వినమరుగైన

మాతృమందిరము వేంకట పార్వతీశ్వర కవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ క్షణంలోనే రంగడు, ముత్యాలు పెళ్లికి ప్రబోధానందస్వామి సన్నిధిలో సిద్ధమవుతారు. ముత్యాలు దగ్గరున్న పతకాన్నిచూసి, అది ఏనాడో పోయిన తన బిడ్డ గణపతి శాస్ర్తీ అని గౌరీపతి శాస్ర్తీ రుజువు చేస్తాడు. ఒక్కసారిగా రంగడు గణపతి శాస్ర్తీ అవుతాడు. కులాలు వేరుకావటంతో, మహోన్నత త్యాగంతో ముత్యాలు పరిణయబంధం త్యజిస్తుంది. పెళ్లిచేసుకోకున్నా తమ బంధానికి విచ్ఛేదం లేదని ఇద్దరూ భావించి, బ్రహ్మచర్యం స్వీకరించి పవిత్ర జీవితం గడుపుతారు. మాతృమందిరంలోని శిక్షా మందిరంలో చంచలరావు, దామోదరరావు, గోపాలరావులు శిక్షింపబడి మనుషులవుతారు. మూగపిల్ల మధుమతి తన భార్యేనని, ఆమెను తనే వదిలేశానని చంచలరావు ఆమెను స్వీకరించి మనిషి ననిపించుకుంటాడు. దామోదరావు, గోపాలరావులు తాము కాజేసిన వెంకటేశ్వరరావు ఆస్తి అతనికిఇచ్చి సంఘ సేవకులవుతారు అందరూ అందరినీ కలిశారు. మరి పరబ్రహ్మం, సరస్వతిల సంగతి ఏమిటి? వారు ప్రబోధానందస్వామి గురుత్వంలో ప్రజలనెందరినో సన్మార్గానికి తిప్పారు. ఎంతో కాలం ఒకరికొకరు దూరంగా వున్నారు. వారు కల్యాణానందస్వామి, ఆనందాదేవి. సరస్వతిని ఆనాడు కృష్ణవేణీ గర్భం నుంచి ప్రబోధానందస్వామి రక్షించి ఆనందాదేవిని చేశాడు. ఇప్పుడు ఆయన వెనె్నల వెలుగుల వంటి రెండు విహార నౌకలను వసంతరాత్రిలో, వెనె్నల చల్లదనంలో, గోదావరి నదిలో ప్రవేశపెట్టాడు. ఓ నౌకలో ముందే వెళ్లి పరబ్రహ్మం ఎదురుచూస్తుంటే, ప్రబోధానందస్వామి ఆజ్ఞతో ఆనందాదేవి మరల సరస్వతి అయి రెండో విహారనౌక ఎక్కి భర్తను కలుసుకుని ఓనాడు భర్తకు పరిపూర్ణ ప్రేమాస్పదురాలవుతుందని చెప్పబడిన జాతకఫలం అందుకోవడానికి, భర్తకు ఏకాంత సేవ చేయడానికి అందాల అలలో పయనమై సాగుతుంది. భారతీయ విజ్ఞానమూర్తి అయిన ప్రబోధానందస్వామి దాంపత్య ధర్మాన్ని ప్రశంసించడంతో కథ సుఖాంతమవుతుంది. ఇదీ నవలలోని కథ. కానీ శ్రీ మొదలి నాగభూషణ శర్మగారన్నట్లు రంగన్న అనే బ్రాహ్మణ కులం వారి కుమారుడు ముత్యాలు అనే కడజాతి వారి కుమార్తెను పెళ్లి చేసుకోవటం ఇందులో కథ కాదు. ఇప్పుడే చూశారుగా అది కాదని. అయితే శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు స్థూలంగా ఈ నవల ఇతివృత్తాన్ని గూర్చి చక్కగా అంచనా వేస్తూ, మంచిలో అతి మంచిని చెడులో అతి చెడును చిత్రించడం, చెడ్డ పాత్రలందరూ చివరకు మాతృమందిరంలో పశ్చాత్తప్తులై పునీతులు కావడం ఈ నవలలో ప్రధానాంశం అన్నారు. మనం కూడా ఈ నవల చదివాక మాతృమందిరం లాంటి మందిరం ఎక్కడన్నా వుంటుందా అనుకుంటాం. అనుకుంటే అది చాలా సహజమైన సందేహం. ఉంటే బాగుండును గదా అని కూడా అనుకుంటాం. అది కూడా చాలా సహజమైన ఆకాంక్ష. కాని అలాంటి ప్రపంచం ఉంటే బాగుండును గదా అని మనకు అనిపింపజేయడంలోనే కవులు తాము సాధించవలసిన ప్రయోజనాన్ని సాధిస్తారు. ఈ విషయాన్ని కొంత వివరంగా చూద్దాం. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కొలసాని సాంబశివరావు