వినమరుగైన

గణపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిచ్చమ్మకు అనతికాలంలోనే కొడుకు పుడతాడు. గంగాధరుడని వాడికి పేరు పెట్టుకుంటారు. అయితే వాడి అచ్చటా ముచ్చటా పెద్దగా చూడకుండానే పాపయ్య మరిడి జాడ్యానికి గురై మృత్యువు పాలవుతాడు. నాలుగు రోజులపాటు వరుసగా శ్రాద్ధ్భోక్తగా వున్నందున, వార్థక్యంవల్ల ఈ జాడ్యం అతనికి సంక్రమిస్తుంది. అతనిని దహనం చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాకపోతే అతని మామగారే ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు.
ఇలా పాపయ్య కథ ముగిశాక, గణపతి తండ్రి గంగాధరుని కథ మొదలవుతుంది. అల్లుడు పోయాక అతనికి రావాల్సిన బాకీలన్నీ తన పేర నోటు వ్రాయించుకొని అప్పన్నగారు నిష్క్రమిస్తాడు. పాపయ్య సాంవత్సరీకాలకు కూడా కూతురు ఇంటికి రాదు. పిచ్చమ్మ మందపల్లి నుంచి తమ మకామును ఏనుగుమహలు గ్రామానికి మారుస్తుంది. అప్పటికి గంగాధరునికి ఏడు సంవత్సరాలు వస్తాయి. ఆ వయసులోనే అతడు ఏనుగు గున్నలా ఉంటాడు. మూడు పూటల భోజనానికి మూడు సోలల బియ్యం అతనికి ఒక మోస్తరుగా సరిపోతాయ్. ఇల్లు గడిచే మార్గం లేక పిచ్చమ్మ కొడుక్కి ఉపనయనం చేస్తుంది. అదేమిటి అని ఆశ్చర్యం అన్పించవచ్చు! ద్వాదశి బ్రాహ్మడిగా అమావాస్య బ్రాహ్మడిగా వెళ్ళే అవకాశం వస్తుంది కదా! సంభావనలు దిట్టంగా ముడ్తాయి మరి! అయితే గంగాధరునికి తరవాణి కుండ అంటే విపరీమైన మోజు. గ్రుక్కెడు తరవాణి త్రాగితే చంద్రునిలో ఆ కళంక మిన్నాళ్లు ఉండి ఉండేది కాదని అతని విశ్వా సం. తెల్లవారకమునుపే ముక్కుదాకా తరవాణి అన్నా న్ని ఊరగాయ ముక్కతోనో, నీరుల్లిపాయతోగాని ఎంతో ఆప్యాయంగా తినటంవల్ల గ్రామవాసులు అతణ్ణి బ్రాహ్మణార్థానికి పిలవటం మానేస్తారు. దానితో గంగాధరుడు తన మకాన్ని కాకినాడకు మారుస్తాడు. అక్కడి జనం నీటికోసం అగచాట్లు పడటం చూసి ఒక కావిడి బద్దనూ, రెండు కుండలనూ సంపాదించి ఇంటి ఇంటికీ నీరు పోయటం ఆరంభిస్తాడు. తన చేత నీళ్లు పోయించుకున్నవారు నెలకొక్కసారైనా రెండు పూట్లా భోజనం పెట్టాలని నియమం విధిస్తాడు. నాలుగు డబ్బులు కనపడటం మొదలుపెట్టక సింహాచలం అనే వేశ్యతో సంబంధం పెట్టుకుంటాడు. అయితే ఇంటి దొడ్డిదోవ గుండా రెండవసారి సంభావన తీసుకునే ప్రయత్నంలో గోడ ఎక్కి విరగపడతాడు. ఏడు నెలలు వైద్యం చేయించుకున్నా విరిగిన అతని కుడి చెయ్యి స్వాధీనంలోకి రాదు. దీనితో నీరు మోసే కార్యక్రమాన్ని విరమించుకోవలసి వస్తుంది. ఈలోగా సింహాచలం మరణిస్తుంది. గంగాధరుని తల్లి మందపల్లి గ్రామవాసియైన కోటకోనప్ప అనే బ్రాహ్మణుని కుమార్తెను కొడుక్కిఇచ్చి వివాహం చేస్తుంది. అప్పుడు పెళ్లికూతురు సింగమ్మ వయసు రెండు సంవత్సరాలు మాత్రమే. నాలుగు వందల రూపాయల కన్యాశుల్కం ఇచ్చి కొడుకుని ఒక ఇంటివాణ్ని చేశానని సంతోషిస్తుంది. గంగాధరునికి యాభై మూడవ సంవత్సరం జరుగుతుండగా, సింగమ్మతో అతనికి పునఃసంధానమవుతుంది. ఆపైన నాలుగు సంవత్సరాలకు కథానాయకుడు గణపతి వాళ్లకు జన్మిస్తాడు. గణపతి ఆకారముచేతగాని, చేష్టలు చేతగాని తోకలేని కొండముచ్చు. మొగము మీద తిరుగలి గంట్లవలె మశూచికము మచ్చలు. కుడికన్ను మెల్ల. దొడ్డికాళ్లు, గుజ్జు రూపము, శరీరము నిండా రోమాలు. పెద్ద బొజ్జ. వికృత రూపము, భూమికి జానెడున్న అతనిని వామనునితో పోల్చవచ్చును. సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- చిలకమర్తి లక్ష్మీ నరసింహం