వినమరుగైన

కీర్తిశేషులు - భమిడిపాటి రాధాకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతర ముఖ్యపాత్రలకొస్తే జానకి- కవిగారికి తగ్గ యిల్లాలు. జానకి తండ్రి జగన్నాధం ఆచితూచి అడుగేస్తూ, సంసారశకటాన్ని గాడి తప్పకుండా నెట్టుకుంటూ సమాజాన్ని సమూలంగా అర్థం చేసుకున్న మధ్యతరగతి మేధావి. అందుకే అంటాడు మన దేశంలో కళలకీ, కవిత్వానికీ మాట విలువ తప్పించి, డబ్బు విలువ లేదు. కాని ప్రపంచంలో జీవితాలు మాటలతో గడవ్వు, డబ్బుతోనే గడుస్తాయి. ఇంకా ఎందుకయ్యా కవిత్వ పరిశోధన. కంచి గరుడసేవ- సుబ్బరంగా ఏదైనా ఉద్యోగం యిప్పిస్తా, హాయిగా చేసుకో. అందరం కృతార్థులం అవుతాం అని అల్లుడికి సలహా ఇస్తూ.
డాక్టరు గంగాజలం- పేషెంటు వుక్కు పిండంలాగున్నా, రిపోర్టులను బట్టి, గ్యారంటీగా నాలుగైదు రోజుల్లో చచ్చిపోతాడని తేల్చేసి చెప్పిన విదేశాల్లో చదువుకొచ్చిన ఖరీదైన డాక్టరు. మిగతావి వెధవాయిత్వం మూర్త్భీవించిన పాత్రలు.. కవిగారు నాలుగైదు రోజుల్లో చనిపోవడం ఖాయమని డాక్టరు తేల్చేసరికి- ఇంటి అద్దె చెల్లించకపోతే మర్యాద దక్కదని బెదిరించిన శంకరయ్య, సరస్వతీ నిలయమైన తన గృహాన్ని కవిగారికి రాసిచ్చేస్తానంటాడు. అలాగే, కవిగారి గ్రంథాల్ని కారుచౌకగా కొనేసిన శఠగోపం, కవిగారి గ్రంథాల్ని ప్రపంచ భాషల్లోకి తర్జుమా చేయించి ప్రచారం చేస్తానని ప్రగల్భాలాడుతాడు చైర్మన్ జనతారావు విరాళాలు పోగుచేసి, కవిగారికి లక్ష రూపాయలు చదివిస్తానంటాడు. చైర్మన్‌గారి మాటకి డిటో చెప్పి వత్తాసు పలికి, తోకల్లాగా వేలాడే కౌన్సిలర్ హనుమంతరావు పరంధామయ్య మాష్టారు- కవిగారి పేరున వసూలు చేసిన డబ్బుతో వ్యాపారం చేద్దామనే, గడ్డి రుచి బాగా తెలిసిన వాణిజ్యవేత్త గురవయ్య- మాట, పెదవి దాటకుండానే వూరంతా మైకు సహాయం లేకుండా టాం టాం చేయగల ప్రచారకర్త భైరవమూర్తి- డబ్బుతోపాటు ఆవేశమేగానీ ఆలోచనలేని జమీందారు- తరతరాలు నిలిచే శిలావిగ్రహం చేయగల మహాశిల్పి గోపాలం. ఈ పాత్రల నడుమ నాటకాన్ని కడు రమ్యంగా నడిపారు రాధాకృష్ణగారు.
నాటకంలోని కథ నాలుగు ముక్కల్లో చెప్పాలంటే, వాణీనాధం వ్రాసిన గ్రంథాన్ని శఠగోపం చౌకగా కొనేస్తాడు. గ్రంథంతో వీడిన ఋణానుబంధం తట్టుకోలేక, కళ్ళు తిరిగిపడి, తీవ్రమైన జ్వరంతో కవి బాధపడ్తాడు. విదేశాల్లో చదువుకొచ్చిన డాక్టర్ని పిలిపించి, మురారి తనకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు, ఎక్స్‌రే కవివని అబద్ధాలు చెప్పి చూపిస్తాడు. అవి పరీక్షించి కవి నాలుగు రోజుల్లో పోవడం ఖాయమని తేల్చేస్తాడు. ఈ విషయం వూరంతా ప్రచారమయి ప్రముఖులంతా చేరి కవి పేర ఏదైనా చేయాలని తర్జన భర్జన పడి చివరికి శిలా విగ్రహం కట్టించాలనీ, ఆవిష్కరణ ఓ మంత్రిగారి చేత చేయించాలనీ నిర్ణయించి, కవి ఆల్‌రెడీ చనిపోయినట్లు, ఆవిష్కరణ తేదీ ఖాయం చేసి మంత్రిగారికి టెలిగ్రాం కూడా ఇస్తారు. ఈ నేపథ్యంలో కవి ఆరోగ్యం మెరుగయి కోలుకోవడంతో పురప్రముఖుల గుండెల్లో బేజారెత్తి తమ పరువులు బజారుకెక్కుతాయని భయపడి, కవిని చంపి, శిలా విగ్రహం ఓపెన్ చేయిద్దామనుకుంటారు. చంపటానికి వెళ్లిన వెర్రిజనాన్ని మురారి అడ్డుకుని, డాక్టరుకి అబద్ధాలు చెప్పి కాగితాలు చూపెట్టింది తనేనంటూ, దేశంలో నెలకొన్న కవులు, కళాకారుల దీనావస్థని వ్యంగ్యంగా వేలెత్తి చూపిస్తాడు. అది విని, ఇదంతా మురారి పన్నాగం, కవి నిర్దోషి, కనుక శిలావిగ్రహం పక్కన కవిగార్ని కూడా కూచోపెట్టి సన్మానం చేద్దామని జనాలు నిర్ణయించి, మురారిని తీవ్రంగా గాయపరిచి, కవికి జేజేలు చెప్తారు. మురారి నెత్తురు కక్కుకుంటూ, గాయాలు నిండిన శరీరంతో పడిపోతాడు. ‘అన్నయ్యా’, ‘అన్నయ్యా’ అంటూ వాణీనాధం అతని మీదపడి ఏడుస్తాడు.
ఈ నాటకం ప్రభావం వలన, కొద్దిమంది పబ్లిషర్సు మనసులు గుచ్చుకున్నా కవులు, కళాకారుల ఆర్థిక జీవితాల్లో విప్లవాత్మక మార్పుకు నాంది పలికిన మాట వాస్తవమని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతేకాకుండా, ఈ నాటకం వెలువడ్డ తరువాత కొంతకాలంపాటు కవినో, నటుణ్ణో లేక ఏదో ఒక కళాకారుడి జీవితాన్నో ఇతివృత్తంగా తీసుకుని, వరుసగా నాటికలో, నాటకాలలో వచ్చినాయన్న మాట సత్యదూరం కాదు. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కీశే పుచ్ఛా భార్గవ రామోజీ