వినమరుగైన

బారిష్టర్ పార్వతీశం- మొక్కపాటి నరసింహశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనాటి సాంఘిక రాజకీయ పరిస్థితులను కూడా చిత్రించి మొక్కపాటి వారు గ్రంథ గౌరవం పెంచారు. చివరిగా ఒక్కమాట. ప్రథమభాగంలో పార్వతీశం అనామకుడు. కాని రెండు మూడు భాగాల్లో రచయిత పార్వతీశంలో కొంత ప్రవేశించాడనిపిస్తుంది. మొదటిభాగంలో, పార్వతీశం తండ్రిని అనాగరికుడుగా, చదువురానివాడుగా, వ్యవసాయదారునిగా చిత్రించిన రచయిత మూడవ భాగంలో ఆ పాత్రను ప్రాజ్ఞునిగా, సంస్కారవంతునిగా మార్చాడు. దానిని మొదట భాగం రచనకు, తరువాత భాగాల రచనలకు వున్న కాలవ్యవధి కారణం కావచ్చు. లేక రచయిత తనను పార్వతీశం పాత్రలో దర్శించుకొనటం కావచ్చు.పార్వతీశం అనగానే గిరీశం గుర్తుకువస్తాడు. పేర్లలో కూడా పోలిక వున్నది. కానీ స్వభావాలు వేరు. గిరీశం ఇతరులను ఇబ్బందిపెట్టి హాస్యాన్ని కలిగిస్తాడు. పార్వతీశం తాను ఇబ్బంది పడి ఇతరులకు హాస్యం అందిస్తాడు. మరో ప్రసిద్ధ పాత్ర గణపతి. ఇతడు వికృత వేషభాషలు అజ్ఞానంతో హాస్యానికి కారణభూతుడౌతాడు.మొక్కపాటి నరసింహశాస్ర్తీ బారిష్టరు పార్వతీశంలో పోషించిన హాస్యం బహుధా ప్రశంసనీయం. నీటుగా గీరగా నడిచే వ్యక్తి కాలుజారి మురికి కాలువలో పడి లేస్తే హాస్యంగాని, లారీ క్రింద పడి చస్తే హాస్యమేముంది. స్వస్థలం విడిచిపెట్టినపుడు అన్ని కష్టాలలో ఆదుకొనేది ప్రధానంగా ధనం. పార్వతీశానికి తండ్రి పుష్కలంగా ధనం పంపాడు. మార్గంలో మీనన్, స్కాట్‌లాండ్‌లో రాజు అనే గోదావరి జిల్లా యువకుడు మిత్రులై పార్వతీశాన్ని చాలా ఇక్కట్లనుండి కాపాడారు.
ఆ విధంగా పార్వతీశానికి ఘోరాల్ని తప్పించి భంగపాట్లు, పొరపాట్లు మాత్రమే సృష్టించి హాస్యాన్ని పండించిన మొక్కపాటివారి కథా కథన చాతుర్యం అమోఘం. 1973లో స్వర్గస్తులైన వీరు ఆధునిక హాస్యరచయితలలో ప్రముఖులుగా ఖ్యాతి గడించారు. గతిస్తున్న శతాబ్దం ఇలాంటి ఎందరో మహనీయులతో సుసంపన్నమయింది.
రాబోయే శతాబ్దం ఇంతకుమించిన భాగ్యశాలి కాగలదని ఆశిద్దాం. -సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- మొక్కపాటి నరసింహశాస్ర్తీ