వినమరుగైన

వైతాళికులు -ముద్దుకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్వాల - పత్రిక, అశోకం నాటకం-
వైతాళికులు ఆధునిక కవిత్వ సంకలనం

ఈ మూడు కలిపి కూడితే ముద్దుకృష్ణ అనే సాహసి, సాహిత్య పిపాసి మన కళ్లముందు నిలబడతాడు. 1932 చివరలో జ్వాల పత్రిక ప్రారంభమైంది. 1934లో అశోకం నాటకం అచ్చయింది. 1935లో వైతాళికులు సంకలనం వెలుగు చూసింది.
1898లో పుట్టి 1973లో మరణించిన సామినేని ముద్దుకృష్ణ బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడుగారి శిష్యుడు, చలం, కృష్ణశాస్ర్తీ, తల్లావఝుల శివశంకర శాస్ర్తీ, శ్రీశ్రీ ఆదిగాగల సాహిత్య ప్రముఖులందరికీ మిత్రుడు. ఒకప్పటి సాహితీసమితి, ఆ తరువాత నడిచిన నవ్య సాహిత్య పరిషత్తు నడిచిన నడకలూ, తిరిగిన మలుపులూ, ప్రత్యక్షంగా ముద్దుకృష్ణకు తెలుసు. అన్నట్టు విశాఖపట్టణంలో వెలిసిన పురిపండా, శ్రీశ్రీ, కాళూరి నరసింగరావు మొదలైనవారి కవితా సమితి కార్యక్రమాలు కూడా - మంచి కవిత్వపు మెళుకువలు తెలిసినవాడు, స్వయంగాకవి కావడం; రచనా విధానాలలో ఆయా కవి హృదయాలు పట్టుకోగలగడం వంటి సదుపాయాలుండటంవల్ల ముద్దుకృష్ణ 1910-1935 నడుమ పాతికేళ్లలో నడిచిన కొత్త కవిత్వం నుంచి మేలైనవీ, మార్గదర్శకాలనదగినవీ- 191 పద్య, గేయ ఖండికలు- 26 మంది కవులవి, ఎంచి సంకలనంగా ప్రచురించారు.
వైతాళికులు కవిత్వ సంకలనాన్ని తొలిసారిగా 1935లో ప్రచురించినప్పుడా సంపుటాన్ని కోలంక రాజాగా ప్రసిద్ధి పొందిన రావు ప్రద్నుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు గారికి అంకితం చేశాడు. అప్పటినుండి, 1994 ఫిబ్రవరి నాటి తాజా ముద్రణంతో కలిపి- ఇప్పటికి 11 ముద్రణలు పొందింది.
వైతాళికులు సంపుటిని కూర్చడంలో శ్రీముద్దుకృష్ణ అనుసరించిన విధానం గురించీ, అందులో జేరిన రచనల ఇతివృత్తాల గురించీ ప్రస్తావించడానికి ముందు- ఈ సంకలన ప్రయత్నానికి వెనకా, ముందూ జరిగిన ఆసక్తికరమైన సంగతులు కొన్ని చెప్పుకోవాలి. దాదాపుగా నాలుగు తరాల కవిత్వాభిమానుల్ని ఆకట్టుకుని ఉర్రూతలూగించి- ఆధునిక కవిత్వ సంకలనాలలో అగ్రపీఠం అలంకరించిన వైతాళికులు కథ అంత సుఖంగా నడవలేదు. అభ్యుదయ కవితా ఉద్యమం, అభ్యుదయ రచయిత సంఘాల, మూలస్తంభాలలో ఒకరైన మనస్వి తుమ్మల వెంకట్రామయ్యగారు ముద్దుకృష్ణ గురించి 1973 నాటి ఎనిమిదవ ముద్రణలో - సంస్కృతి రాస్తూ ‘‘... ఈ సంకలనానికి కృషి చేస్తున్నపుడు రచయితల నుంచి తానాశించినంత ప్రోత్సాహ ప్రోద్బలాలు లభించకపోయినా నిరుత్సాహపడలేదు ముద్దుకృష్ణ’’ అన్నారు.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-ఇంద్రగంటి శ్రీకాంతశర్మ