వినమరుగైన

విషాద సారంగధర - ధర్మవరం కృష్ణమాచార్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారంగధరుడు వెళ్లిపోతాడు. ఆ వెనుక రాజు రాగా సారంగధరుడు తనను బలాత్కరించాడని నింద మోపుతుంది. సారంగధరుని బంధించి న్యాయ విచారణ చేయించి, సారంగధరుడు తానుగానీ, తన పక్షాన వాదించే సాక్షిగాని లేకపోవడంవల్ల అతనికి కరపాద ఖండన శిక్ష విధిస్తాడు రాజు. ఆ వెనుక రాజరాజు తెలుసుకొంటాడు తప్పంతా చిత్రాంగిదేనని. రాజు వెంటనే శిక్షనాపమని లేఖ పంపినా అప్పటికే కరపాద ఖండన జరిగిపోయుంటుంది. చిత్రాంగి తాను చేసిన పాపానికి ప్రాయశ్చితంగా మరణిస్తుంది. మూలంలో తెగిన చేతులు కాళ్లు వచ్చేలా చేస్తాడు ఒకానొక సిద్ధుడు. కానీ కరపాదచ్ఛేదనతో ధర్మవరంవారు ముగించి విషాదాంతం చేశారీ సారంగధర నాటకాన్ని. అందుకే ఇది విషాద సారంగధర. ఇలాంటిదే నేను సేకరించిన జానపద గేయం సారంగధర చరిత్ర ఉంది. అది కూడా తమాషాగా కరపాదచ్ఛేదనంతోనే ముగుస్తుంది. ఇందు మోసం, వలపు, కథ, శిక్ష, కన్నతల్లి, కడుపుకోత మొదలైన భావాలతో నిబిడమై కరుణరస నిర్థారమై ఒప్పుతుంది.
సజీవ పాత్ర చిత్రణ ఈ చక్కటి ఇతివృత్త నిర్వహణ దక్షత విషాద సాంరగధరకు వనె్నతెచ్చాయి. అలాంటి పాత్ర చిత్రణ చణత్వం ధర్మవరం వారిలో వలసినంత ఉంది. ఈ నాటకంలో మూడు ముఖ్యమైన పాత్రలు రాజరాజనరేంద్రుడు, చిత్రాంగి, సారంగధరుడు, తరువాత సుబుద్ధి, రత్నాంగి, తక్కిన పాత్రలంత ప్రాముఖ్యంకావు. రాజరాజ నరేంద్రుడు కోడలు కావలసిన చిత్రాంగి సౌందర్యాన్ని చిత్రపటంలో చూచి మురిసిపోయి వయసు మీరిన తానే చిత్రాంగిని పెళ్లిచేసుకొంటాడు. కాని చిత్రాంగి క్రోధానికి కారణమై నిరపరాధి పుత్రుడు సారంగధరుని పోగొట్టుకుంటాడు. వాస్తవానికి రాజ్యాభిషేకం చేయతలపెట్టినా, చిత్రాంగిపై అధికమైన మక్కువ మూలాన ఆవిడ మోపిన అభియోగంతో కరపాదచ్ఛేదన శిక్ష విధిస్తాడు. ఇది అతని దోషం. చివరికి ఘోర దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చింది. చిత్రాంగి పాత్ర చిత్రణ ఈ విషాదాంతంకు చాలా ఉపకరిస్తుంది. బ్రాహ్మణుడు తన ప్రేమను కోరిన రీతిగా సారంగధరునికి తెలుపకపోవడం, ఆ వెనుక ఈ విషయాన్ని తెలియని రాజు కోడలు కావలసిన చిత్రాంగిని తాను వయసుమీరినా భార్యగా చేసుకోవడం- అనేవి చిత్రాంగికి జరిగిన రెండు మోసాలు.

-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-ఆచార్య ఎస్.గంగప్ప