వినమరుగైన

మాలపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ శతాబ్దపు తొలి నాళ్లలో తెలుగు భాషకు ప్రజలకు విశిష్ట సేవ లందించిన ప్రముఖులలో ఉన్నవ లక్ష్మీనారాయణ గారొకరు. ఆంధ్రాభ్యుదయాన్ని కాంక్షించినవారి గుండె లోతుల నుండి పెల్లుబికి వచ్చిన అక్షర రూపం సంతరించుకొన్న నవల మాలపల్లి. ‘‘కవయఃక్రాంతదర్శినః’’ అన్నారు నవల వ్రాసినవారిని కవి అనటం సంప్రదాయం కాదుగాని ఉన్నవవారు వ్రాసిన నవలలో క్రాంతదర్శన లక్షణం పరిపుష్టంగా కనిపిస్తుంది. ఈ నవల గురిచి తెలిసికొనే ముందు రచయిత గురించి ఆనాటి సామాజిక రాజకీయ పరిస్థితుల గురించి కొంత అవగాహన అవసరం.
పలనాటి సీమలోని సత్తెనపల్లి తాలూకా వేములూరుపాడులో 1877లో శ్రీ ఉన్నవ వారు జన్మించారు. నవలకు కథాస్థలమైన మంగలాపురం కూడా ఆ ప్రాంతంలోనిదే. 1897లో మెట్రిక్యులేషన్ పూర్తి అయిన తరువాత ఉపాధ్యయ, న్యాయవాద వృత్తులలో కొంతకాలమున్నారు. 1914-16 మధ్యకాలంలో ఐర్లండులోని డబ్లిన్‌లో బారెట్‌లా పూర్తిచేసికొని 1917లో మద్రాసు హైకోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఇలా ఒకవైపు వారి జీవితం సాగుతూ వుంటే మరొకవైపు వారి సేవా దృక్పథం సమాజ శ్రేయస్సుకు ప్రేరేపించింది. చిన్న వయసులోనే వారు దీనికి నడుం కట్టారు. గుంటూరులో 1900 సం.లోనే యంగ్‌మెన్స్ లిటరరీ సొసైటీని, 1902లో వితంతు శరణాలయాన్ని స్థాపించారు. వీరేశలింగంగారి అధ్యక్షతన గుంటూరులో తొలి వితంతు వివాహం జరిపించారు. ఆ తరువాత మరొక 40 వితంతువుల వివాహాలు తామే స్వయంగా జరిపించారు. 1922లో గుంటూరులో స్ర్తిలకొరకు శారదానికేతన్ స్థాపించి స్వయంగా నిర్వహించారు.
దీనికంతకు వున్నవారి సేవా దృక్పథం కారణమైతే, ఆనాటి దేశ పరిస్థితులు ఆయన్ను రాజకీయ రంగప్రవేశం చేయించాయి. తిలక్ బిపిన్ చంద్రపాల్, లాలా లజపతిరాయ్ మున్నగువారి ప్రభావం వారిపైన ఉన్నది. 1907 నాటికే వారు బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలు తెలుగు చేశారు. అయితే అప్పటికి స్వరాజ్పోరాటానికి ఒక స్పష్టమైన మార్గం ఏర్పడలేదు. 1915లోగాని గాంధీజీ స్వరాజ్య పోరాట రంగప్రవేశం జరుగలేదు. 1916లో వారు డబ్లిన్ నుండి తిరిగి వచ్చిన తరువాత స్వరాజ్యోద్యమ ప్రభావం ఆయనపైబలంగా పడింది. బ్రిటీషు పాలకులు భారతీయుల్ని అణగద్రొక్కటానికి రకరకాల చట్టాలు అమలులోకి తెచ్చారు.
1917 నుండి 1919 వరకు పాలకులు తెచ్చిన మాంటేగ్ సంస్కరణలు, రౌలత్ చట్టం, ఆర్డినెన్స్‌ల పరిపాలన మున్నగువానిపై జాతీయవాదులు తీవ్రంగా స్పందించారు. 1921లో జరిగిన బెజవాడ కాంగ్రెస్ మహాసభ ప్రజల్లో దేశ భక్తి పొంగలు వారించింది. అపుడు ఉన్నవవారు గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. పలనాటి పుల్లరి సత్యాగ్రహానికి తిరుగులేని నాయకుడై నడిపించి రాయవెల్లూరు జైలులో శిక్షననుభవించారు. ఈ నవల వ్రాసింది కూడా అప్పుడే.
1923 నాటికి స్వరాజ్య పార్టీ సభ్యులై ఆ పార్టీ ఉపాధ్యక్ష పదవికి ఎదిగారు. ఆ తరువాత కూడా మరొక రెండుసార్లు స్వరాజ్యోద్యమంలో జైలుశిక్షననుభవించారు.

--సశేషం
----------------------
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-- ఉన్నవ లక్ష్మీనారాయణ