వినమరుగైన

కొత్త గడ్డ - నార్ల వెంకటేశ్వరరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్లవారి నాటికలన్నీ ఒక సంపుటిగా ప్రచురించబడినాయి. కొత్తగడ్డ నార్లవారి పదహారు ఏకాంక నాటకాల సంపుటి. ద్వితీయ ముద్రణలో అది మార్పులకూ, చేర్పులకూ లోనయ్యింది. ప్రథమ ముద్రణలో వున్న జీవ జ్వాల అనే నాటికను తగ్గించి ఆశాపాశం అనే దానిని చేర్చినట్లు పేర్కొన్నారు. ఈ పదహారు ఏకాంకిలలో కొత్తగడ్డ ఒకటి. అదే సంపుటికి కూడా పేరుగా నిలిచింది. ఇందులో ప్లాట్లు అప్పటికి అన్నీ కొత్తవే. అన్నీ కొత్త గడ్డలే! ఎక్కువ భాగం రైతుబిడ్డలకు చెందినవే.
ఏకాంకికలు ఒక మాదిరి రచయితకైతే అంకెకు రావు. సాంప్రదాయపు పద్య నాటకాల తళుకు బెళుకుల్ని తట్టుకొని నిలబడాలంటే ఏకాంకికకు ఎంతటి చేవ కావాలి? భావనా పటిమ, సన్నివేశబలం, సంభాషణా చాతుర్యం, నాటకీయత ఒకదానితో ఒకటి పోటీపడితేగాని నాటి రక్తికట్టదు. ఇన్ని ఉన్నా శ్రోతగాని, పాఠకుడుగాని, ప్రేక్షకుడుగాని మడికట్టుకున్నవాడయితే ఇక ఆ నాటిక తాత వేసుకున్న తాంబూలమే- కేవలం ఉబుసుపోకకే ఉపకరిస్తుంది.
నాటికలు మారుతున్న సమాజాన్నో, విలువల్లో పట్టి చూపెడుతూ సందేశాత్మకంగా నిలదొక్కుకోగలగాలంటే రచయితకు అది కత్తిమీద సామే. కొత్తగడ్డ నాటికల సంపుటిలో నార్ల వారి పనితనం కన్పిస్తుంది. చిత్తశుద్ధి కన్పిస్తుంది. సునిశిత హాస్యం తొంగిచూస్తుంది. పాతది అంతా రోతగానూ ఎంచలేదు; కేవలం కొత్తదనానే్న కావాలన్నదీ లేదు. వస్తున్న మార్పుల్ని పట్టిచూపుతూ మంచిని ఎంచుకునే సత్తాని పాఠకుడికో, ప్రేక్షకుడికో అందించటమే ఈయన పని.
ఈయన దెబ్బకు ప్రారబ్దం గింగిరాలు తిరుగుతుంది. శకునపక్షి కుక్కిన పేనవుతుంది. ఇణటిగుట్ట బట్టబయలవుతుంది. దొరల వేషంలోని దొంగలు దొరికిపోతారు. ఈయన సరసనం మోసకారులకు భంగపాటు. భావకవికి ఊపిరి సలపని చక్కిలిగిలి. ఈయన చూచిన చూపుకి ఇంటిగుట్టు బట్టబయలవుతుంది. బడాయి రాజకీయాల బండారం బయటపడుతుంది. అనుమానాలు పటాపంచలవుతాయి. ఆశాపాశాలకు తావుండదు.
ఈయన నాటికల్లో హేతువు, హాస్యం జోడుగుర్రాల స్వారే! ఆలోచనలు ఆనాటి సామాజిక అవసరాలు. వాడుక భాషకు ఈయన వ్యాసాలే కాదు నాటికలూ బాగా పుష్టినిచ్చి చదివేవాళ్లకుగాని చూచేవాళ్లకుగాని ఎంతో సంతుష్టిని సమకూర్చాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. పల్లెపట్టులకు ఆటపట్టయిన ఆంధ్రదేశంలో పల్లెవాసులు వారి జీవితాన్ని రంగస్థలంమీద చూచుకోవటం ఎంత విచిత్రంగా కన్పించేదో.
నాటికలన్నిటినీ విపులంగా విశే్లషించటం ఇచ్చిన సమయంలో కుదిరే పని కాదు. అట్లని అన్ని నాటికల్నీ సంక్షిప్తంగానైనా పరామర్శించకుండా వుండటం మర్యాదయి పని కాదు.
పైపంట నాటిక రైతు బ్రతుకుకు ప్రతీక. పైపంట ప్రతియేడూ రైతును ఊరిస్తుందే కాని కమీషన్‌దారులకు మాత్రం అద్దంతరపు సిరినిస్తుంది. ‘‘మంట్లో మానెడూ ఇంట్లో పుట్టెడూ’’ ఒక్కోసారి మాటవరకే మిగులుతుంది. మంట్లో మానెడూ మొలకెత్తకుండానే పోతాయి. మొలకెత్తినా చీడపీడలు ఎవడికెంత గుర్రొచ్చినా మాటిచ్చి తప్పని రైతుకు మిగిలేది అప్పుల ఊబేగా! అప్పు పెట్టిన కాడినుంచీ అడ్డమైనవాడూ అమలు చేస్తాడు. పండించేవరకే పంట అతనిది. పంట చేతికి రాగానే గద్దలు తన్నుకుపోయినట్లు చేతిలో దానిన చేతిలోనుంచే తన్నుకుపోతారయ్యే. మామూళ్ల ముడుపులు తప్పని రైతుకిది మామూలే. ‘‘నలుగురికి పెట్టిందే మిగిలేది’’ అనేదే రైతు సిద్ధాంతం.
ఇక విషాదాంత నాటిక ప్రారబ్దంలోకి తొంగిచూస్తే క్షురకర్మకు కూడా శుభముహూర్తం ఒక పట్టాన కుదరని లక్ష్మయ్య కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఓపలేని ఇల్లాలు మాణిక్యమ్మ. ‘‘ఎవరి ప్రారబ్దాన్ని ఎవరు తప్పిస్తారు? అంతా బ్రహ్మ లిఖితం, ఎవరి గీతలో ఎలా వుంటే అలా జరుగుతుంది’’ అని అతడంటే ‘6ఈ మెట్ట వేదాంతమే నా కొంప తీస్తున్నది’’ అని ఆమె వాపోతుంది. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-రావెల సాంబశివరావు