వినమరుగైన

బారిష్టర్ పార్వతీశం- మొక్కపాటి నరసింహశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటి భాగం వచ్చిన నలభై సంవత్సరాలకు నార్ల వెంకటేశ్వరరావుగారు, దాన్ని ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురిస్తూ మిగిలిన నాలుగు భాగాలు వ్రాయమని ప్రోత్సహించారు. మొక్కపాటివారు చెప్పగా కప్పగంతు రాజేశ్వరి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మలు లేఖకులుగా మిగిలిన రెండు భాగాలు పూర్తయినాయి. 1971ల మూడు భాగాలు ముద్రింపబడ్డాయి.
మొదటి భాగంలో గోదారి జిల్లా మొగల్తూరులో వేమూరి వారింట పార్వతీశం జన్మించటం- బాల్యం- నరసాపురంలో హైస్కూలు చదువు- లాయర్ల సాంగత్యం- ఫిఫ్త్ఫారం చదువుతుండగా ఎవరో దేశాన్ని బాగుచేయాలంటే, ఇంగ్లండు వెళ్లి బారిష్టరు చదవాలని చెప్పటం- అది విని ఇంటి దగ్గర చెప్పా పెట్టకుండా ప్రయాణం కావటం- దారిలో భంగపాట్లు చివరకు ఇంగ్లండు చేరటం మొదలైన కథాంశాలున్నాయి.
రెండో భాగంలో స్కాట్‌లాండ్ ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎం.ఏ ఇంగ్లండులో బారిష్టరు చదువు అక్కడి ఆచార వ్యవహారాలు ఛేదించడంవల్ల అగచాట్లు- ఆ భంగ్లపాట్లలో వినోదం- చదువు పూర్తి- స్వదేశం తిరుగు ప్రయాణం మొదలైన విషయాలున్నాయి.
మూడో భాగంలో పార్వతీశం వివాహం- లాయరు ప్రాక్టీసు- స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనటం మొదలైన విషయాలున్నాయి.
మన ఆంధ్ర సాహిత్యంలో హాస్యరస ప్రధానమైన గ్రంథాలు తక్కువ. ప్రాచీన సాహిత్యంలో మరీ తక్కువ. హాస్యం, వ్యక్తి హుందాతనాన్ని, గౌరవాన్ని తగ్గిస్తుందని ప్రాచీన కవుల అభిప్రాయం. ఒక్క నాటకాల్లో మాత్రం హాస్యానికి విదూషకుడి పాత్ర వుంటుంది. ఆ పాత్రకు గౌరవం కూడా అంతంత మాత్రమే. ఆధునిక కాలంలో కందుకూరి, పానుగంటి, చిలకమర్తి, కొన్ని హాస్యరచనలు చేసి, ఈ రసానికి గౌరవం పెంచారు. అదే దారిన మొక్కపాటివారు రచించిన హాస్యరస ప్రధాన గ్రంథమే బారిష్టరు పార్వతీశం.

- సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-పింగళి వెంకట కృష్ణారావు