వినమరుగైన

త్రిపురనేని నాటకాలు- త్రిపురనేని రామస్వామి చౌదరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘యజ్ఞము మాని సర్వభూత సమభావుడవు కమ్ము’’ అని హితవు పలుకుతాడు. జీవహింస చేసేవాళ్లకు స్వర్గము, అది కాదనే వాళ్లకు నరకము లభిస్తే, అహింసను ఆచరించే వాళ్లుండే నరకానికి వెళ్లడమే తనకిష్టమన్నాడు వేనరాజు.‘‘లోకము నా యాజ్ఞాబద్ధమై యానందమయమైనను గావలయును లేకున్న నేనీ లోకమును బాసియైనను బోవలయును’’ అని ప్రతినబూనిన వేనుడు, ప్రజలు మునుల వలలో చిక్కి కీలుబొమ్మలు కావటం చూచి ‘‘ఎవరి కొరకు నా జీవిత సర్వస్వము వెచ్చించి యభ్యుదయమును గూర్ప యత్నించితినో, వారే నా యుద్యమమునకు సుముఖులు కాలేకపోయిరి’’ అని వెలిబుచ్చిన నిర్వేదంలో రామస్వామిగారి సొంత గొంతే విన్పిస్తున్నది. పెంచి పెద్దచేసిన సేనాని దృష్టవర్మను, కుమారుడు పృథువును వేనుని చంపేందుకు ఆర్య ఋషులు పంపటం గమనించిన వేనుడు దృష్టవర్మతో అన్న మాటలు- ‘‘ఏ వౌని చేతులలోనో పడి చావక కన్నబిడ్డ వంటి నీ చేతులలో మరణించుటచే నేనాత్మ శాంతిని బొందుచుంటిని’’ మునులు లేదా మునుల మనుకొనువారు ఎంతగా సిగ్గిల్ల వలసిన విషయమిది! ఇలా భారత, రామాయణ, భాగవతాల్లోని నిజాల నిగ్గుదేల్చారు తమ నాటకాల్లో త్రిపురనేని రామస్వామి. తెలుగు సాహిత్యంలోని మూఢ విశ్వాసాలను తూర్పారబట్టిన పొలికేకలు ఈయన రచనలు.
ఆముటెద్దులు రెండు పోరాడుచుండ
నడుమనున్న లేగల కాళ్లు నలఁగునట్లు
‘‘యావు చేనిలో మేయుచున్నంత దూడ
లెట్టుగట్టున మేయునో? కృష్ణ! చెపుము’’
రామస్వామిగారి నాటకాలకు పీఠికల దొక ప్రత్యేకత. వీరి పెద్ద పెద్ద పీఠికలను అనేక అసంబద్ధతలను గూర్చి సూటిగా, చురుకుగా నాటే ములుకు మాటల భోషాణాలు. రామస్వామిగారు పడిన కష్టానికి ప్రతిఫలం లభించింది. వారు నేర్పిన ఎదురీత వృథా పోలేదు. వారు తొక్కిన కొత్తబాటల వెంట పిల్లకాల్వలెన్నో ప్రవహించి పంట కాల్వలయ్యాయి. పిల్ల వస్తాదులెందరో ముందుకు వచ్చి బల్లిదులయ్యారు.

-సశేషం

-- రావెల సాంబశివరావు