వినమరుగైన

మాతృమందిరము.. వేంకట పార్వతీశ్వర కవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజరత్నం అక్క నాగమణి. ఆమె సలహాతో భార్య అనసూయను అగౌరవం చేసి, గర్భవతి అని కూడా చూడకుండా ఇంట్లోంచి వెళ్లగొడతాడు వెంకటేశ్వరరావు. రాజమండ్రిలో గోపాలరావు నడిపే విలాస భవనంలో ఎందరో స్ర్తిలమధ్య జూదం ఆడుతూ వెంకటేశ్వరరావు యావదాస్తీ కోల్పోతాడు. తిండికి జరగదు. పశ్చాత్తాపం చెంది భార్యను వెతుక్కుంటూ వస్తాడు. ఆమె గోదావరి పుష్కరాలకు కోటిలింగ క్షేత్రానికి ఆపదలో తనను ఆదుకుంటున్న తన ఒకనాటి పరిచారిక జోగమ్మతో వస్తుంది. అయితే నీతిమంతురాలయిన వేశ్య రాజరత్నం అతనిని వెతుక్కుంటూ వచ్చినా, వెంకటేశ్వరరావు తొలగిపోతాడు. భార్యాభర్తలు, ఒకరినొకరు వెతుక్కుంటూ ఆనందాదేవితో అర్చించబడుతున్న కోటిలింగ క్షేత్రంలోని మాతృపీఠికా మందిరానికి వస్తారు. అక్కడ రాజరత్నం ఆమెను కలిసి, పశ్చాత్తాపంతో తను వేశ్యావృత్తికి దూరం అయి, తనలాంటి వారిని రక్షించడానికి మాతృదేవతా సేవాకంకణం తీసుకుంటుంది. అనసూయా వెంకటేశ్వరరావులకు మాతృపీఠికా మందిరంలో సమాగమం జరుగుతుంది.
దొంగలు తీసుకుపోయిన గణపతి శర్మ దొంగలలో పెరిగి, దొంగ రంగడవుతాడు. ధనవంతులిని కొట్టి, పేదలకు పెట్టడం అతని సిద్ధాంతం. అప్పడు అనే అస్పృశ్యుడిని వెంకటేశ్వరరావు కొడితే, రంగడు అతనిని కొట్టి, అతని డబ్బు లాక్కుని అప్పడి కూతురు ముత్యాలుకు ఇస్తాడు. ముత్యాలు చక్కగా చదువుకుంటుంది. ముత్యాలుకిచ్చిన డబ్బుతో అప్పడు మాంసం, ఎముకల వ్యాపారం చేసి ధనవంతుడవుతాడు. దయామయి అయిన ముత్యాలు ఒకరోజు తను పెంచుకుంటున్న చూడి ఆవును తండ్రి చంపబోతుంటే అడ్డగిస్తుంది. అప్పుడు తోసేస్తే మూర్ఛపోతుంది.
రంగడు వచ్చి ఆమెను, ఆమె ఆవును రక్షించి ఆమెకు భయం పోడానికి తన మెడలోని రక్షాపతకం విప్పి ఆ పిల్ల మెడలో కడతాడు. అది మొదలు ఆమె అతనినే భర్తగా భావిస్తుంది.చివరకు ఒకరొకరుగా అందరూ మాతృమందిరంలో కలుస్తారు. ప్రబోధానందస్వామి ఆజ్ఞతో చేసిన తప్పులు ఒప్పుకుంటారు. ప్రవర్తనలు దిద్దుకుంటారు. ఆంధ్రభూమిలోని ప్రతి ఇల్లు ఒక మాతృమందిరం అనుకుని నలుగురి ఆనందం కోసం ప్రయత్నిస్తారు. ఆ సరిగే గౌరీపతి శాస్ర్తీ అక్కడకు వచ్చి మాతృమందిరంలో వున్న ఆనందాదేవిని తన కుమార్తె సరస్వతిగాను, లోకాన్ని బాగుచేస్తున్న కల్యాణానందస్వామిని తన అల్లుడు పరబ్రహ్మంగాను, ప్రక్కనే వున్న మాతృదేవతా దీక్షితురాలిని, పునర్వివాహం త్యజించి సత్యానందాదేవి అయిన ఆమెను తన పొరుగింటి సత్యవతిగా గుర్తిస్తాడు. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కొలసాని సాంబశివరావు