వినమరుగైన

మాతృమందిరము -వేంకట పార్వతీశ్వర కవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడుకు పోవటం, కూతురు కాపురం ఇలా అయిందనే దిగులుతో అన్నపూర్ణ మరణిస్తుంది. శోకం తట్టుకోలేక తండ్రి కుమార్తెతో తీర్థయాత్రలు చేస్తూ, విజయవాడ కనకదుర్గాలయంలో ప్రవేశిస్తారు. అక్కడ సరస్వతికి తనభర్త సమీపంలోనే ఉన్నాడని మనసులో ఏదో తెలియని ప్రేరణ పొంది, తండ్రిని అక్కడే వదిలి, కృష్ణానది దగ్గరకు వెతుక్కుంటూ వచ్చి భర్త కనిపించక, దుఃఖంతో, కృష్ణలో పడుతుంది.
ఈ కథ ఇట్ల వుంటే, గౌరీపతి శాస్ర్తీ పొరుగువారు అన్నాచెల్లెళయిన భారతారావు, సత్యవతి, ఇద్దరికీ బాల్యంలోనే పెళ్లిళ్లవుతాయి. కాని భారతరావుకు భార్య, సత్యవతికి భర్త ఇరువురూ పోతారు. భారతరావు ఆదర్శవాది. సత్యవతికి వితంతు వివాహం చేసి తనూ వివాహం చేసుకోవాలనుకుంటాడు. అతని స్నేహితుడు సార్థక నామధేయుడు చంచలరావు. అతని సలహాతో, అతనితో కూడా భారతరావు కాకినాడలో ఉపాధ్యాయుడవుతాడు. చంచలరావు అనారోగ్య పీడితుడు కావటంతో, అతనికి సత్యవతిని తోడిచ్చి పిఠాపురంలో మంచి వైద్యం చేయిస్తాడు. మిత్రద్రోహి చంచలరావు జబ్బు తగ్గిన తర్వాత పెళ్లాడమని సత్యవతిని లాక్కుపోతుంటే మధుమతి అనే మూగ అమ్మాయి అక్కడ ప్రత్యక్షం అవుతుంది. చంచలరావు పారిపోతాడు. మూర్ఛిల్లిన సత్యవతిని ఎవరో తీసుకువెళ్తారు. ఇది తెలిసి భారతరావు పిచ్చివాడై ఊళ్లను బట్టి పోతాడు. ఇది రెండో కుటుంబ సమస్య.
మూడవ కుటుంబం వెంకటేశ్వరరావు, అనుసూయలది. వారి ప్రణయ జీవితం మనోహరమైంది. రతీమన్మథులనిపిస్తారు. వారి జీవితంలోకి చంచలరావు సోదరుడు దామోదరరావు ప్రవేశించి, వెంకటేశ్వరరావును పెద్దాపురంలో రాజరత్నం అనే వారకాంతకు లోలుడిగా మారుస్తాడు. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కొలసాని సాంబశివరావు