వినమరుగైన

ఆమె నవ్వింది ...-గోరాశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక పెళ్లయిన అమ్మాయి - భర్త ఊళ్లో లేనప్పుడు కొద్దిరోజుల పరిచయం మాత్రమే కలిగిన ఒక యువకుడిని సినిమాకు వెళ్దామని చెప్పి తీసుకువెళుతుంది. దారిలో ఆ యువకుడు ‘‘మనిద్దరం ఇలా తిరుగుతూ వుంటే నలుగురూ ఏమైనా..’’ అంటాడు. పెళ్లయిన అమ్మాయి ‘‘ఏడిశారు- నలుగురూ నలభైమందీ అనుకుంటే ఏం’’ అంటుంది.
పిల్ల భవిష్యత్తు గురించి ఆందోళన చెందిన అమ్మాయి తండ్రి ‘‘.. అతడిని వెంటేసుకొని అలా బీచీ షికార్లకనీ, సినిమాకనీ వెళుతున్నావు గదా- కాస్త ముందు వెనుకలు ఆలోచించాల’’ని అంటాడు కూతురితో. ‘‘..మీ ఆయన వచ్చే నెలలో టూరునుంచి తిరిగి వచ్చేస్తున్నాడు. ఇదంతా చూసి అతడు ఏమనుకొంటాడు?’’ అని కూడా అడుగుతాడు. ఈ సన్నివేశాన్ని చూస్తేనో, ఎక్కడైనా చదివితేనో ఏమనిపిస్తుంది? సహజంగానే ఆ అమ్మాయి టెంపరితనం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమె ఆలోచన, పనులు అనుమానాలకు ఆస్కారం కలిగిస్తాయి.
కాని నిజానికి ఆ అమ్మాయి చాలా మంచిది. ‘‘మా ఆయన ఏమీ అనుకోరు. మాకు ఒకరిమీద ఒకరికి ఆ మాత్రం నమ్మకాలు ఉన్నాయి. ఇంతకూ ఇంతమంది చూసి మూర్ఛపోయేందుకు ఇందులో ఏముంది నాన్నా? పాపం ఆ రామారావును చూస్తే (అంటే కొత్తగా పరిచయమైన యువకుడిని) చూస్తే నీకు జాలి లేదూ? అడుగడుగునా అతణ్ణి జీవితం మోసం చేసింది. ఆత్మీయులు మోసం చేశారు. అతనికిప్పడు కావలసింది కాస్త ధైర్యం చెప్పడం, చిరునవ్వుతో కొంచెం చేయూతనివ్వడం, బతుకంటే భయం పోగొట్టడం. ఆ పని మొరటు గుండెల మగవాడు చెయ్యలేడు. చల్లని స్ర్తి హృదయమే ఆ పని చెయ్యగలదు’’ అని తండ్రికి చెప్పిందా పెళ్లయిన పిల్ల. నిజమే. మంచివాళ్లలా కనిపించే వాళ్లందరూ మంచివాళ్లు కాకపోవచ్చు. అలాగే చెడ్డవాళ్లని అనుమానం కలిగించే వాళ్లంతా చెడ్డవాళ్లు కాకపోనూ వచ్చు. ఇదీ లోకం! ఇలాంటి జీవితసత్యాలను, లోకరీతులను అందించే సాహిత్యం మన తెలుగు భా షలో గణనీయంగా ఉంది. రేడియో నాటక ప్రక్రియ ద్వారా ఇలాంటి సందేశాలను అందించిన ఒక గొప్ప సాహితీవేత్త గోరాశాస్ర్తీగారు. ఆశ ఖరీదు అణా అనే నాటికల సంకలన గ్రంథంలో ఆమెనవ్వింది అనే నాటికలోనివే పెళ్లయిన అమ్మాయి, అపరిచిత యువకుడి పాత్రలు.
దృశ్య సన్నివేశాలను రాయడం వేరు, విని ఆనందించే విధంగా నాటికలను రూపొందించడం వేరు. శ్రవణ సుఖం కలిగించే విధంగా నాటికలను రాయడంలో గోరాశాస్ర్తీగారు దిట్ట. జీవితం నేర్పిన గుణపాఠాలను ఒక అసాధారణ ప్రజ్ఞతో శ్రోతలతోనూ, పాఠకులతోనూ పంచుకున్న నాటక రచయిత, జర్నలిస్టు, గోరాశాస్ర్తీగారు అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి గోరా శాస్ర్తీగారు సూటిగానూ చెప్పగలరు, పరోక్షంగానూ సందేశాన్ని అందించగలరు. పాలకులకు బుద్ధిలేదు, ప్రజలకు సిగ్గులేదు అని డెబ్బైలలో ఆయన ఒకానొక రోజున ఆంధ్రభూమి దినపత్రి సంపాదకీయంలో రాశారు.
అలా కఠినంగా చెప్పవలసిన పరిస్థితులు ఆనాడు ఏర్పడి ఉన్నాయి. ఆయన దాదాపు ఇరవై సంవత్సరాలు దినపత్రిక సంపాదకులుగా పనిచేశారు. ఇంతకంటె సూటిగా ఒకవంక ప్రభుత్వాన్ని, మరొకవంక ప్రజలను తిట్టడం ఎవరికైనా సాధ్యమవుతుందా!
గోరాశాస్ర్తీ గారి పేరు ప్రస్తావనకు వస్తే ఆయన నిర్వహించిన పత్రిక ‘స్వతంత్ర’ జ్ఞాపకం వస్తుంది. వారపత్రికైనా స్వతంత్రకు మంచి పేరుండేది. ఆయన ఆంధ్రభూమి సంపాదకులుగా ఉన్నపుడే కొంతకాలంపాటు దక్కన్ క్రానికల్ పత్రికకోసం ఇంగ్లీషులో కూడా ఎడిటోరియల్స్ రాస్తుండేవారు. ఇంగ్లీషులో రాసినపుడు ఉన్నతాధికారులు సైతం టెలిఫోన్ చేసి పొగడ్తలతో ముంచెత్తివేస్తుంటే ఆయన ‘‘దిక్కుమాలిన తెలుగులో ఎంతకాలానికీ రాని రికగ్నిషన్ ఇపుడు వచ్చింది చూడండి’’ అంటుండేవారు. అదొక బాధతో అన్నమాటేగాని తెలుగుమీద అభిమానం తగ్గి అన్నమాట కాదు.
ఆయన నిర్వహించిన పత్రికలన్నీ ఒక ఎత్తు, తెలుగు స్వతంత్ర ఒక్కటీ ఒక ఎత్తు. అలాగే ఆయన రచనలలో ఆశ ఖరీదు అణా నాటికకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆశ ఖరీదు అణా టైటిల్‌తో మొత్తం ఐదు నాటికల సంకలనం వెలువడింది.
-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

పొత్తూరి వేంకటేశ్వరరావు