు. ఆయన్ను పోలీసులు పెట్టిన ఇబ్బందుల గురించి 1948 ఆగస్టులో విశాలాంధ్ర మాస పత్రికకు వీరులపాడు నుంచి రాసిన ఉత్తరం ఇలా ఉంది.
‘‘జూన్ 1న నన్ను అరెస్టు చేశారు. తీవ్రంగా లాఠీఛార్జి చేశారు. పద్దెనిమిది రోజులు జైల్లోపెట్టి, బెయిల్‌మీద విడుదల చేశారు. 144వ సెక్షన్‌ను ధిక్కరించామని మా మీద కేసు పెట్టారు. ప్రస్తుతం కేసు నడుస్తోంది’’. మాభూమి ఆరు రంగాలు గల నాటకం. దీనిలో పదిమంది పురుష పాత్రలు. ఇద్దరు స్ర్తి పాత్రలు, ఇద్దరు ముగ్గురు పోలీసు పాత్రలు వున్నాయి. మొత్తం 11 పాటలున్నాయి. ప్రదర్శనా కాలం రెండున్నర గంటలు. ఈ నాటక శిల్పాన్ని శ్రీనివాస చక్రవర్తిగారు ఇలా సమీక్షించారు. ‘‘దేశముఖుల దౌర్జన్యాన్ని సంఘటితంగా ఎదుర్కోవాలనే నిశ్చయమే నాటకానికి బీజం. రెండవ రంగంలో సంఘం వ్యాప్తిచెందడం, కథానాయకుడు వీరారెడ్డి ప్రభృతులు దేశముఖ్‌కు ఎదురుతిరిగి లెవీ ఇవ్వడానికి నిరాకరించడం ఇతివృత్తం. ఇందులోనే దేశముఖ్ సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం ఆరంభవౌతుంది. వీరారెడ్డికి పరిస్థితులన్నీ అనుకూలించి పేదల రక్తం పీల్చి దేశముఖ్ పిశాచి పాలన నశింపజేయగ బయలుదేరడం పరివ్యాప్తి. నాలుగో రంగంలో ఫలాగమం అనిశ్చయం కావడం, సందిగ్థస్థితి (క్రైసిస్) ప్రతి నాయకుడు దేశముఖ్ బలం పెరగడం, అయిదో రంగంలో మంగలి రాముడు వీరారెడ్డిని విడుదల చేసి తీసుకురావం- వీరారెడ్డి ఇంట హింసాకాండ జరుపుతున్న దేశముఖ్, అతని అనుచరులు ప్రజలు వచ్చేసరికి పారిపోవడం నియత ఫలప్రాప్తి- అంటే ఫలప్రాప్తి తప్పిందని రూఢియగుట. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కొత్తపల్లి రవిబాబు