వినమరుగైన

ఎన్.జి.ఓ - ఆత్రేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక తెలుగు నాటక రంగం సంఘ సంస్కరణ వాదంతో ప్రారంభమైంది. కందుకూరి, గురజాడ మొదలైన గొప్ప రచయితలు నాటక రంగానికి ఆధునిక సామాజిక దృక్పథాన్ని కలిగించారు. ఒక వంక చారిత్రక, పురాణ కథా వస్తువులతో సంప్రదాయ పద్ధతిలో నాటక రచన జరుగుతున్నా మరోవైపు సామాజిక దురాచారాలు, జాతీయోద్యమ సంఘటనలు, దేశభక్తి మొదలైన ఇతివృత్తాలతో సాంఘిక నాటకరంగం ముందడుగువేసింది. 1940 నుండి 1955 వరకు తెలుగు సాంఘిక నాటకానికి ఉజ్వల దశ అని చెప్పవచ్చు. ఈ కాలంలో నాటక, నాటిక పోటీలు బాగా వ్యాప్తిపొందటంతో ఎందరో యువరచయితలు ప్రచారంలోకి వచ్చారు.
సుంకర, వాసిరెడ్డి, అనిసెట్టి సుబ్బారావు, పినిశెట్టి శ్రీరామమూర్తి, బెల్లంకొండ రామదాసు, బోయిన భీమన్న, గరికపాటి రాజారావు, భమిడిపాటి కామేశ్వరరావు, పి.వి.రాజమన్నారు, డి.వి.నరసరాజు, కొడాలి గోపాలరావు, కొర్రపాటి గంగాధరరావు మొదలైన ఎందరో రచయితలు తమ నాటక రచనలతో ఆంధ్ర నాటక రంగాన్ని తేజోవంతంగా వికసింపజేశారు.
ఆ కాలంలోనే ఆచార్య ఆత్రేయ వైవిధ్యమైన రచనలతో తెలుగు నాటకాన్ని మరో మలుపు తిప్పి, ట్రెండ్ సెట్టర్‌గా ప్రశంస పొందారు. పరివర్తన, ఎన్‌జిఓ, ఈనాడు, విశ్వశాంతి, కప్పలు, భయం, అంత్యార్పణ మొదలగు నాటకాలు, ప్రగతి, ఎవరు దొంగ?, ఓటు నీకే మొదలగు విలక్షణమైన నాటికలు రచించారు.
సంప్రదాయాల ముసుగులో బతికే మధ్యతరగతి మందభాగ్య జీవితాన్ని ఎన్‌జీఓ నాటకంలో ఆత్రేయ శక్తిమంతంగా చిత్రించారు. 1948లో రాయబడిన ఈ నాటకం అనేక ప్రదర్శనలతో బహుళ ప్రచారం పొంది, ఆధునిక నాటక రంగ చరిత్రలో ఆత్రేయకు సముచిత స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఎన్‌జిఓ నాటకం రెండు రంగాలుగా విభజించబడింది. కథ ప్రధానంగా రంగనాథమనే ఒక ప్రభుత్వ గుమాస్తా చుట్టూ తిరుగుతుంది.
రంగనాధం వుంటున్నది ఇల్లుగా మార్చబడి అద్దెకివ్వబడిన ఒక మోటారు షెడ్‌లో, ముప్ఫై రూపాయలు అద్దె తక్కువేం కాదు. జానెడు కొంప. ఇంటిముందు మురుగు కాలువ. నాలుగ్గోడలే ఇల్లంతా. ఈ నాలుగ్గోడలమధ్య ప్రదేశానే్న కిచెన్ అనుకోవాలి. రీడింగ్‌రూం అనుకోవాలి. తలదాచుకునే నీడ తప్పితే సౌకర్యాలు శూన్యం.
చాలీ చాలని ఆ ఇంట్లోనే రంగనాధం భార్య సీత ఇద్దరు పసిపిల్లలు, తమ్ముడు గోపి, రోగిష్ఠి ముసలి తండ్రి కాపురం ఉంటున్నారు.
ముసలాయన గుమాస్తాగిరి చేసి రిటైరయినాడు. పెళ్లాం మెడలో చివరి నగ దాకా అమ్మి పెద్ద కొడుకును చదివించినా, తనలాగా గుమాస్తా అయి చచ్చీ చెడి యాభై రూపాయలు తెచ్చుకునే గతే కొడుక్కీ పట్టిందని కుమిలిపోతుంటాడు.
