వినమరుగైన

ప్రశ్నించేతత్వముంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్ర్తీగారు ఈ నాటికను రాయడానికి ప్రోత్సహించిన సుప్రసిద్ధ సాహితీ వ్యాఖ్యాత శ్రీవాత్సవగారు. ‘‘తెలుగు నాటికల సంపుటాలలో తలమానికం అనిపించుకోదగిన సంపుటం గోరాశాస్ర్తీ గారి ఆశఖరీదు అణా అని శ్లాఘించారు. అది అక్షరాలా నిజం. అతిశయోక్తి ఎంత మాత్రం లేదు.
ముఖ్యంగా మధ్య తరగతి మనుషులను దృష్టిలో పెట్టుకొని రాసినందువల్ల కావచ్చు. గోరాశాస్ర్తీగారు ఈ గ్రంథాన్ని ఆయన మాటల్లో చెప్పాలంటే- ‘‘ఎన్ని పంచవర్ష ప్రణాళికలు గడుస్తున్నా జీవితంలో అణా ఖరీదు ఆశ కూడా లభించక శ్రేయోరాజ్యపు రథ చక్రాల క్రింద పడి నలిగిపోతున్న నేటి నడిమి తరగతి బడుగు ప్రాణులకు’’ అంకితం ఇచ్చారు.
శాస్ర్తీగారు ఉద్దేశించినది అప్పటి బడుగు ప్రాణులనే గాని ఇప్పటికీ ఆయన రచన మధ్య తరగతి ప్రజలనే కాదు, బడుగు జీవులందరికీ కూడా బతుకుమీద తీపిని పెంచుతుంది.
రకరకాల మానసిక ఒత్తిడులు, నిరాశా నిస్పృహలు పెరుగుతున్న పరిస్థితులకు శాస్ర్తీగారు పలికించిన ‘‘చావడానికి లక్ష కారణాలు - బ్రతకడానికి కోటి కారణాలుంటాయ’’న్న సూక్తిని పదే పదే జ్ఞాపకం చేయవలసి ఉంది.
-పొత్తూరి వెంకటేశ్వరరావు

త్రిపురనేని నాటకాలు - త్రిపురనేని రామస్వామి చౌదరి

త్రిపురనేని రామస్వామి గారి లేఖిని నుండి వెలువడ్డ నాటకాలు ఆరింటిలో కారెంపూడి కదనం, కొండవీటిపతనం, రాణాప్రతాప్ అనే మూడు నాటకాలూ 1911కు ముందే ఆంగ్ల ప్రభుత్వంచే నిషేధింపబడ్డాయి. నాటకాల ప్రచురణకు తరువాత పూనుకున్నవారికి వాటి ప్రతులు లభించలేదు. లభించి ప్రచురించిన నాటకాలు మూడు. వాటిల్లో కురుక్షేత్ర సంగ్రామము 1912లో రచింపబడితే శంబుకవధ 1914-1917 మధ్యకాలంలో రచించపబడింది. ఖూనీ రచించేనాటికి 1935 వచ్చేసింది.
ఈయన నాటక రచనలోనూ కాలానుగుణమైన మార్పుల్ని మనం గమనించవచ్చు. కురుక్షేత్ర సంగ్రామము పద్యాలతో నిండి వుంటే శంబుకవధలో పద్యాలు తగ్గినా పెద్ద పెద్ద డైలాగులు చోటుచేసుకున్నాయి. ఖూనీలోని చిన్ని చిన్ని డైలాగులు శక్తిమంతంగా పేలాయి.
పిట్టకథలకు పుట్టినిల్లయిన పురాణాలంటే రామస్వామిగారికి గిట్టదు. ఇతిహాసాలలోని అనౌచిత్యాలను ఆయన ఆరాధించలేరు సరికదా అపహాస్యం చేస్తారు. పుట్టుకతో వచ్చిన ప్రశ్న ఆయన్ని మూఢ విశ్వాసాలకు బాగా దూరం ఉంచి అవకతవకల్ని అవహేళన చేసే శక్తిని సమకూర్చింది. అందువల్లనే ఆయన ఇటువంటి నాటకాల్ని వ్రాయగలిగారు. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-రావెల సాంబశివరావు