వినమరుగైన

విషాద సారంగధర - ధర్మవరం కృష్ణమాచార్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కావ్యేషు నాటకం రమ్యమ్! నాటకేషు శకుంతలా!’’ అన్నట్లు శ్రవ్య కావ్యం కంటే దృశ్య కావ్యం రమ్యమైందనీ, నాటకాలన్నింటిలోకి కవికుల గురువు కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ శ్రేష్ఠమైందనీ పెద్దల సుద్దులు. అదేరీతిగా ఆధునిక యుగంలో వెలసి, ప్రఖ్యాతి గడిచిన ధర్మవరం రామకృష్ణమాచార్యులవారివి ముప్ఫై నాటకాలున్నా, వాటన్నింటిలోను వారి విషాద సారంగధర నాటకం పరమశ్రేష్ఠమైందనీ మనకు స్పష్టమవుతుంది.
1853లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు అనంతపురం జిల్లా ధర్మవరంలో జన్మించారు. తండ్రి బళ్లారి ‘వార్‌డ్లా’ కాలేజీలో తెలుగు పండితులుగా పనిచేవారు. రామకృష్ణమాచార్యులు సంస్కృతాంధ్ర కర్ణాట భాషాభ్యాసం తండ్రి వద్దనే చేశారు. ఎఫ్.ఏ వరకు ఆంగ్లంలో వార్‌డ్లా కాలేజీలో విద్యనభ్యసించారు. బాల్యంనుంచే అష్టావధాన, శతావధానాలు చేసిన మేటి. ప్రథమ శ్రేణి న్యాయవాద పరీక్షలో ఉత్తీర్ణులై ప్రభుత్వ న్యాయవాదిగా కీర్తి గడించారు. నాటకకర్తగా, నటుడుగా, ప్రయోక్తగా, సరస వినోదినీ సభాధ్యక్షులుగా ప్రసిద్ధి పొందారు.
ఆధునిక యుగంలో మాత్రమే తెలుగు నాటకాలు రచింపబడి, ప్రదర్శింపబడుతూ వచ్చాయి. ఆంగ్ల పార్శీ నాటక రంగాలవల్ల, ధార్వాడ, పార్శీ సంచార నాటక కంపెనీలవల్ల తెలుగులోను నాటకాలు ప్రారంభమయ్యాయి. ధర్మవరం వారి మొట్టమొదటి నాటకం చిత్రనళీయమే అయినా వారికి ప్రసిద్ధి తెచ్చి పెట్టిన నాటకం విషాద సారంగధర నాటకమే. ఆ రాతకు ముందే వారు కన్నడంలో స్వప్నావిరుద్ధమనే ఉషాపరిణయ నాటకం రచించి ప్రదర్శించారు. ఆ వెనుక సుమారు ముప్ఫై నాటకాలు రచించి ఆంధ్ర నాటక పితామహ బిరుదంతో ప్రసిద్ధికెక్కారు. వారి నాటకాల్లో చిత్రనళీయం, విషాద సారంగధర, పాదుకా పట్ట్భాషేకం మొదలైన నాటకాలు రంగస్థలంపై విజయాన్ని సాధించి ప్రేక్షకుల మన్ననలకు పాత్రమయ్యాయి. 1860లోనే మంజరీ మదుకరీయంతో తెలుగు నాటక రచన, 1880లో కందుకూరి వారి నాటక ప్రదర్శన ప్రారంభమైనా ధర్మవరం వారి గద్య పద్య గేయాత్మకమైన స్వతంత్ర నాటకాల రచనా ప్రదర్శనలతో విశిష్ట కీర్తి గడించారు. వీరికి ఆంధ్ర నాటక పితామహ బిరుదు సార్థకమైంది.
