వినమరుగైన

వైతాళికులు -ముద్దుకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదిలా ఉండగా, ఆరుద్ర తమ సమగ్ర ఆంధ్ర సాహిత్యం 13వ సంపుటి 145వ పేజీలో ముద్దుకృష్ణ వైతాళికుల ప్రస్తావన చేస్తూ ‘‘కవితా సమితి సభ్యులెవరూ ముద్దుకృష్ణకు పద్యాలు ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చారు. అందుకే వాళ్ల పద్యాలు వైతాళికులలో లేవు’’- అని రాయడమే కాక, ‘‘అయితే, సమితి నిర్ణయానికి కట్టుబడక శ్రీశ్రీ ఒక్కడే తన పద్యాలను ముందు ముద్దుకృష్ణకు ఇచ్చాడు’’ అని కూడా రాశారు. తన మాటలకు ఆధారం పురిపండా అప్పలస్వామిగారి కథనమని నిర్థారించాడు. అటు నవ్యసాహిత్య పరిషత్తు కవులనీ, ఇటు అభ్యుదయ కవులనీ, బాగా సన్నిహితంగా ఎరిగినవాడూ, స్వయంగా కవీ, విశేషించి శ్రీశ్రీ ఆప్తుడూ అయిన అబ్బూరి వరద రాజేశ్వరరాగారు తమ కవనకుతూహలం పుస్తకంలో ముద్దుకృష్ణగారితో తమ పరిచయం గురించి రాస్తూ, పుస్తకం 187వ పుటలో ఒక బాంబులాంటి విషయం పేల్చాడు. ఈ పుస్తకం 1989లో అచ్చయింది.
వరద రాజేశ్వరరావుగారి వాక్యాలివి. శ్రీరంగం శ్రీనివాసరావు నలుగురి మధ్యా ముద్దుకృష్ణని ఎద్దేవా చేశారు. ఆ నలుగురిలో పురిపండా అప్పలస్వామి, పూడిపెద్ది వెంకటరమణయ్య, శ్రీరంగం నారాయణబాబూ ఉన్నారు. వైతాళికుల్లో అచ్చయిన గీతాలను ఎంపిక చేసింది కృష్ణశాస్ర్తీ కాని, ముద్దుకృష్ణ కాదని- ముద్దుకృష్ణకి కోపం వచ్చింది. శ్రీనివాసరావన్నదాంట్లో కొంత నిజం లేకపోలేదు’’ అని.
నా తండ్రి శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీ నవ్య సాహిత్య పరిషత్తు సభ్యులు. నవ్య సాహిత్య వ్యాపకులలో, ప్రచారకులలో ఒకరు. ఆయన నా చిన్నతనాన వైతాళికులు సంకలనం ప్రస్తావన వచ్చిన సందర్భాలలో ‘‘సంకలనం ముద్దుకృష్ణ చేశాడు కాని, రచనల ఎంపికలో సాహితీ సమితి వాళ్లందరి చేతులూ వున్నాయి’’ అనడం నాకు గుర్తుంది. సాహితీ సమితి అంటే 1919లో తల్లావఝుల శివశంకర శాస్ర్తీగారు సభాపతిగా ఏర్పడినది.
ఆయా కవులందరూ కృష్ణశాస్ర్తీగారితో సహా ముద్దుకృష్ణకు దగ్గర మిత్రులు కావడంవల్ల సలహాలుంటే వుండవచ్చునేమోగాని ఆయన ఎంపిక చెయ్యలేదనడం అన్యాయం. వట్టినే ఎంపిక చెయ్యడం కాదు, వానికి అమర్చిన క్రమం ప్రశస్తమైంది కూడా.
1935 జూన్ ఉదయిని సంచికలో వైతాళికులు పుస్తకాన్ని సమీక్షించిన శ్రీ కొంపెల్ల జనార్దనరావు మాటలు కూడా ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ఆయన శ్రీశ్రీకి ఆప్తమిత్రుడు. పైగా ఆ పత్రికతో గాఢ సంబంధం శ్రీశ్రీకున్నది.
జనార్దనరావు మాట- ‘‘ముద్దుకృష్ణగారు కొందరు కవులను ప్రధానంగా మనసులో ఉంచుకొని ఈ సంకలనం చేసి ఉండకపోతే, ఇంకా చాలా కావ్యాలు ఇందులో ఔచిత్యంతో ప్రవేశం పొందగలిగి వుండేవి. అయితే వీరు ముఖ్యులైన వైతాళికులను మాత్రమే ఏరుకొన్నారు’’ అని. సరే, జాషువా వంటి ఉత్తమ కవిని జారవిడుచుకోవడం వైళికులు సంపుటానికి తీరని లోటు అని ఫిర్యాదు అందరికీ తెలిసిందే- ఇందుకు కారణాలెవరికీ తెలియవు. సామినేని ముద్దుకృష్ణ వంటి అభ్యుదయశీలికి, కులం మకిలి పూయడం మాత్రం సమంజసం కాదు.
వైతాళికులు సంకలనం వెనకగల కథ ఇంకా వుంది.
*
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-ఇంద్రగంటి శ్రీకాంతశర్మ