వినమరుగైన

బారిష్టర్ పార్వతీశం- మొక్కపాటి నరసింహశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్య జీవితంలో అందునా స్వస్థానం మారినపుడు ఎదురయ్యే ఎన్నో విషయాలను ఎలా చమత్కారంగా చెప్పవచ్చో ఈ గ్రంథం చదివితే తెలుస్తుంది. శాస్ర్తీగారు మొదటిభాగం పీఠికలో నౌకాయానాన్ని అనేక హాస్య సంఘటనలతో, సన్నివేశాలతో కథలు కథలుగా వర్ణించిన డబ్ల్యు.డబ్ల్యు.జేకబు ప్రస్తావన తెచ్చారు. దీన్ని బట్టి ఆ ఆంగ్ల రచన శాస్ర్తీగారి రచనకు ప్రేరణ అని భావించవచ్చు.
మన ప్రాచీన లాక్షణికులు వికృత వేష భాషా చేష్టలవలన కలిగేదే హాస్యమని నిర్వచించారు. ఈ రసము యొక్క స్థారుూ భావం హాసము, కష్టం, అనుమానం, అసూయ, చపలత, ఆలోచనా రహితమైన వాక్కు పని, హాస్యానికి హేతువులవుతాయి. హాస్యం, ఆత్మస్థం, పరస్థం అని రెండు విధాలు. హాస్యానికి తానే స్థానం కావటం ఆత్మస్థం. ఇతరులు కారణం కావటం పరస్థం.
పార్వతీశం కథలో అతడే నాయకుడు. అతని చేష్టలవల్లనే హాస్యం ఉత్పన్నమవుతున్నది. అందువల్ల దీన్ని ఆత్మస్థమైన హాస్యం అనవచ్చు. స్వస్థాన వేషభాషాదులలో వచ్చిన మార్పువల్ల పార్వతీశం పొందిన భంగపాటే ఇక్కడ హాస్యానికి ఆలంబనం.
మొదటి భాగంలో కొన్ని హాస్య సన్నివేశాలు చూద్దాము. పార్వతీశం నరసాపురంలో చదువుకొనే రోజుల్లో ఇనస్పెక్టరొకనాడు స్కూలు తనిఖీకి వచ్చాడు. ‘ఎటువంటి వస్తువు పైనపడితే కాంతికిరణం పరావర్తనం చెందుతుంది’ అని పార్వతీశాన్ని ప్రశ్నించాడు. ఇనస్పెక్టరుగారి బట్టతల, పాకకప్పులోని రంధ్రం గుండా పడుతున్న సూర్యకిరణాలలో మెరిసిపోతున్నది. టక్కున ‘బట్టతలండీ’ అని సమాధానం చెప్పాడు పార్వతీశం. ఇంకేముంది ఇనస్పెక్టరుగారి ఆగ్రహం, అధ్యాపకుని అగచాట్లు, పిల్లల నవ్వులు. ఈ సన్నివేశంతో పార్వతీశం పాత్రలో హాస్యబీజాలు నాటారు మొక్కపాటివారు.
అప్పటిదాకా పార్వతీశం రైలు ప్రయాణం చేసి కూడా ఎరుగడు. ఎవరో అన్నమాట పట్టుకొని నిడదవోలు, మద్రాసు, కొలంబోల మీదుగా ఇంగ్లండు ప్రయాణం కట్టాడు. హేళన చేస్తారని ఎవరినీ ఏమీ అడగలేదు. పైగా ఇంటిదగ్గర చెప్పకుండా ప్రారంభించిన ప్రయాణమాయె. తన తెలివితేటలనుపయోగించి ప్రయాణ సామగ్రి సిద్ధం చేసుకున్నాడు. దంతధావనానికి కచికిలపొడి, నాలుక గీసుకొనటానికి తాటాకులు, పడుకుంకటానికి నరసరావుపేట మడతమంచం, మొలత్రాడు రొట్టెలు కాల్చటానికి పెనం, స్టౌవ్ అన్నీ ఒక సీనారేకుపెట్టెలో నింపాడు. పార్వతీశానికి మొదటి ఇబ్బంది, పాఠకులకు వినోదం నిడదవోలులో అందించారు మొక్కపాటివారు.
పార్వతీశం రైల్వే కౌంటర్ దగ్గరకు పోయి ఒక టిక్కటివ్వమన్నాడు. ఏ ఊరికి అన్నాడు స్టేషన్ మాస్టరు. ఏ వూరికెళ్లితే నీకెందుకు టిక్కట్టివ్వమంటాడు పార్వతీశం. అతని అమాయకత్వం ఇక్కడ అందరిని నవ్వించింది.
మద్రాసులో బాగుంది కదా అని ఆడవాళ్ళ పెట్టుకునే టోపీ కొని, దాన్ని పెట్టుకొని అవహేళన పాలయ్యాడు పార్వతీశం.
భోజనశాలలో ఫోర్కులు, చంచాలు ఉపయోగించలేక చేతితో తింటం మహా అపరాధమైపోయిది. అందరూ వింతగా చూచి నవ్వారు. దేశం మారేటప్పటికి వచ్చిన తిప్పలివి. ఫ్రాన్సులో ఒక షాపులో, తివాచీమీద నడవకూడదనుకొని, ప్రక్కనే మైనం పాలీషు పెట్టిన చక్కలమీద నడవపోయి జారిపడ్డాడు. స్టీమరులో మూత్ర విసర్జన ఎక్కడ చెయ్యాలో తోచక గిలగిల్లాడిపోయాడు. - సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..