వినమరుగైన

పానశాల -దువ్వూరి రామిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్యపానం తప్పకా వాళ్లు లోకంలో అంతకన్నా తప్పుడు పనులు చేస్తున్నారు. పైన వేషాలు, లోన మోసాలు కలవారున్నారు. మానవుల రక్తాన్ని త్రాగేవారికన్నా ద్రాక్ష రక్తాన్ని త్రాగే మేము ఎంతో మేలు కదా అంటూ
త్రావము జాహిదీలమని దంభము గొట్టెదవేల? అంతక
న్నా విపరీత కృత్యములొనర్తువు నిత్యము మాయవేషముల్
భావములోని కల్మషము బాపునె? మానవ సంఘరక్తమున్
ద్రావెదనీవు. ద్రాక్షఫల రక్తము మాకు రుచించునెప్పుడున్
అని వర్ణిస్తాడు.
ఇదే విషయాన్ని వేమనగారు
తలలు బోదులైన తలపులు బోడులా- అని వివరించి యున్నారు కదా.
పాపం చేశానని బాధపడవద్దు. నిన్ను తప్పనిసరిగా రేపు ఆ భగవంతుడు క్షమిస్తాడు. సంతోషంగా ఉండు అంటూ-
పాము జేసితంచు తలపం బనియేమి ఖయామ! దుఃఖసం
తాపము నిష్పలంబగు, వృధా వడపిల్లుట మాను మెవ్వరుం
బాపము సేయకున్న దన మన్నన యెందుకు, కల్మాషాత్ములున్
రేపు క్షమించు, పాపము హరించును దైవము సంతసింపుమా
అని ఓదార్చుతాడు.
కన్నీరు పెడితే కష్టం తొలగిపోదు. దేన్నైనా సంతోషంగా అనుభవించు అంటూ-
విషము నమృతంబు మసిబుడ్ల విధి కలంబు
ముంచి, లోకులనుదుట లిఖించు మొదట
కఱగ దరుబేద కన్నీటి కాల్వనదియు
పరమ భక్తుని అనుతాపవహ్నిచెడదు
కాన ఏది ప్రాప్తమైనను గారవించు
వలయు వలదని ఏర్పరుపంగ లేవు
అనుకున్నామని జరుగవు అన్నీ
అనుకోలేదని ఆగవు కొన్ని.. అంటాడు.
జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని అని మనసుకవి ఆత్రేయగారు కూడా ఇలాగే చెప్పియున్నారు కదా.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-కోట రాజశేఖర్