వినమరుగైన

మాతృమందిరము వేంకట పారతీశ్వర కవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహితీ కల్పలతకు పూచిన దివ్యమైన రెండు పువ్వులే వేంకట పార్వతీశ్వర కవులుగా ప్రసిద్ధులైన శ్రీ బాలాంత్రపు వెంకటరావు, శ్రీ ఓలేటి పార్వతీశంగార్లు. ఆంధ్ర భీష్మ, మహా మహోపాధ్యాయ బిరుదాంకితులు శ్రీ ఆచంట వేంకటరాయ సాంఖ్యాయన శర్మగారు తమ పత్రిక కల్పలతలో ఓసారి నిర్వహించిన చిత్రమైన శీర్షికకు జవాబులు పంపి శ్రీ నడకుదిట వీరరాజుగారు ప్రథమ బహుమతిని శ్రీ ఓలేటి పార్వతీశంగారు ద్వితీయ బహుమతిని, శ్రీ బాలాంత్రపు వెంకట రావుగారు నాల్గవ బహుమతిని గెల్చుకున్నారు.
అప్పటివరకు ఒకరికొకరు పరిచయం లేని ఓలేటి పార్వతీశంగారిని, బాలాంత్రపు వేంకటరావుగారిని నడకుదిటి వీరరాజుగారు కలిపారు. అప్పుడు ఇద్దరూ స్నేహితులయి, అప్పటివరకు స్వతంత్రంగా రచనలు చేసిన ఇద్దరూ కలిసి రచనలు చేద్దామనుకుని వేంకట పార్వతీశ్వర కవులయ్యారు.
శ్రీమంతుడు, సాహిత్యప్రియుడు అయిన కొవ్వూరి చంద్రారెడ్డిగారి సాయంతో 1911లో ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల స్థాపించి, తాము చాలా నవలలు అనువదించి, రచించి, ఇతర రచయితల నవలలు సంపాదించి, దాదాపు 150 నవలలు ప్రచురించి తెలుగు నవలకు అపార ప్రచారం కలిగించారు.
వీరి వంగ, ఆంగ్ల, కన్నడ నవలల అనువాదాలను మినహాయిస్తే వీరికి చిరకీర్తి సంపాదించిన స్వతంత్ర నవలలు ముఖ్యంగా మూడు. అవి శృంగార రసబంధురమైన వసుమతీ విలాసం (1911), చరిత్ర, కల్పనల మేలిమేళవింపు అయిన ప్రమదావనం (1914), సంఘ సంస్కరణ ప్రబోధాత్మకమైన మాతృమందిరము (1918). 1918లో ప్రచురణ పొందిన వేంకట పార్వతీశ్వర కవుల మాతృమందిరము ఇప్పటికి 82 ఏళ్లనాటి గోదావరి ప్రజల జీవితాలు చిత్రించింది.
నవలా కథ తెలుసుకోవడానికి ముందు మాతృమందిరం ఎక్కడ వుందో తెలుసుకోవడం ముఖ్యం.
మాతృమందిరం గోదారీ తీరంలోని గోపాద క్షేత్రంలో వుంది. అక్కడ జగన్మాత సర్వమంగళాకారమై వేంచేసి లోకాలు పరిపాలిస్తోంది. ఆ పవిత్ర స్థానం ఐశ్వర్య కైలాసం, ఆరోగ్య వైకుంఠం, ఆనంద బ్రహ్మ నిలయం అని ప్రసిద్ధి పొందింది. ఆ మాతృదేవి తన ప్రియపుత్రుడైన ప్రబోధానందస్వామి నేతృత్వంలో ప్రజలను రక్షిస్తుంటుంది. అందుకే ప్రబోధానందస్వామి అనుగ్రహం లేనివాళ్లకు అప్పటికీ, ఇప్పటికీ మాతృమందిరం అగోచరం, అగమ్యం అవుతుంది.
మాతృమందిరం ఓ దివ్య సుందర నగరం. ఆ మందిరంలోని ఇతర మందిరాలు చిన్న చిన్న నగరాలు. నగర మధ్యభాగంలో మాతృదేవతామందిరం వుంది. ఆ మందిరానికి ఎడమవైపున ప్రబోధామందిరం, దాన్ని అనుసరించి శిక్షా మందిరం వున్నాయి. కుడివైపున ఆనంద మందిరం, దానితో కలిసి విజ్ఞాన మందిరం వున్నాయి.
ప్రబోధ మందిరానికి ఎదురుగా సరస్వతీ మందిరం, ఆనంద మందిరానికి ఎదురుగా అన్నపూర్ణా మందిరం వున్నాయి. మాతృ మందిరానికి వెనకే ఇంకా ఎన్నో నిగూఢ మందిరాలున్నాయి. ఎదురుగా విశాల రాజమార్గం వుంది. కొంచెం దూరంగా ఓ విశాల సరోవరం వుంది. అదే అమృత సరోవరం. ఎందరో మహానుభావులు ఆ సరోవరంలో స్నానమాడి జీవితాదర్శాలు సాధించారు. భారతభూమిలో పూర్వ ప్రస్తుత మహనీయులు అందరు అమృత సరోవరంలో స్నానమాడటంవలననే తమ కార్యాలు జయప్రదం చేసుకున్నారు. అనేక ఉదాహరణలలో మనం ముగ్గురిని గమనించవచ్చు. అచట స్నానంచేసే శ్రీరామచంద్రుడు రావణుని జయించాడు. వాల్మీకి రామాయణం రచించాడు. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కొలసాని సాంబశివరావు