వినమరుగైన

కీర్తిశేషులు - భమిడిపాటి రాధాకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాకవి వాణీనాధం రచించిన అమూల్య గ్రంథాన్ని పబ్లిషర్ శఠగోపం సర్వహక్కులతో కొన్న అగ్రిమెంట్‌మీద మురారిని సాక్షి సంతకం చేయమని కోరినపుడు మురారి తన బొటనవేలుని పెద్ద చాకుతో కోసుకుని రక్తంతో వేలుముద్రవేసి, ఆవేశంతో, ఆవేదనగా యిలా అంటాడు. అయిదు సంవత్సరాలు ఒకే దీక్షతో అంతులేని అపేక్షతో నా భాష, నా ప్రజలు అని ప్రాకులాడి, రక్తమాంసాలు ధారపోసి మార్గదర్శకంగా, శాశ్వతంగా నిలిచిపోయే గ్రంథాన్ని రాస్తే ఆ గ్రంథాన్ని సమూలంగా యాభై రూపాయలకి కొన్న అగ్రిమెంట్ మీద సంతకాలు చెయ్యడానికి ఉపయోగించాల్సింది సిరాలు కాదు, రక్తం.
అలాగై క్లైమాక్సు సీనులో ‘‘మేమంటే, ఎవరనుకున్నావ్! కళలు, కవిత్వలు కావాలంటూ అఘోరించే అవివేకులం కాదురా! మేం చెప్పుకుని సంతోషించటానికి ఇదివరకున్న కవులూ, కళాకారులూ చాలు మాకు- నన్నయ్య మావాడు, తిక్కన మావాడు, త్యాగరాజు మావాడు- ఇక మేం దద్దమ్మలమయితే మాత్రం ఏం! మేం అల్ప సంతోషులం.. ఇక మీతో మాకు పనేముంది! కావలిస్తే తెలుగు చరిత్ర తిరగేయి! ఎంతోమంది గొప్ప గొప్ప కవులు, కళాకారులు, బతికున్నన్నాళ్లూ మా చలవకొద్దీ దరిద్రంలో శిఖరాగ్రాన్ని అందుకుని మరీ చచ్చిపోయారు. అందులో కొందరి శవాలు ఇళ్లముందు నిలబడిపోతే, పనిలేనివాళ్ల చేత ముష్టెత్తించి, ఎలాగనూ చచ్చిపోయారు గదాని చందాలిచ్చాం.. మీ కవిత్వం, కళా చూసి ఓహో అంటాంగాని బతికుండగా, కాళ్లట్టుకున్నా కానీ ఇవ్వం.. అదీ మా పవిత్ర సిద్ధాంతం.’’
అలాగే మరోచోట వాణీనాధం, మురారిని ఎంతో ప్రబలమైన కారణం వుంటే గాని ఎవ్వరూ తాగుడికి లొంగరు. అసలు నువ్వెందుకు తాగటం మొదలెట్టావ్ అన్నయ్యా అని బాధతో అడిగినప్పుడు ‘‘అవిగో వినరా ఆ చప్పట్లు.. ఆ ధ్వని తరంగాలే కదురా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష్య పరమాన్నాలు. ఆ ఉత్సాహ ప్రకటనే కదురా, కళాకారుణ్ణి వెర్రెత్తించేసే ఏకైక సంఘటన’’.. వాటి ముందు ఎలాగురా కరిగిపోకుండా వుండడం. నేను ఎంఏ చదువుతూ నాటకమాడినపుడు ఇవేరా నన్ను ఆకాశానికి ఎత్తేశాయి. ఆంధ్ర నాటక రంగంలో నూతన తార వెలిసింది అన్నారు. అడ్డూ, అదుపూ లేకుండా నాటక రంగంలో లీనమయ్యాను. అహోరాత్రాలు మైమరిచి కళాసేవ చేశాను. బిరుదులిచ్చారు. సన్మానాలు కూడా చేశారు. ఎంఏ పోయింది. వొళ్లు పొగరన్నారు. చదువు తగలేసుకున్న చవటనన్నారు నాటకమాడితే పనిలేనివాడన్నారు. ఏం ఖర్చు చేస్తున్నవని అడక్కుండా డబ్బిచ్చే నాన్న చచ్చిపోయాడు. డబ్బు లేక రోడ్డుమీద నిలబడ్డాను. నాటకాపేక్ష మాత్రం పోలేదు. చివరికి మొహానికి రంగు కొనుక్కోడానికి చెయ్యి జాపితే తమ్ముడూ.. చప్పట్లు కొట్టిన చేతుల్లోంచి రాగి కానీ కూడా రాల్లేదురా! గారడీరా ఆ చప్పట్లు.. ఎండమావుల్లా ఆ నిండు నవ్వులు.. నువ్వైనా భ్రమపడి, దగ్గరకెళ్లకు, వెడితే మాడిపోతావ్, మసి అయిపోతావ్‌రా నాలాగే, జాగ్రత్త’ అని హెచ్చరిస్తాడు మురారి.
ఇక వాణీనాధం పాత్ర చూస్తే ప్రజలు వేలెట్టి కన్ను పొడుస్తున్నా, వెన్న పెడ్తున్నారనుకుని భావించి, తన భాషా సేవని గుర్తించిన విశిష్ట కళా పోషకులని, దయా సముద్రులని గుడ్డిగా నమ్మిన ఆధునిక మహాకవి. లౌకిక జ్ఞానోదయం కాని వెలలేని మణిపూస. పెద్దగా సన్మానం చేసి, ఖద్దరు శాలువా, పూలదండ సమర్పిస్తే నిండుగా ఆనందించే అల్ప సంతోషి. ఇంటి యజమాని, సన్మానాల వ్యాపారవేత్త గంప శంకరయ్య. ఖంగు ఖంగుమనే ఘనమైన సన్మానం, వూళ్లో తిరిగి చందాలు వసూలు చేసి చేస్తానంటే కవిగారు వద్దంటాడు. కోరి వస్తున్న సిరికి మోకాలడ్డడం మూర్ఖత్వం అని శంకరయ్య అంటే- మానవుడి జీవితానికి పరమావధి సిరిసంపదలు కాదు శంకరయ్యా! మానుషత్వం, నీచము, తుచ్ఛము అయిన మార్గాలలో, సిరిసంపదల కోసం పాకులాడ్డం అధమత్వం, అవసరమైతే చిరిగిన బట్టలే కప్పుకుని, చెదిరిన మెతుకులే ఏరుకు తింటాను.. అవీ దొరక్కపోతే ఏ రోడ్డుపక్కనో పడి, చచ్చి, కుళ్లి మట్టిలో కలుస్తాను గాని జల్తారు బతుకు కోసం నా కవితామతల్లిని, ఏ క్షుద్రుడి చేతుల్లోనో పెట్టి చిత్ర వధ చేయించను అంటాడు వాణీనాధం. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కీశే పుచ్ఛా భార్గవ రామోజీ