ధర్మవరంవారు బళ్లారిలోని ‘సరస వినోదినీ సభ’ నాటక సమాజానికి అధ్యక్షులు. వారి విషాద సారంగధరకు ప్రత్యేక స్థానముంది. కారణం అది మొట్టమొదటి విషాదాంత నాటకం కావడమే! ఇందులోని ఇతివృత్త నిర్వహణ, సజీవ పాత్ర చిత్రణ, సందర్భోచిత సన్నివేశ కల్పన, సముచిత సంభాషణ, పద్యరచనా పాటవం, ప్రాచ్య పాశ్చాత్య నాటక లక్షణ సమన్వయం, విషాదాంతత మొదలైన లక్షణాలు విషాద సారంగధర నాటకాన్ని విశిష్టమైనదిగా చేశాయి. అలాగే వారి విషాద సారంగధర నాటకం ధర్మవరం వారి విశేష కీర్తి ప్రతిష్ఠలకు కారణభూతమైంది. ఈ పై గుణాలవల్లనే ధర్మవరం వారు ఆంధ్ర నాటక పితామహ బిరుదు ప్రసిద్ధులయ్యారు.
ఇతివృత్త నిర్వహణ నాటక విశిష్టతకు కారణమవుతుంది. విషాద సారంగధర నాటకంలోని ఇతివృత్తాన్ని ధర్మవరం వారు నిర్వహించిన తీరు అమోఘం. పైగా విషాదాంతం చేయడంలో ధర్మవరం వారి నాటకీయ చతురత గోచరిస్తుంది. రాజరాజ నరేంద్రునకు సారంగధరుడన్న పుత్రుడు, రత్నాంగీ, చిత్రాంగులనే భార్యలు ఉన్నారన్న విషయం కల్పితం. పైగా ఈ కథ ఆంధ్ర దేశానికి సంబంధించినది కాదు. ఎక్కడో జరిగిన విషయాన్ని మన పూర్వకవులు కల్పించారు. గౌరవ నవనాధ చరిత్రలో ఈ కథ ఉంది. ఆ వెనుక బాగా ప్రచారంలోకి తెచ్చిన కవి చేమకూర వేంకటకవి. తన సారంగధర చరిత్ర పద్యకావం ద్వారా ఆ వెనుక కూచిమంచి తిమ్మకవి సారంగధర చరిత్ర చాలావరకు మూలం కావచ్చు. ఇలాంటి కథలు మరాఠీ, కన్నడ భాషల్లో ఉన్నాయి. గ్రీకు మొదలైన వాటిలోను ఇలాంటి కథలున్నాయి.
ధర్మవరం వారి నాటకం విషాద సారంగధర ఐదంకాల నాటకం. ఈ నాటకం పూర్వరంగంతో ప్రారంభమవుతుంది. సారంగధరునికి వివాహం చేయడానికి ఆరాండ్రైన కన్యల చిత్ర పటాలను కొనిరావడానికి వెళ్లిన విభావసుడనే బ్రాహ్మణుడు చిత్రాంగి తాను సారంగధరుని తప్ప వివాహమాడనని ఆ విషయం సారంగధరునికి తెలుపవలసిందనీ కోరిన అంశం మరవడంవల్ల కథలోని విషాదానికి అవకాశం కలిగింది. చంద్రకళాదేవిని సారంగధరుడు, చిత్రాంగిని రాజరాజు వివాహమాడతారు. ఈ విషయం చిత్రాంగికి వివాహానంతరం గాని తెలియదు. సారంగధరునిపై ప్రేమ వ్యామోహాలు గల చిత్రాంగి, రాజు వేటకు వెళ్లగా ఆ సమయంలో పావురాలాటలో పావురం చిత్రాంగి మేడపై వాలినదని తెలిసి సారంగధరుడు వెళ్లగా, చిత్రాంగి అతనితో తన ప్రేమ వ్యక్తీకరిస్తుంది. పినతల్లి అని సారంగధరుడు వారిస్తాడు. చిత్రాంగి బలాత్కరించి భంగపడుతుంది. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-ఆచార్య ఎస్.గంగప్ప