వినమరుగైన

త్రిపురనేని నాటకాలు - త్రిపురనేని రామస్వామి చౌదరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంబుకవధను ప్రేరేపించింది వశిష్ఠుడు కాదనీ, నారదుడనీ కాశీభట్ల బ్రహ్మయ శాస్ర్తీగారి వాదన. ఎవరు ప్రేరేపిస్తేనేంలే శంబుకవధ న్యాయమా, అన్యాయమా అనేది ముఖ్యం కదా. పైగా జీతంబత్తెంలేని ఆర్యుల టపాబంట్రోతుగా పనిచేసే నారదుడు మోసగించి శ్రీరాముడితో శంబుకుణ్ణి హత్యచేయిస్తుంటే వంశగురువైన వశిష్ఠుడేం చేస్తున్నట్లు? ఆయన వారించకపోవటనికి కారణం ఏమిటి? అన్నది కవిరాజు ఎదురుప్రశ్న.
ఇక ఖూనీ నాటకం విషయానికొద్దాం. ఎవరిని ఖూనీ చేశారు? ఎందుకు ఖూనీ చేశారు? ఆర్య ఋషులు వేనరాజును ఖూనీ చేయించారు. వారి శిష్యులు వేనరాజు పాత్రను కూడా ఖూనీ చేశారు. అది గమనించిన రామస్వామిగారు కళ్లురిమి, పళ్లు నూరి, భాగవతం చదివి ఖూనీ రహస్యాన్ని ఛేదించారు. వేనుడి తర్కంతో అందరికళ్లు తెరిపించారు. వేనుడు చిన్నతనంలో పిల్లల్ని పశువుల్ని చంపినట్లు చంపారట. అదే నిజమైతే ఆర్యఋషులంతా కలిసి ఆయనకు అంగరాజ్యాన్ని ఎలా కట్టబెట్టారు? ముందేమి జరగనున్నదో కూడా తెలుసుకోగలిగిన మునులకు పాపం వెనుక జరిగింది తెలియదు కాబోలు!
భాగవతంలో వ్రాసిన ప్రకారం వేనుడు రాజు కాగానే పాముల భయంవల్ల, కలుగుల్లో దూరిన ఎలుకల మాదిరిగా రకరకాల దొంగలంతా తోకముడిచారని కదా. మరి వేనుడు ధర్మప్రభువు కానట్లయితే ఆయన్ని చూసి దొంగలు భయపడాల్సిందేముంది?
నిజమే, భాగవతం- వేనుడు పాషండుడు, నాస్తికుడు అని పేర్కొన్నది. పాషండుడు అంటే వేద బాహ్యుడు. నాస్తికుడంటే దేవుడు లేడని నమ్మేవాడు. వైదిక ధర్మాల్ని పాటించనంత మాత్రం చేత మానవుడు దుర్మార్గుడవుతాడా?
పాషండులు దుర్మార్గులు కానక్కరలేదు. నాస్తికులు లోక కంటకులు కానక్కర్లేదు. కవిరాజు దృష్టిలో వేనుడు బౌద్ధమతమునకు మార్గదర్శి. జీవకారుణ్యము కలిగిన లోక కళ్యాణార్థము పాటుపడినవాడు.
ఖూనీ నాటకంలో వేనుని తల్లి సునీధాదేవి దొక గొప్ప పాత్ర. ఆమె సదసద్వివేక సంపన్న. మహా విదుషీమణి. సృష్టి రహస్యజ్ఞాన చతురమతి. కనుకనే వేనునికి శైశవము నుండే విద్యాబుద్ధులు గఱపి, ధర్మాధర్మ నిరూపణ శక్తి యలవరచి, దోషా దోష విజ్ఞానము సంఘటించినది. అందువల్ల వేనుని వ్యక్తిత్వంలో లోపం ఏదైనా వుంటే అది తనదేనంటుంది.
చలిచీమయినా చావద్రొక్కనేరని వేనుడు, ఉగ్గుబాలతో రంగరించి పోసిన భూతదయారసంబు ద్రావి పెరిగిన వేనుడు, కుడిచిన చోట బండక, పండినచోట గుడువక రాజ్యమెల్లను యెల్లప్రొద్దుల గ్రుమ్మరుచు, బీదసాదలను, తోడులేని వారిని బ్రోచేందుకు బద్ధకంకణుడయిన వేనుడు ఋషుల యెడ అపచారం చేశాడంటే ఆమె ఎలా నమ్ముతుంది విషయం తెలుసుకున్న తరువాత చెప్తుంది- వేనుడు ధర్మపీడ కండ్లారా చూస్తే ఒళ్లు మరచి మాట్లాడటం అతని నైజం. అతడుదృఢాభిప్రాయాలు కలవాడు, చెప్పుడు మాటలు వినడు, వేనుడు తల్లికి తగిన తనయుడెట్లో అట్లే సునీథాదేవి తనయునకు తగిన తల్లి.
‘కఱవు రాకుండుటకు బాడిపంటలు మూలము, పాడిపంటలకు వరఫులేమి మూలము. వఱపు లేకుండుటకు వానలు మూలము, వానలకు మేఘములు మూలము.
మేఘములకు ధూమము మూలము. ధూమమునకు యజ్ఞములు మూలము’’ అని గౌతమ ముని తర్కిస్తూంటే వేనుడు ‘‘యజ్ఞములకు ఋషులు మూలము. ఋషులకు గుటీరములు మూలము. కుటీరములకు నాశ్రమములు మూలము’’ అంటూ వెటకారించి గౌతమునిది కుతర్కంగా కొట్టిపారేస్తాడు. పొగబెట్టి ప్రయోజనం లేదని తేల్చుతాడు. అలాగే యజ్ఞపశువుకు, యజ్ఞకర్తకు స్వర్గలోకం ప్రాప్తిస్తుందని గౌతమ ముని శిష్యుడు శునశే్శపుడు చెప్పినపుడు వేనుడు వెంటనే ‘‘మీ గురువుగారైన గౌతముడు నిన్ను యజ్ఞపశువుగా జేసి యజ్ఞాన్ని ముగిస్తే గురుశిష్యులిద్దరికీ ఉత్తమ లోక ప్రాప్తి సిద్ధిస్తుంది కదా’’ అని చురక తగిలిస్తాడు. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-రావెల సాంబశివరావు