వినమరుగైన

అసంతృప్తి అగ్నిపర్వతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లయిన పిల్ల, కొత్తగా పరిచయమైన యువకుడు కలిసి సినిమాకు వెళ్లిన సన్నివేశం ఆమె నవ్వింది నాటికలోనిది. సంకలనంలో అది రెండవది. మొదటిది ఆశ ఖరీద అణా. రాగద్వేషాలు, తీయని తలపుల, పరువుకోసం పోతే అనేవి మిగిలిన మూడు నాటికలు. శాస్ర్తీగారి రేడియో నాటికలలో ఆశ ఖరీదు అణా కలికితురాయి.
తీయని తలపులు ఒక వినూత్న ప్రయోగం. స్వగతం లాంటి సంభాషణల ద్వారా ఒక స్ర్తి పాత్ర మనోభావాలను, మరొక పురుష పాత్ర ఆలోచనలను వినిపించే రేడియో నాటిక అది. స్ర్తి కంఠం, పురుష కంఠం పలికే వాక్యాలు ఒక క్రమంలో ఉండి నాటిక రూపొందింది. గొంతులు ఎవరివైనా కావచ్చు. అది ముఖ్యం కాదు. ఆమె అంటుంది.
‘‘నినే్నమీ అనటం లేదు పిన్నీ! సుఖపెడదామనే ప్రయత్నించావు. పెళ్లిచేశావు. నిస్సహాయంగా నేనూ జీవితంలో రాజీపడ్డాను. ముఖ్యంగా నీకోసం.. నిన్ను సంతృప్తిపెట్టడం కోసం.
మొదట్లో నేను ఏదో కొంత సంతృప్తి పడ్డాను. ఆ పెళ్లి జరిగాక దాంపత్య జీవితం ప్రారంభించాను. కొద్దిరోజులకే తెలిసిపోయింది నాకు- నేను అడుగులేని పడవలో ప్రయాణం చేస్తున్నానని.
నిజం పిన్నీ! నీకేం తెలుస్తుంది ఆ బాధ! ఎలా పోల్చుకోగలవు నువ్వు? నన్ను పడవ ఎక్కించి నీట్లోకి తోసేశావు.
ఆ పడవ పైకి చూడ్డానికి చక్కగా ఉండేది పిన్నీ! రంగులూ, బల్ల చెక్కలూ వేటికీ లోటు లేదు. కాని- పిన్నీ! ఆ పడవకి అడుగు లేదు- చుక్కానీ లేదు. ఆ పడవలోనే ఏ వొడ్డుకి, ఏ సుందర తీరానికి ప్రయాణం చెయ్యగలను పిన్నీ!’’ శాస్ర్తీగారు అడుగు, చుక్కాని పదాలలో లోతైన భావాన్ని దట్టించి ప్రయోగించారు.
ఈ దృశ్యంలో పిన్ని నిద్రపోతుంటుంది. నిద్రపోతున్న పిన్నితోనే ఆమె మాట్లాడుతుంటుంది. పిన్ని పాత్రకు మరో ప్రయోజనం ఏమీ లేదు. ఆమెది నిశ్శబ్ద పాత్ర. నిమిత్తమాత్రురాలు.
పురుష కంఠం పలుకుతుంది మరోచోట స్వగతంలో-
‘‘... ఒక్క ఆడది నీ గుండెల్లో అగ్ని రగిల్చి వెళ్లిపోతుంది. అంటే నీ జీవితంతో కాసేపు జూదం ఆడి మాయమైపోతుందన్నమాట. ఆమెకేం! హాయిగా భర్తా, సంసారం, పిల్లలూ! రాధ భర్త ఎవడో నాకు తెలీదు వెంకన్నా! కాని ఆ అనామకుడెవడో చాలా అదృష్టవంతుడు. ఎంచేతనంటే- దేవతలంటే ఎక్కడో దేవలోకంలో ఉంటారనుకొంటున్నావా వెంకన్నా? ఉత్తది. నీ చుట్టూరా ఉంటారు. పైకి వాళ్లు సాధారణంగానే కనబడతారు. పోల్చుకుందికి నీకు కళ్లుండాలి వెంకన్నా! వాళ్ల గుండెల్లోని దివ్య సంగీతం వినడానికి చెవులుండాలి..’’
ఇక్కడ వెంకన్న పాత్రకు కూడా నిద్రపోవడమే పని. ఆ పాత్ర ప్రయోజనం అంతవరకే. స్ర్తి కంఠం ఎవరిదైనా కావచ్చు. పురుష కంఠం కూడా ఎవరిదైనా కావచ్చు. కాని వాళ్లు మాట్లాడినవి హృదయాంతరాళాల నుంచి పైకి ఎగసి వచ్చిన భావాలు. ఇద్దరూ వ్యక్తపరిచింది అసంతృప్తే. కాని, స్ర్తి అసంతృప్తి వేరు, పురుషుడి బాధ వేరు. సంభాషణల వెనుక దాగివున్న వేదన కొలతలకు అందదు. రాధమీద అతడికి గాడమైన అభిమానమో, ప్రేమో ఉంది. కాని ఆమె దృక్కోణం నుంచి అతడు చూడలేదు! చూడలేడు!
స్ర్తిని పురుషుడు, పురుషుడిని స్ర్తి అర్థం చేసుకొని సుఖపెడుతున్న సంసారాలు గోరాశాస్ర్తీగారు నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం ఎన్ని ఉన్నాయని ఎవరి ఎరుకలో వారు చూసి ప్రశ్నించుకొంటే తక్కువే కనిపిస్తాయి. స్ర్తి తన అసంతృప్తిని అణచివేసుకొనలేపోతే అగ్నిపర్వతంలా బద్దలవుతాయి. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

పొత్తూరి వేంకటేశ్వరరావు