వినమరుగైన

మాతృమందిరము వేంకట పార్వతీశ్వర కవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం కూడా ఈ నవల చదివాక మాతృమందిరం లాంటి మందిరం ఎక్కడన్నా వుంటుందా అనుకుంటాం. అనుకుంటే అది చాలా సహజమైన సందేహం. ఉంటే బాగుండును గదా అని కూడా అనుకుంటాం. అది కూడా చాలా సహజమైన ఆకాంక్ష. కాని అలాంటి ప్రపంచం ఉంటే బాగుండును గదా అని మనకు అనిపింపజేయడంలోనే కవులు తాము సాధించవలసిన ప్రయోజనాన్ని సాధిస్తారు. ఈ విషయాన్ని కొంత వివరంగా చూద్దాం.
వెంకట పార్వతీశ్వర కవుల నవల మాతృమందిరము ఆంగ్ల భాషలో థామస్ మోర్ రచించిన యుటోపియా లాంటిది. ఇక్కడ ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ నవల ఆంగ్ల గ్రంథం లాంటిది మాత్రమే. అనుకరణ, అనుసరణ కాదు. యుటోపియా అన్నపదానికి అర్థం నోవేర్ అంటే ఎక్కడా లేదు అని అర్థం. ఇంగ్లీష్ లిటరేచర్ అన్న గ్రంథంలో విలియం జె లాంగ్ ఇలా అంటారు. ‘‘1516లో ప్రచురింపబడిన మోర్ రచన యుటోపియా ఇంతవరకు ఏ సాహిత్యంలో కనిపించని రీతిలో శక్తివంతంగా, సొంత పద్ధతిలో చేసిన సాంఘిక పరిస్థితుల అధ్యయనం.. ఎక్కడా లేని అద్భుతమైన ఓ సామ్రాజ్యం గూర్చి, రచయిత అక్కడకు వెళ్లి వచ్చిన ఒక నావికుని వద్దనుంచి ఎంతో తెలుసుకుంటాడు. ఆ రాజ్యంలో శ్రమ, ప్రభుత్వం, సమాజం, మతంలోని సమస్యలన్నీ సరళన్యాయం, సామాన్య జ్ఞానంలతో పరిష్కరింపబడ్డాయి. ఈ యుటోపియాలోనే ప్రెంచి విప్లవానికేకాక, ఏ నాగరిక సమాజానికి అయినా పునాదులైన స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం అన్నమాటలు చూస్తాం. ఈమూడూ ఏ స్వేచ్ఛా ప్రభుత్వానికైనా ఇప్పటికీ నెరవేరని ఆదర్శాలు. ఈ విషయం నావికుడి నుంచి వింటూ, యుటోపియాతో తన దేశం అయిన ఇంగ్లండ్‌ను పోల్చుకుంటూ మోర్ ఎంతో ఆశ్చర్య పడతాడు. 15 శతాబ్దాల క్రైస్తవత్వం అనంతరం కూడా ఇంగ్లాండ్ ఇంత తక్కువ నాగరికత సాధించింది ఏమిటి? అని ఇపుడు ఆ పుస్తకం చదువుతూ మనని మనం అదే ప్రశ్న ప్రశ్నించుకుంటాం. ఆ సుందర స్వప్నం ఆచరణలో ఇంకా దూరం అవుతుంది. అయినా ఒక్క తరంలో ఏ దేశమైనా యుటోపియా కావచ్చు. ఎందుకంటే అలా అవటానికి అవసరం అయిన విషయాలు చాలా సరళం అయినవీ, న్యాయబద్ధం అయినవీ కావడమే కారణం- చూశారు గదా ఆంగ్ల రచయిత మోర్ అభిప్రాయాలు. ఒక రచయిత ప్రస్తుత సమాజంలోని లోపాలు పోవాలనీ, పోయినప్పుడు తన సమాజం ఒక దివ్యభూమి అవుతుందనీ అనుకుని తన కలలకు ఇచ్చే రూపంలో యుటోపియా లాంటి రచనలు వస్తాయి.
-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కొలసాని సాంబశివరావు