రంగనాధం సంపాదనే ఆ సంసారానికి ఆధారం. యాభై రూపాయలు జీతం. అందులో ముప్ఫై రూపాయలు ఇంటద్దె. మిగిలేది ఇరవై రూపాయలు. ఆ ఇరవైలోనే కుటుంబ అవసరాలు, అనారోగ్యాలు, తమ్ముడి చదువు.. ఇలా అన్నీ సమర్థించుకురావాలి.
రెండు నెలలు ఇంటద్దె బకాయి, పాల మనిషికి రేపు మాపంటూ నెలలు గడిపేస్తున్నారు. గోపి జీతం కడితేగాని కాలేజీకి వెళ్లలేని పరిస్థితి. రోగాలకు మందులుకొనే దిక్కు లేదు. ఇదీ ఆ సంసారం దుస్థితి.
ముసలాయన పెన్షన్ అమ్మి పెద్దపిల్ల పెళ్లి చేశాడు. చిన్నకూతురి మెళ్లో ఆ మూడు ముళ్లూ పడితే, తనింక చచ్చినా ఫర్వాలేదని వాపోతుంటాడు. ముసలాయన చిన్ననాటి స్నేహితుడు రామశాస్ర్తీ ఆ పిల్లను తన కొడుక్కి చేసుకోవటానికి ముందుకొస్తాడు. చిక్కంతా పిల్లవాడిపై చదువు గురించే. ఆ చదువుకోసం పదివేలు ఇమ్మని అడుగుతారు.
రంగనాథం తనవల్ల కాదంటాడు. గోపీ పది దమ్మిడీలైనా కట్నంగా ఇవ్వలేమంటాడు. చిన్ననాటి స్నేహం వృధా పోనివ్వకండంటూ రామశాస్ర్తీని వేడుకుంటాడు ముసలాయన.
లైసెన్సులు ఇవ్వడం ద్వారా లంచాలు తీసి అక్రమంగా సంపాదించే మార్గం రంగనాధానికి చెప్పబోతాడు రామశాస్ర్తీ. తనంత నీచానికి దిగజారలేనంటాడు రంగనాథం. ఆ సంబంధం అక్కర్లేదని అన్నదమ్ములిద్దరూ రామశాస్ర్తీని సాగనంపుతారు.
రాత్రి ఎనిమిది గంటలకు కలెక్టర్ రంగనాథం కోసం ఆఫీసు జవానుతో కబురు పెడతాడు.
దయాల్‌సేట్ హోల్‌సేల్ వ్యాపారం లైసెన్సు కోరుతున్నాడనీ, మంచీ చెడ్డా తెలిసినవాడు గనుక ప్రతిఫలం ముట్టజెప్తాడనీ చెప్పబోతాడు. పిల్లాజల్లా గలాళ్లు ఇలా మడికట్టుకు కూర్చుంటే లాభం లేదంటాడు జవాను.
రంగనాథంలో సంఘర్షణ మొదలైంది. ‘చావాల్నా బ్రతకాల్నా’ అన్నదే సమస్య. లంచం తీసుకోవటం పాపం. చావటం అంతకన్నా పాపం. అసలే ఇల్లుఇరుకై చస్తుంటే వసారా ఖాళీ చేయించి వేరే వాళ్లకు అద్దెకు ఇవ్వటానికి తయారవుతాడు ఇంటి యజమాని గుప్త. తన నౌకరు శర్మ ద్వారా కబురు పెడతాడు. ఇల్లొకరికి, వసరా వేరొకరికీ ఎలా అద్దెకిస్తారంటూ గోపీ అడ్డం తిరుగుతాడు.
రంగనాథం ఇంటిల్లిపాదికి కొత్త బట్టలు తెస్తాడు. ‘అప్పుచేసి పప్పు భోజనం లాంటిది కాదు కదా’ అంటూ అడుగుతాడు గోపి. అది లంచమనీ, నీతిని అమ్మి తెచ్చిన భోజనమనీ కృంగిపోతాడు రంగనాథం. ఇంట్లో వాళ్లందరి అక్కరలు తీర్చటానికి, సంతోషంగా వుంచటానికి తనంతకన్నా చెయ్యగలిగింది లేదని అంటాడు రంగనాథం. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-వల్లూరి శివప్రసాద్